Friday, May 22, 2026

ఏ మహాత్ములైనా ఆరోగ్యాన్ని జయించవచ్చేమో గాని మరణాన్ని జయించలేరుగా

ఏ మహాత్ములైనా ఆరోగ్యాన్ని జయించవచ్చేమో గాని మరణాన్ని జయించలేరుగా  

విశ్వ ప్రకృతి పంచభూతాలతో శక్తి సామర్థ్యాలు గ్రహించినా అనుగ్రహించినా ఆరోగ్యంతో శ్రమించలేని కాల సమయం మరణాన్ని కలిగించునేమో 

కాలంతో జీవించు మహాత్ములు ఈనాటికి జీవిత కాలాన్ని మించి విశ్వంలో ఎక్కడైనా పర ధ్యాస శ్వాసతో జీవిస్తున్నారా 

కాలంతో నేర్చిన శక్తి సామర్థ్యాలన్నీ ఏ సమయానికైనా కాలానికే తిరిగి ఇచ్చి పోయేలా కాల జ్ఞాన విశ్వ ప్రకృతి సిద్ధాంతం పంచభూతాలతో సాగుతున్నది 

విజ్ఞానమైన ఆరోగ్యమైన అనుబంధమైన ఐశ్వర్యమైన అద్భుతమైన ఆశ్చర్యమైన సర్యం కాలానికే చెందుతుంది సమయానికే నిన్ను విడిచిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, May 21, 2026

సూర్యోదయమా నీ దర్శనం అంతస్తులకే పరిమితమా నీ సూర్యాస్తమయం కూడా అంతస్తులకే పరిమితమా

సూర్యోదయమా నీ దర్శనం అంతస్తులకే పరిమితమా నీ సూర్యాస్తమయం కూడా అంతస్తులకే పరిమితమా 

-- వివరణ ఇంకా ఉంది!

విశ్వ విజ్ఞానంతో నిద్రించుట మేధస్సుకైనా సాధ్యమగునా

విశ్వ విజ్ఞానంతో నిద్రించుట మేధస్సుకైనా సాధ్యమగునా 

-- వివరణ ఇంకా ఉంది! 

ఏదీ లేని ఐశ్వర్యంతో మళ్ళీ కలుసుకుంటానో లేదో మిత్రబంధుజనమా

ఏదీ లేని ఐశ్వర్యంతో మళ్ళీ కలుసుకుంటానో లేదో మిత్రబంధుజనమా  


-- వివరణ ఇంకా ఉంది1

సమయమైనది మిత్రమా! ఇక కాలంతో సాగిపోయి కలసిపోవాలి పంచభూతాలతో

సమయమైనది మిత్రమా! ఇక కాలంతో సాగిపోయి కలసిపోవాలి పంచభూతాలతో ప్రేమగా శూన్యమవ్వాలి ప్రశాంతంగా ఎవరికీ కనిపించకుండా పరిశుద్ధమవ్వాలి నీ శరీరం పరిపూర్ణమవ్వాలి నీ దేహం శ్వాసతో సువాసనగా సుగంధాలతో పరిమళించాలి పుష్పాలతో ప్రకృతిలోనే ఉదయించాలి సూర్యోదయంతో బంధాలతో చిగురించాలి పర్యావరణంగా మహా ప్రదేశంగా మహోదయమైన భావాల స్వభావాల తత్వాలతో మహా విజ్ఞాన వేదాలతో విశ్వమై అవతరించాలి బ్రంహాండాన్నే దర్శించాలి కాలంతో సమయమై మళ్ళీ జీవించాలి ఆకార రూపాల తేజోదయంతో  

సమయమైతే చాలు మిత్రమా ఎన్ని కార్యాలున్నా ఎలా ఏ పరిస్థితులతో ఉన్నా ఎన్ని బంధాలతో ఉన్నా ఎక్కడ ఎలా ఏ కార్యంతో ఉన్నా ఏ ధ్యాస శ్వాస నీలో ఉన్నా ప్రతీది శూన్యమయ్యేలా ఆ క్షణమే నిన్ను కాలం వెంట సాగిస్తూ పంచభూతాలతో ప్రయాణింపజేస్తుంది  

జీవితం ఉన్నంత వరకు ప్రశాంతంగా జీవిస్తూనే నీవు నీ శ్వాస ధ్యాసతో శ్రమిస్తూ ఆరోగ్యంతో అనుబంధాలతో సాగిపో సమయాన్ని సంసార సాగరంగా మార్చుకో 

-- వివరణ ఇంకా ఉంది!

విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకొనుటలోనే కాదు జీవించుటలోనే ఉన్నది మహత్యం

విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకొనుటలోనే కాదు విశ్వ విజ్ఞానంతో జీవించుటలోనే ఉన్నది మహత్యం  

విశ్వ విజ్ఞాన భావ స్వభావాలు తత్వ త్రయములు ఎన్నో దేహంలో జీవిస్తూనే పరిశోధనలు సాగిస్తున్నాయి 
జీవించుటలో ఉన్న విజ్ఞానం కార్యాలలో ఉన్న వేదాంతం విశ్వంలో ఉన్న పరిశోధనల పర రూప ప్రజ్ఞానమే 

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, May 20, 2026

నీవు తెలుసుకున్నదే విశ్వ విజ్ఞానమైతే విశ్వమంతా జీవించే మేధావులలో కలిగే విజ్ఞానమేది

నీవు తెలుసుకున్నదే విశ్వ విజ్ఞానమైతే విశ్వమంతా జీవించే మేధావులలో కలిగే విజ్ఞానమేది  

విశ్వ విజ్ఞానం మొత్తం ఒక్కరి మేధస్సులోనే కలగదు ఒకరికే అర్థమవ్వదు ఒకరిలోనే నిలవదు 
విశ్వ కాలంతో పాటు సాగే విజ్ఞానుల మేధస్సులలో వారి వారి పరిశోధనలలో కొంత కొంతగా గ్రహింపబడుతుంది 

విశ్వంలో జరిగే మహా కార్యాలన్నీ కొంత వరకు విశ్వ విజ్ఞానుల పరిశోధనల మూల కారణ అనుభవమే 
విశ్వ విజ్ఞానం కాలంతో పాటు మేధావుల జీవిత కార్యాలతో పాటు సాగుతూనే కొత్త కొత్త ఆలోచనలతో సాగిపోతుంది 

మేధస్సును ఎంత విశాలంగా బ్రంహాండంతో పరిశోధిస్తూ ఆలోచింపజేస్తే విశ్వ విజ్ఞానం కూడా అంతగా అనంతమై చేరుతుంది 

విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే అణువు నుండి బ్రంహాండం వరకు కాలంతో సాగుతూ సర్వ కార్యాలను పరిశోధన చేస్తే కొంత మేరకు తెలుస్తుంది 

విశ్వ విజ్ఞానం సంపూర్ణంగా తెలియాలంటే విశ్వ మేధావుల మేధస్సులలోని విజ్ఞానాన్ని పరిశోధిస్తూ నిత్యం విశ్వంతోనే ప్రకృతితోనే జీవించే భావ స్వభావ తత్వాలు పరమాత్మగా ఎప్పుడూ నీలోనే ఉండాలి 

-- వివరణ ఇంకా ఉంది!


నీవు వేసే అడుగు ఎక్కడిదో ఎక్కడికో ఎటువంటిదో తెలుసుకో

నీవు వేసే ప్రతి అడుగు ఎక్కడిదో ఎక్కడికో ఎటువంటిదో తెలుసుకో  

నీవు వేసే అడుగు నేలపైనదా నీవు వేసే అడుగు నీటిపైనదా 
నీవు వేసే అడుగు గాలిలోనిదా నీవు వేసే అడుగు మంటలలోనిదా 

నీవు వేసే అడుగు విజ్ఞానానికా నీవు వేసే అడుగు పరిశోధానికా 
నీవు వేసే అడుగు సూర్యోదయానికా నీవు వేసే అడుగు సూర్యాస్తమయానికా 

నీవు వేసే అడుగు ప్రకృతిలో ఉన్నదా నీవు వేసి అడుగు అరణ్యంలో ఉన్నదా 
నీవు వేసే అడుగు మలినంపై ఉన్నదా నీవు వేసే అడుగు కలుషితంలో ఉన్నదా 

ఏ అడుగు వేసినా విజ్ఞానంగా సాగే ఆలోచన నీ మేధస్సులో పరిశోధిస్తూ విశ్వమంతా పరిభ్రమిస్తున్నదా 

అడుగులు ఎన్నైనా విజ్ఞానంతో వేస్తే కాలంతో సాగే నీ కార్యాలే స్వచ్ఛమైన పరిపూర్ణమైన ప్రదేశాన్ని చేర్చేనుగా 


-- వివరణ ఇంకా ఉంది!

ఐశ్వర్యవంతమైన ఇల్లు అద్దం లాంటిది

ఐశ్వర్యవంతమైన ఇల్లు అద్దం లాంటిది ఏది పగిలినా ఖరీదు ఖర్చులకు కూడా భారం అవుతుంది 

ఐశ్వర్యమైన ఇంటిలో కొత్తగా ఎవరైనా ఉండాలనుకున్నా జీవించాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి 
శ్రమించే వారు సహనంతో ఉండాలి ప్రతీది అద్దంలా జాగ్రత్తగా చూసుకోవాలి నెమ్మదిగా నడుచుకోవాలి 

ఇంటిలో చాలావరకు యంత్రములే పనిచేస్తాయి యంత్రములు పనిచేసే విధానం వాటిని ఉపయోగించే విధానం విజ్ఞానం మనకు తెలియాలి యంత్రములు పని చేసిన తర్వాత వాటిని అలాగే సక్రమంగా శుభ్రతతో ఉంచాలి  

ఏ పని మనమే చేయాలన్నా చాలా ధనం మనతో ఉండాలి ఏది తీసుకు రావాలన్నా వారికి నచ్చినదే ఉండాలి 
ప్రతీది నాణ్యతగా ఉంటేనే ఖరీదు చేయాలి చూడటానికి కూడా ఆడంభరంగా ఉండాలి ఆనందం కలిగించాలి 

మనుషుల మాటలు కూడా అద్దంలా ఉండవచ్చు కొన్ని సందర్భాలలో మనస్సు పగిలిపోవచ్చు 
అదుపుగా ఉంటేనే పొదుపుగా ఎదగవచ్చు శ్రమతో సహనంగా ఉంటేనే సక్రమంగా సాగవచ్చు 

పగిలిపోయిన వస్తువు లాంటిది దొరక్కపోవచ్చు అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి సహనంతో సాగాలి 
(ఒక వేళ ఎక్కడైనా దొరికే వస్తువు ఉన్నా తీసుకురావడానికి ఎంతో శ్రమ సామర్థ్యం ధనం సమయం  అవసరమవుతుంది)

-- వివరణ ఇంకా ఉంది!
 

Tuesday, May 19, 2026

గొప్పతనం కోసం శ్రమించు గెలుపు కోసం సాధించు గౌరవం కోసం జీవించు

గొప్పతనం కోసం శ్రమించు గెలుపు కోసం సాధించు గౌరవం కోసం జీవించు  
కుటుంబంలో గొప్పతనం గెలుపు గౌరవం ఎల్లప్పుడూ సాగుతూనే ఉండాలి 

విజ్ఞానంతో శ్రమిస్తూ అందరితో సంభాషిస్తూ నైపుణ్యాన్ని గ్రహిస్తూ సహనంతో సాధనను సాగిస్తూ గౌరవమైన విజయాన్ని సాధించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

కోపం ఉన్న గృహంలో ఖరీదైన వస్తువులు ఉంటే ఫలితం లేదు

కోపం ఉన్న గృహంలో ఖరీదైన వస్తువులు ఉంటే ఫలితం లేదు 
ఖరీదైన వస్తువులు ఎప్పటికైనా కోపానికి ఉపయోగం లేకుండా పోతాయి 
అలవాట్లు ఎక్కువ ఉన్న ఇంట్లో కూడా ఖరీదైన వస్తువులు కూడా అశుద్ధం కావచ్చు 

వాడకం తెలియని అజాగ్రత్తగా సాగే వారి ఇంట్లో కూడా విలువైన వస్తువులు ఉంటే ప్రయోజనం లేదు 
కోపతాపాలు దేనినైనా తెంచేస్తాయి విరిచేస్తాయి పారవేస్తాయి విసిరేస్తాయి తొక్కేస్తాయి ముంచేస్తాయి 
 
శాంతం ఉన్న ఇంట్లో ఏదీ లేకున్నా ప్రశాంతంగా ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!

 

నీవు ఎదగలేదంటే నీ చుట్టూ ఉన్న నీ వారిని నీవు గెలిపించలేదని తెలుస్తుంది

నీవు ఎదగలేదంటే నీ చుట్టూ ఉన్న నీ వారిని నీవు గెలిపించలేదని తెలుస్తుంది 

నీవు విజయం సాధిస్తే నీ కుటుంబం గెలిచిందని నీ వారికి గొప్పగా తెలుస్తుంది   

నిత్యం శ్రమిస్తూ విజ్ఞానంతో సాగిపోతే నీ సాధన నైపుణ్యమే నిన్ను గెలిపిస్తుంది 

నీలో ఉన్నది మహా సత్యం ఐతే సుగుణాల స్వభావ తత్వాలే నిన్ను గెలిపిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

శ్రమించుటలో కఠినత్వం ఉన్నది సులువైనది ఉన్నది

శ్రమించుటలో కఠినత్వం ఉన్నది సులువైనది ఉన్నది 

కఠినత్వంతో శ్రమించే సామర్థ్యం కలిగితే సాధనకు సహకారం విజయాన్ని అందిస్తుంది  
సులువైన విధానంతో శ్రమించే సామర్థ్యం కొన్ని వేళలలో విజయాన్ని అందుకోలేక పోవచ్చు 

శ్రమించుటలో కఠినత్వం సులువైన విధానం కన్నా నైపుణ్యంతో కూడిన విజ్ఞానం అనుభవాన్ని కలిగిస్తూ విజయాన్ని అందిస్తుంది 

-- వివరణ ఇంకా ఉంది!

జీవించుటలో తెలియని జీవిత కాలం శ్రమించుటలో తెలుస్తున్నదా

జీవించుటలో తెలియని జీవిత కాలం శ్రమించుటలో తెలుస్తున్నదా 
శ్రమించుటలో కలిగే అనారోగ్యం శరీరానికి నిరసనగా కలుగుతున్నదా 

జీవించుటలో శరీరమేగా అన్ని భారాలను బాధ్యతలను మోయగలిగే జీవ పదార్థము   
జీవ పదార్థంలో సామర్థ్యం ఉన్నంత వరకే జీవించుటలో ఎన్నో కార్యాలను బంధాలతో బాధ్యతగా సాగిస్తుంది 

అనారోగ్యంతో కలిగే ఇబ్బందులు సమస్యలు జీవిత కాలాన్ని గుర్తుచేస్తూ బంధాలను తలచుకుంటూ తపిస్తాయి 
 

-- వివరణ ఇంకా ఉంది!

ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే జీవితంలో గెలిచే వారు చాలా తక్కువగా ఉంటారు

ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే జీవితంలో గెలిచే వారు చాలా తక్కువగా ఉంటారు 

గెలిచిన వారి కంటే ఓడిపోయిన వారికే ఎక్కువ సమస్యలు వివిధ రకాలుగా తెలుస్తాయి  

ప్రతి గుంపు నుండి ఒక్కరే విజయం సాధిస్తారు 
ఒక తరగతి నుండి ఒక్కరే విజయంతో వస్తారు 

ప్రతి సంస్థలో ఒక గుంపు లేదా తరగతి లేదా విభాగం నుండి ఒక్కరే విజేయుడిగా ఎదుగుతారు 
గుంపు ఐనా తరగతి ఐనా విభాగమైన ఎంత పరిమాణంలో ఉన్నా ఒక్కరినే విజేతగా గుర్తిస్తారు 

విజయం అంటే మొదటి స్థానమని అది ఒక్కరికే కలిగేలా మన జీవన విధానం ఎదుగుతున్నది 
శ్రమించిన వారిలో ఒక్కరికే మొదటి స్థానం ఒక్కరికే ప్రశంశలు ఒక్కరికే మెరుగైన భవిష్య విజ్ఞానం ఐశ్వర్యం అవకాశం 
శ్రమించిన వారి సమస్యలు పరిస్థితులు ఆందోళనకరంగానే మిగిలిపోతూ సాగిపోతూ జీవన విధానం ఒదిగిపోతూనే ఉంటుంది 

ఐశ్వర్యం ఉంటే సౌకర్యం లేకపోతే శ్రమకార్యం 
ఓడిపోయిన వాడు శ్రమకార్యం చేస్తేనే విజయం పొందినవారికి ఐశ్వరం సౌకర్యం లభిస్తుంది 

గెలిచినవాడు విజ్ఞానవంతఁడు ఓడిపోయి శ్రమిస్తున్నవాడు సమర్థుడు (సామర్థ్యం కలవాడు) 

-- వివరణ ఇంకా ఉంది!

శరీరానికి ఆరోగ్యం ఉంది అనారోగ్యం ఉంది

శరీరానికి ఆరోగ్యం ఉంది అనారోగ్యం ఉంది 
శరీరానికి ఆహారం ఉంది ఆయుస్సు ఉంది 

శరీరానికి ఉచ్చ్వాస ఉంది నిచ్ఛ్వాస ఉంది 
శరీరానికి ప్రయాస ఉంది ప్రత్యూష ఉంది 

శరీరానికి శ్వాస ఉంది ధ్యాస ఉంది 
శరీరానికి రూపం ఉంది ఆకారం ఉంది 

శరీరానికి శ్రమ ఉంది భ్రమ ఉంది 
శరీరానికి ఖ్యాతి ఉంది కీర్తి ఉంది 

శరీరానికి బంధం ఉంది సంబంధం ఉంది 
శరీరానికి అనుబంధం ఉంది అభిమానం ఉంది 

శరీరానికి కారణం ఉంది మరణం ఉంది 
శరీరానికి ప్రయాణం ఉంది ప్రమాదం ఉంది 
 
శరీరానికి సామర్థ్యం ఉంది సహనం ఉంది 
శరీరానికి లక్ష్యం ఉంది లక్షణం ఉంది 

శరీరానికి గమనం ఉంది గ్రహణం ఉంది 
శరీరానికి అర్థం ఉంది పరమార్థం ఉంది 

శరీరానికి జీవనం ఉంది జీవితం ఉంది 
శరీరానికి సమయం ఉంది కాలం ఉంది 

శరీరానికి మరుపు ఉంది జ్ఞాపకం ఉంది 
శరీరానికి స్వభావం ఉంది తత్త్వం ఉంది 

శరీరానికి ఆనందం ఉంది సంతోషం ఉంది 
శరీరానికి ఆలోచన ఉంది విమోచన ఉంది 

శరీరానికి ఆర్భాటం ఉంది నిర్గంధనం ఉంది 
శరీరానికి మితృత్వం ఉంది శతృత్వం ఉంది 

శరీరానికి ఎన్నున్నా జీవించుటలో ఎన్నో సాగుతూ ఒక సమయంలో తుది శ్వాసగా శూన్యమై మరణిస్తుంది 

-- వివరణ ఇంకా ఉంది!

ఐశ్వర్యంతో ఆహారాన్ని వృధా చేయకు

ఐశ్వర్యంతో ఆహారాన్ని వృధా చేయకు   
అజ్ఞానంతో ఆహారాన్ని వ్యర్థం చేయకు 

అజాగ్రత్తతో ఆహారాన్ని వృధా చేయకు 
ప్రమాదంతో ఆహారాన్ని వ్యర్థం చేయకు 

ఆకలితో ఆహారాన్ని వృధా చేయకు 
అహంతో ఆహారాన్ని వ్యర్థం చేయకు \

అలవాట్లతో ఆహారాన్ని వృధా చేయకు 
పొరపాట్లతో ఆహారాన్ని వ్యర్థం చేయకు 

అంచనాలతో ఆహారాన్ని వృధా చేయకు 
లాంఛనాలతో ఆహారాన్ని వ్యర్థం చేయకు 


-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధంగా జీవించు అన్నీ పరిశుద్ధమవుతాయి

పరిశుద్ధంగా జీవించు అన్నీ పరిశుద్ధమవుతాయి 
పరిశుద్ధంగా జీవిస్తే సర్వం పరిశుద్ధమవుతుంది సర్వ కార్యాలు పరిశుద్ధంగా సాగిపోతాయి 
ప్రతి జీవి పరిశుద్ధమైతే ప్రకృతి పర్యావరణం పత్రహరితంతో పరిమళిస్తూనే ప్రాణవాయును అందిస్తుంది 

ప్రతి కార్యం పరిశుద్ధంగా సాగితే ప్రజ్ఞానం ఎల్లప్పుడు మేధస్సులో సాగుతూ ఆరోగ్యం ఆయుస్సుతో సాగిపోతుంది 

పరిశుద్ధంగా ఉన్నప్పుడు అజ్ఞానం అజాగ్రత్త ప్రమాదం అహం లేకుండా కాలం సంతోషంగా సాగిపోతుంది 

 -- వివరణ ఇంకా ఉంది!

విజ్ఞానం ఎక్కడో ఉందని అన్వేషిస్తున్నావా

విజ్ఞానం ఎక్కడో ఉందని అన్వేషిస్తున్నావా  

నీ మేధస్సులోనే విజ్ఞానం అపారంగా ఉందని పరిశోధిస్తున్నావా ఏనాడైనా గమనించావా ఎలాగైనా ప్రయత్నించావా 

నీ మేధస్సులోని ఆలోచనలతోనే నీ స్వభావాల ప్రయత్నంతోనే విజ్ఞాన పరిశోధన అన్వేషణగా మొదలవుతుంది 

ఏకాగ్రత కార్యాలోచన గమనం అవగాహన భాషార్థం (పదాల వాక్యార్ధం) తెలిస్తే విశ్వాన్ని తిలకిస్తూ ప్రకృతిని పరిశోధిస్తూ విశ్వ విజ్ఞానాన్ని బ్రంహాండంగా తెలుసుకోవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

ఆలోచన ఆలోచనగా ఉన్నప్పుడు కార్యం మొదలవదు

ఆలోచన ఆలోచనగా ఉన్నప్పుడు కార్యం మొదలవదు 
ఆలోచన ప్రయత్నంతో లేదా అలవాటుతో లేదా సమస్యగా తెలిసినప్పుడు కార్యం మొదలవుతుంది  
మెలకువతో లేదా సూర్యోదయంతో లేదా ఆలస్యంతో లేదా ఆకలితో ఉన్నప్పుడు ఆలోచన కార్యంతో మొదలవుతుంది 

ఆలోచన ఆలోచనలతో ఎక్కువైనప్పుడు కూడా కార్యం మొదలవుతుంది 

జ్ఞాపకాలతో కూడా గమనం ఏర్పడినప్పుడు ఆలోచన కార్యమై సాగుతుంది 

లక్ష్యాన్ని సాధించాలనే తపన ఆలోచనల సాధనతో సాగుతూ కార్యాలుగా సాగిపోతాయి 

ఎక్కడికైనా వెళ్ళాలి ఎలాగైనా ప్రయాణించాలి దేనినైనా సాధించాలి మొదటి స్థానంలో ఉండాలనే తపన కలిగినప్పుడు ఆలోచనలు మహా వేగంతో ఎన్నో రకాలుగా సాగిపోతాయి 

కార్యాలను సాగించేందుకే మేధస్సులో ఆలోచనలు అర్థాల భావ తత్వాలుస్వభావాలు మహా విజ్ఞాన వేదాలు పరిభ్రమిస్తూనే ఉంటాయి 

ఆలోచన ఆలోచనగా ఉన్నప్పుడు మరో ఆలచనలతో కూడా ఆలోచిస్తూనే ఉంటావు 

-- వివరణ ఇంకా ఉంది!

ఒక్కోసారి జీవితం ఎందుకో అనిపిస్తుంది

ఒక్కోసారి జీవితం ఎందుకో అనిపిస్తుంది అలా తోచినప్పుడల్లా ఉన్న దాంతోనే ఉన్న విధంగా శ్రమిస్తూ అభివృద్ధికై అనుబంధాల జీవితానికై జీవన విధానాన్ని సాగించాలి  

మేధస్సులో కలిగే ఆలోచనలు వివిధ పరిస్థితుల ద్వారా మారిపోతూ కొన్ని సందర్భాలలో మనకు నచ్చని విధంగా లేదా విజయం లేని విధంగా బంధాలు సాగుతున్నప్పుడు జీవితం ఎందుకో అనిపిస్తుంది 

మన గుణ లక్షణాలు మనకు నచ్చని విధంగా కూడా సాగిపోతూనే ఉంటాయి 

మన కార్యాలలో నిమగ్నమవుతూ ఉత్తేజమైన విజ్ఞాన ఆలోచనలతో భవిష్యత్ ఒక మహా జీవితమని సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, May 18, 2026

కార్యాలతో సాగిపోతే అనుభవాలే కార్యజ్ఞానమై తెలుస్తున్నదా

కార్యాలతో సాగిపోతే అనుభవాలే కార్యజ్ఞానమై తెలుస్తున్నదా  
కాలజ్ఞానం తెలియుటకే నిరంతరం కార్యజ్ఞానంతో శ్రమిస్తూనే సాగిపోయెదవా 

విజ్ఞానంతో గమనిస్తూ కార్యాలతో సాగిపోతే అవగాహనలో అనుభవాలే కాలజ్ఞానాన్ని తెలిపేనుగా 
పరిశోధనతో ఆలోచిస్తూ కార్యాలతో జీవిస్తే జీవన విధానంలో శ్రమ నైపుణ్యంతో కార్యాజ్ఞానం తెలిసేనుగా 

కార్యాలతో సాగుతున్నప్పుడే శ్రమించుటలో శక్తి సామర్థ్యాలకు సహనం కలిగించేది నైపుణ్యమే 
కాలంతో సాగుతున్నప్పుడు కొత్త కార్యాలలో చేసే పరిశోధనాలలో ఏకాగ్రత కలిగించేది గమనమే 


--  వివరణ ఇంకా ఉంది!

సమాధి కూడా మరొకరికి ప్రయోజనమైతే జీవితం ధన్యమేగా

సమాధి కూడా మరొకరికి ప్రయోజనమైతే జీవితం ధన్యమేగా 
సమాధులన్నీ నేల మట్టం చేస్తే పరిశుద్ధమైన నేలగా మరెందరికో ప్రయోజనమేగా 

పరిశుద్ధమైన ప్రదేశంలో మరణించిన శరీరాలు సమాధులైతే ప్రశాంతంగా పంచభూతాలలో కలిసిపోవునుగా 
స్మశానం పరిశుద్ధమైతే సమాజం కూడా పరిపూర్ణమైన పరిశుద్ధమైన ప్రదేశంగా మారిపోవునుగా (సాగిపోవునుగా)

కార్యాలన్నీ పరిశుద్ధంగా సాగిపోతే అందరిలో కలిగే కార్యాలోచన విజ్ఞానంగా కలిగిపోయేనుగా 

పరిశుద్ధమైన ప్రదేశంలో జీవించుట ప్రతి ఒక్కరికి మహానంద ఆరోగ్యమేగా 

సమాధులన్నీ పరిశుద్ధమైతే ప్రకృతి కూడా పర్యావరణ పరిమళంతో నిండిపోవునుగా 

సమాధుల స్ధలాలు ప్రదేశాలు మరణించిన మరో శరీరాలకు ఆశ్రయం కలిగించే విధంగా ఉండాలి 

నీ సమాధి స్థలం ప్రయోజనం కాకపొతే నీవు మరణించి ఏమి సాధిస్తావు 


-- వివరణ ఇంకా ఉంది!

మహా విజ్ఞాన మేధావి మరణించాక మహాత్ముడని గుర్తిస్తే తన ఆశయం తీరిపోవునా

మహా విజ్ఞాన మేధావి మరణించాక మహాత్ముడని గుర్తిస్తే తన ఆశయం తీరిపోవునా 
మహా మేధావిగా విజ్ఞానం చెందుటలో కాలం ఎంతటి కార్య సాధన పరిశోధనమో శ్రమ తెలుపునా 

గుర్తింపు లేని శ్రమ వేదన విజ్ఞానం సమాజంలో తెలిసే వరకు మహాత్ముడిని ఎవరికీ తెలియును 
గుర్తింపు లేని కార్య క్రమ ప్రజ్ఞానం విశ్వ జగతిలో తెలిసే వరకు మహర్షుడని ఎవరికీ తెలియును 



-- వివరణ ఇంకా ఉంది!

 

జీవించుటలో శరీరం లేదని మరణం తెలుపుతున్నది

జీవించుటలో శరీరం లేదని మరణం తెలుపుతున్నది 
మరణించుటలో దేహమే లేదని ఆత్మ తెలుపుతున్నది  

జీవించుటలో మరణం లేనంతవరకు శ్రమ జీవనం సాగుతుందని మేధస్సు తెలుపుతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

ఆలోచనలను విజ్ఞాన వాక్యాలుగా మార్చుకుంటే బ్రంహ జ్ఞాన కావ్యాలుగా సాగిపోతాయి

ఆలోచనలను విజ్ఞాన వాక్యాలుగా మార్చుకుంటే బ్రంహ జ్ఞాన కావ్యాలుగా సాగిపోతాయి 
ఆలోచనలు పర అర్థాన్ని తెలుపుతాయి పరమార్థాన్ని గ్రహిస్తాయి పరిశోధనను కలిగిస్తాయి 


ఆలోచనలలో అజ్ఞానం కార్యాల నిరర్థకం తెలియని జ్ఞానార్థం గ్రహించలేని అనర్థకం పరోశోధించలేని గమనార్థం 


-- వివరణ ఇంకా ఉంది! 

తెలుగు నేర్చుకున్న వాడు విశ్వ విజ్ఞానవంతుడు

తెలుగు నేర్చుకున్న వాడు విశ్వ విజ్ఞానవంతుడు 
తెలుగు చదువుకున్న వాడు మహా విద్యావంతుడు  

తెలుగు మాట్లాడే వాడు మహోదయ మేధావుడు 
తెలుగు రచించు వాడు మహాజ్ఞాన మహనీయుడు 

తెలుగు అర్ధాన్ని గ్రహించు వాడు మహా మహాత్ముడు 
తెలుగు పరమార్థాన్ని గమనించు వాడు మహర్షుడు 

తెలుగు పరిశోధన చేయువాడు మహా విద్వాంసుడు 
తెలుగు పరిశుద్ధతతో సంభాషించు వాడు పండితుడు  

తెలుగు అభివృద్ధితో జీవించు వాడు విశ్వ గురుదేవుడు 
తెలుగు పరిపూర్ణతతో నిలిచే వాడు పూర్వ వేదాంతుడు 

తెలుగు వెలుగుతో ప్రయాణించే వాడు ఉపాధ్యాయుడు 
తెలుగు పలుకుతో పరిభ్రమించు వాడు అధ్యాపకుడు  

తెలుగు యొక్క గొప్పదనం మన జీవన విధాన మాటలతోనే పలుకులతోనే పరిశుద్ధమైన భావ తత్వాల స్వభావాలతోనే సుగుణాల అలవాట్లతోనే విశ్వమంతా సుధీర్ఘంగా స్వచ్ఛమైన పరిమళంతో వ్యాపిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది! 
సమాజాన్ని పరిశుద్ధం చేసే అధికారులు పరిశుద్ధమైన తర్వాత అలాగే ఉండేలా తుది మెరుగులు చేయలేరుగా 
మళ్ళీ సంవత్సరానికి చేసిన నిర్మాణాలన్నీ పగుళ్లతో అశుద్ధమై కాలుష్యమై జీవించడానికి వీలు లేకుండా సాగిపోవునా 

అద్భుతమైన విజ్ఞానంతో విశ్వ జ్ఞాన పరిశుద్ధంతో సమాజాన్ని దృఢంగా పరిశుద్ధంగా జీవించడానికి వీలుగా నిర్మించుకోలేమా 

విశ్వంలో మానవ విజ్ఞానంతో పరిశుద్ధమైన సమాజాన్ని నిర్మించుకోలేమా 

మన ఆహార అలవాట్లతోనే నడవడితోనే ప్రవర్తనతోనే గుణాలతోనే లక్షణాలతోనే సమాజం అశుద్ధమై కాలుష్యమై అనారోగ్యమై అజ్ఞానమై ఆందోళనలతో అయోమయ స్థితులతో అప్రమత్తంగా జీవన ప్రయాణాలతో సాగుతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

విజ్ఞాన భావ తత్వాలతో సూర్యోదయాననే మేధస్సును మెలకువతో ఉత్తేజమైన ఆలోచనలతో తెరచిపోవునా

విజ్ఞాన భావ తత్వాలతో సూర్యోదయాననే మేధస్సును మెలకువతో ఉత్తేజమైన ఆలోచనలతో తెరచిపోవునా 

మెలకువతో మహా కార్యాలను సాగించేందుకు సూర్యుడిలా నిత్యం వెలుగుతో నీతో విజ్ఞానమై శ్రమ సామర్థ్యమై తోడుగా సహనమై ఉండిపోవునా 

ఆహారంలో అమృతమై శ్వాసలో పరిధుద్ధమైన ప్రాణ వాయువునై కార్యాలతో ఏకాగ్రత శ్రద్ధనై సమస్తం తెలుపనా 

ప్రకృతిలోని కార్యాలన్నీ శాస్త్రీయంగా వివరిస్తూ కార్యాలను సిద్ధాంతంగా జీవ జ్ఞాన విజ్ఞానాన్ని పరిశోధనగా అందించనా 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, May 17, 2026

దూరమైన బంధాలేవో తెలుసుకుందువా భారమైన బంధాలేవో చూసుకుందువా

దూరమైన బంధాలేవో తెలుసుకుందువా భారమైన బంధాలేవో చూసుకుందువా 
ఏ బంధం లేని బంధాలను ఎన్నైనా కలుపుకుంటూ అందరితో సంబంధమై సాగిపోదువా 


-- వివరణ ఇంకా ఉంది!

సమయమే సమస్తమైతే కాలమే సాగిపోవునూ

సమయమే సమస్తమైతే కాలమే సాగిపోవునూ 
ప్రకృతిలోని కార్యాలే జీవుల ప్రయాణాలై జరిగిపోవునూ 

కాలంతో సాగిపోతే తరతరాలుగా యుగయుగాలుగా సమయమే కార్యాలను నడిపించునూ  
నీ కార్య సమయాలను నీవు సమయోచితంగా సమన్వయంగా జీవన విధానంతో సాగించవా 

సమయం లేనిదే కార్యం సాగదు కాలం నిలవదు 
కార్యం లేనిదే సమయం నిలవదు కాలం ఆగదు 

కాలం క్షణమైనా ఆగదు సమయం అర క్షణమైనా నిలవదూ  
నీ కార్యాలు ఆగిపోయినా సమయం కాలంతో సాగిపోవునూ 

ప్రకృతిలోని కార్యాలు పంచభూతాలచే సాగిపోవునూ 
జీవుల కార్యాలు మేధస్సుల ఆలోచనల భావ తత్వాలతో ఆగుతూ సాగుతూ జరిగిపోవునూ 


-- వివరణ ఇంకా ఉంది!

మిత్రమా! విశ్వ విజ్ఞానమంతా నీ మేధస్సులో ఉంటే పరమాత్మ తత్వం నీలోనే కలుగుతున్నదా

మిత్రమా! విశ్వ విజ్ఞానమంతా నీ మేధస్సులో ఉంటే పరమాత్మ తత్వం నీలోనే కలుగుతున్నదా 

ప్రకృతి భావ తత్వాల స్వభావాల జీవ స్వభావాల భావ తత్వాలతో పరమార్థం ప్రతి అణువు నుండి ప్రతి పరమాణువు నుండి తెలుసుకుంటే నీలోనే పరమాత్మ తత్వం ఉదయించదా నీవే పర ఆత్మను పరమానందంతో ప్రజ్ఞానంతో పరిశోధించవా  

సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ప్రతి కార్యం నీ ఆత్మకు తెలిసేలా నీ మేధస్సును మహా విజ్ఞానంతో ఆలోచింపవా 

సర్వం నీ మేధస్సులోనే ఉందని ప్రతీది మానవుడు తెలుసుకోగలడు ఏ కార్యాన్నైనా చేయగలడు ఎన్నింటినో ప్రకృతి రూపకల్పనలతో ఎన్నో విధాలుగా విజ్ఞాన మంత్రంతో సృష్టించగలడు 

ప్రకృతిలోని శాస్త్రీయ సిద్ధాంతాలే జీవ శాస్త్రీయ సిద్ధాంతాలుగా నీ మేధస్సుకు కాలమే విశ్వ విజ్ఞానమై చేరిపోవును 


-- వివరణ ఇంకా ఉన్నది!


Friday, May 15, 2026

నీవు చదువుకున్న విజ్ఞానం నీకు తెలిసినది మరి మీ వాళ్ళకు తెలియాలంటే సంభాషించుకోవాలి

నీవు చదువుకున్న విజ్ఞానం నీకు తెలిసినది మరి మీ వాళ్ళకు తెలియాలంటే సంభాషించుకోవాలి అర్థాన్ని గ్రహించేలా బోధించాలి  

వృత్తి పరంగా తెలిసిన విజ్ఞానమైన జీవన కార్యాల విధానమైనా మన వాళ్ళకు తెలియజేయాలి జీవించుటలో వాళ్ళకు ఆరోగ్యం (నియమాలు) సామర్థ్యం (శరీర శ్రమ సహనం) సరైన నిద్ర విశ్రాంతి ప్రశాంతత విజ్ఞానం అనుభవం భవిష్య జీవన అంచనా విధానం ప్రకృతి పరిశుద్ధత పర్యావరణ నాణ్యత గల పోషక ఆహరం ఇతర వస్తువుల విక్రయ ధరల విలువలు సహాయం సలహాలు అలవాట్లు కార్యాచరణ వ్యాయామం ఆలోచనల విధానం దృష్టి ప్రభావం దినచర్య విధానం సూర్యరష్మి ఉత్తమమైనవి ఇలా ఎన్నో ఉపగయోగాలుగా పరమార్ధంతో అర్థమయ్యేలా చెప్పుకోవాలి 

సమాజం ఎంత నేర్పించినా మనమే నేర్చుకోవాలన్నా అందులో కొన్ని తీసివేసేవి చాలా ఉంటాయి 
మోసం ప్రయాణ వేగం అజ్ఞానం దురలవాట్లు అత్యాశ అనవసరమైనవి అనారోగ్య పరిస్థితులు శరీర దేహ రూపాల లోపాలు తగిన జ్రాగ్రత్తలు ఔషధాలు వైద్య చికిత్సలు ప్రదేశం ప్రభావాలు మానవుల వేదన ప్రభావాలు ఇలా ఎన్నో ఉంటాయి 

అన్నీ మీరే తెలుసుకున్నా గుర్తు చేసుకోవాలి మంచి జీతాన్ని తరతరాలుగా అందరితో పరిశుద్ధమైన ప్రకృతి విజ్ఞానంతో సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ఆహారాన్ని భుజించుటలో కొన్ని సందర్భాలలో చాలా స్వల్పమైన ఆహారం నీటి నాళంలో ప్రవేశించగలదు

ఆహారాన్ని భుజించుటలో కొన్ని సందర్భాలలో చాలా స్వల్పమైన ఆహారం నీటి నాళంలో ప్రవేశించగలదు దేహాన్ని ఉక్కిరి బిక్కిరి చేయగలదు శ్వాసకు ఇబ్బంది కలగించగలదు 

ఆహారాన్ని సమపాలలో సమయానుకూలంగా ఆహార పడదార్థాన్ని బట్టి దానికి అనుకూలంగా సేవించాలి భుజించాలి 

ఆహారాన్ని సేవించుటలో నీటిని ఉంచుకోవాలి ఇలా జరిగినప్పుడు తగిన రీతిలో నీటిని సేవించాలి దేహాన్ని శ్వాసను ప్రశాంతంగా కొంత సమయం (ఒక నిమిషం) ఉంచుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని సమన్వయంగా సేవించాలి 

ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నపుడు నీటిని దగ్గరగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి 
అనుభవాల నుండి మీరే ఎన్నో గ్రహించాలి తెలుసుకోవాలి గుర్తు చేసుకోవాలి అవసరమైనప్పుడు సందర్భానుకూలంగా ఉపయోగించుకోవాలి 

-- వివరణ ఇంకా ఉంది!


నీవు తలచినది సత్యమని గ్రహిస్తున్నావా

నీవు తలచినది సత్యమని గ్రహిస్తున్నావా 

నీవు తలచినది ఏదైనా ప్రతి రోజు అలాగే జరుగుతూ ఉంటే దానిని ప్రత్యక్షంగా వీక్షిస్తూ యదార్థంగా విశ్వ కార్యములలో నిరంతరం సాగుతూ ఉంటే సత్యమైనదిగా పరిగణించాలి 

సూర్యుడు ఉదయించుటలో సత్యమున్నది అస్తమించుటలో యదార్థమున్నది కాలంతో వీక్షించుటలో ప్రత్యక్షమున్నది 
ఆకాశంతో పాటు మేఘాలు (వర్షాలుగా కూడా) నక్షత్రాలు చంద్రుడు అప్పుడప్పుడు వివిధ రోజులలో వివిధ రకాలుగా ప్రత్యక్షమై దర్శమిస్తారు 

సూర్యున్ని ప్రజ్వల ప్రకాశంతో ప్రత్యక్షంగా నిరంతరం వీక్షిస్తూ చూడలేము 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రయాణించుటలో ఆకస్మాత్తుగా ఎదురుగా వచ్చేవారు మహా భయంకరులు

ప్రయాణించుటలో ఆకస్మాత్తుగా ఎదురుగా వచ్చేవారు మహా భయంకరులు భీభత్సాన్ని సృష్టించే వేగ పూరిత వేదన గల ఆలోచన కారకులు  

వేగాన్ని అంచన వేసుకోలేని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోలేని ఆలోచనలను అవగాహన చేసుకోలేని ఆవేదనాత్మక భయంకరులు 

ప్రయాణ పరిస్థితులను మార్గ రహదారులను ప్రయాణ నియమాలను నగర పరిస్థితులను వివిధ నిర్మాణాలను నిరంతరం గమనించలేని వారు ప్రమాదాన్ని సృష్టిస్తారు 

వాహనం యొక్క స్థితి గతులను కూడా అన్ని విధాలా లెక్కచేయాలి ఆలస్యమైనా ప్రయాణికులను సురక్షితంగా గమ్యాన్ని చేర్చాలి 

-- వివరణ ఇంకా ఉంది!

అనారోగ్యంగా ఉన్నప్పుడు పరిశుద్ధమైన సురక్షితమైన సులువైన కార్యాలలో నిమగ్నమైతే ఆరోగ్యం కలగవచ్చు

అనారోగ్యంగా ఉన్నప్పుడు పరిశుద్ధమైన సురక్షితమైన సులువైన కార్యాలలో నిమగ్నమైతే ఆరోగ్యం కలగవచ్చు  

అనారోగ్యంతో ఆలోచిస్తూ కార్యాలను వీక్షిస్తే మన పూర్వ జీవన విధానాన్ని లేదా మేధస్సు మరో లోకంలో వివిధ రకాలుగా ఆలోచింపజేస్తాయి 

మన కార్యాలోచన యదార్థ సమయ కార్యాలను తిలకిస్తూ భవిష్య ప్రణాళికలను తయారుచేసుకోవాలి ఆరోగ్యాన్ని పొందాలి అభివృద్ధి వైపు ప్రయాణించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులో ఉత్తేజం శరీరంలో ఆరోగ్యం దేహంలో సామర్థ్యం తగ్గిపోకుండా జీవించాలి

మేధస్సులో ఉత్తేజం శరీరంలో ఆరోగ్యం దేహంలో సామర్థ్యం తగ్గిపోకుండా జీవించాలి  
ఉత్తేజం ఆరోగ్యం సామర్థ్యం ఉన్నప్పుడే కార్యాలను పరిశుద్ధంగా విజ్ఞానంగా కార్యాచరణతో సాగిస్తూ అభివృద్ధిని సాధించగలం 

విశ్వంతో ప్రయాణించాలన్నా ప్రకృతిని తిలకించాలన్నా ఆరోగ్యం ఉత్తేజం సామర్థ్యం పరిపూర్ణంగా ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణక్రియ జరగడంతో పాటు శరీర వైశాల్యం తగ్గుతూ రావాలి

ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణక్రియ జరగడంతో పాటు శరీర వైశాల్యం తగ్గుతూ రావాలి  
శరీర వైశాల్యం ఆహారాన్ని తీసుకోవడానికి ముందు ఎంత ఉందో అదే కొలతకు మళ్ళీ ఆహారం తీసుకునే సమయానికి రావాలి 

ఆహారం తీసుకునే సమయానికి వైశాల్యం తగ్గకపోతే శరీర ప్రక్రియలలో కొన్ని లోపాలు ఉన్నట్లు తెలుస్తాయి 
శరీరంలో కొంత గాలి నిండుకుపోవటం లేదా జీర్ణక్రియ జరగడానికి వీలుగా లేకపోవడం శ్వాస ప్రక్రియ వ్యత్యాసంగా సాగటం సరైన శ్రమ లేకపోవటం సరైన నిద్ర విశ్రాంతి లేకపోవటం సరైన పోషక ఆహారం సరైన సమయానికి తినకపోవం సరైన నీరు త్రాగక పోవటం సరైన ప్రదేశంలో (పరిశుద్ధమైన) ఉండకపోవటం సరైన ఆకలి దప్పిక లేకపోవటం సరైన ప్రకృతి ప్రాణవాయువు లేకపోవటం సరైన సూర్య రష్మీ లేకపోవటం సరైన కార్యాచరణ లేకపోవటం సరైన అలవాట్లు లేకపోవటం ఇలా ఎన్నెన్నో జరిగిపోతుంటాయి 

సరైన వ్యాయామం (యోగ) సూర్యరష్మి ఆహారం నిద్ర విశ్రాంతి పరిశుద్ధత ప్రతి రోజు ఉండేలా చూసుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

నీకు ఒక్కరికే ఆరోగ్యం ఉంటే సరిపోదు నీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆరోగ్యం ఉండాలి

నీకు ఒక్కరికే ఆరోగ్యం ఉంటే సరిపోదు నీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆరోగ్యం ఉంటేనే నీవు ఆరోగ్యంగా ఉంటావు  
 
కుటుంబంలో ఉన్న వారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నీకు అన్నీ కార్యాలు ప్రతి రోజు సులభంగా సాగిపోవు 
కుటుంబంలో ఉన్న వారిఆరోగ్యం కోసం నీవు ఎంతో తపన పడుతూ వారికి అవసరమయ్యే వాటినిసరిగ్గా చూసుకోవాలి 

సమయానికి మంచి ఆహారం ఔషధం ఇస్తూ నడవటం వ్యాయామం లాంటివి దగ్గర ఉండి చేయించాలి 
(వీలైతే నీవే ఆహారాన్ని తయారు చేయాలి) ఆహారానికి ఔషదానికి కావలసిన ఖర్చులు నీవే భరించాలి 

సమాజంలో కూడా కనిపించే వారు ఆరోగ్యంగా ఉంటే (కనిపిస్తే) నీవు నీ కార్యాలపై దృష్టి పెడుతూ సాగిపోతావు 
సమాజంలో అనారోగ్యులు కనబడితే నీలో ఎదో తెలియని తపన ఏదో చేయాలనే వేదన కలుగుతూ ఉంటాయి 

ఎవరి ఆరోగ్యానికి వారు జాగ్రత్త వహించాలి దేహాన్ని రక్షించుకోవాలి విచక్షణతో విజ్ఞానాన్ని తెలుసుకోవాలి అవరమైన వాటిని గొప్పగా గ్రహించి సమయాన్ని ప్రయోజనం చేసుకోవాలి ఐశ్వర్యంతో అభివృద్ధి చెందాలి 

సర్వ కార్యాలను ఆరోగ్యం కోసం పరిశుద్ధంగా కార్యాచరణతో సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ఆరోగ్యం సామర్థ్యం లేకపోతే స్వర్గం లాంటి సుఖ సంతోషాలను అనుభవించలేవు

ఆరోగ్యం సామర్థ్యం లేకపోతే స్వర్గం లాంటి సుఖ సంతోషాలను అనుభవించలేవు  

ఏ కార్యానికైనా ఆరోగ్యం ప్రదానం సామర్థ్యం సమర్థం పరిశుద్ధత ప్రభావం విచక్షణ ఆచరణీయం 


-- వివరణ  ఇంకా ఉంది!

మేధస్సు ఉత్తేజం లేని సమయం నిద్రావస్థలో సాగే ఆలోచనల పరిణామం

మేధస్సు ఉత్తేజం లేని సమయం నిద్రావస్థలో సాగే ఆలోచనల పరిణామం 

-- వివరణ ఇంకా ఉంది!

ప్రశాంతమైన ప్రకృతిలో పరిశోధించే పరమాత్మ ప్రసిద్ధమై నిలిచెదవా

ప్రశాంతమైన ప్రకృతిలో పరిశోధించే పరమాత్మ ప్రసిద్ధమై నిలిచెదవా  
పరిశోధన చేసే సమయంలో పరిశుద్ధమై పరిపూర్ణంగా ఉద్భవించెదవా 

విశ్వమంతా అవతరించిన నీవు అంతర్భావాలతో ఉదయిస్తున్నావా 
జగమంతా పరిశోధించే నీవు ప్రకృతిలో అంతర్లీనమై ఉద్భవిస్తున్నావా 

అణువుగా ఐనా ఉద్భవిస్తావు పరమాణువుగా ఐనా ఉదయిస్తావు 
అణువులోనే ఇమిడిపోతావు పరమాణువులోనే అణగివుంటావు 

విశ్వమంతా జరిగే కాల కార్యములలో విశుద్ధమై అవతరిస్తావు 
జగమంతా సాగే కాల సమయాలలో ప్రజ్ఞానతమై సంబోధిస్తావు 

విజ్ఞాన నాడులవలె నీ రూపం ప్రకృతిగా ప్రబంధమై అవతరించినది 
వేదాంత బుడములవలె నీ రూపం ఆకృతిగా ప్రశంసమై అనుసరించినది 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, May 14, 2026

ఆనాడు పొదుపు చేసుకున్న వాటితోనే చాలా వరకు మనకు కావలసిన వాటిని కొనుగోలు చేసే వారము

ఆనాడు పొదుపు చేసుకున్న వాటితోనే చాలా వరకు మనకు కావలసిన వాటిని కొనుగోలు చేసే వారము  
ఒకవేళ ధనము తక్కువ పడితే మళ్ళీ పొదుపు చేసి లెక్కలు వేసి మళ్ళీ పండుగల నాడే కొనుగోలు చేసే వారము
పండుగల నాడు రకరకాల కొత్త కొత్త వస్తువులు వస్త్రాలు కొన్ని తక్కువ ధరలకు వస్తుంటాయి 

ఆనాడు పొదుపు చేసుకున్న ధనంతో సంవత్సరానికి ఒకసారి కావలసిన వాటిని కొనుగోలు చేసే వారము 

వస్త్రములైనా వంట పాత్రలైనా ఇతర వస్తవులైనా ముఖమైన పండుగల సమయాలలో కొనుగోలు చేసే వారము 

ఈనాడు కొందరు ఎప్పుడు కావలసి వస్తే అప్పుడే ఏదైనా కొనుగోలు (చేయవచ్చు) చేస్తున్నారు 
వారి దగ్గర ఉన్న ధనం ఎందుకు ఉపయోగించాలో కూడా తెలియకుండా ఖర్చులు చేస్తున్నారు 
కొనేవాటి యొక్క ధరలను కూడా చూడకుండా ఎక్కువ ధరలకు కూడా కొనేవారు చాలా ఉన్నారు 

ఈనాటి పొదుపులు చాలా తక్కువగా ఉపయోగపడుతున్నాయి కారణం ధరలు పెరిగిపోతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

కార్మికులుగా జీవిస్తున్నారా కర్మాగారంలో పని చేస్తున్నారా

కార్మికులుగా జీవిస్తున్నారా కర్మాగారంలో పని చేస్తున్నారా 
శ్రమించుటలో శక్తిని ధారగా పోస్తున్నారా నైపుణ్యాన్ని దానం చేస్తున్నారా 

అధికారులు యజమానులు శక్తి సామర్థ్యాలను దోచుకుంటారు నైపుణ్యాలను దాచేసుకుంటారు కేవలం ఆహార ఖర్చులు అందిస్తారు లేదా దిన చర్య కార్యములకు అయ్యే ఖర్చులు చౌకగా ఇచ్చేస్తారు 

కార్మికులను కార్మికులుగానే జీవించేలా కర్మాగారంలోనే జీవితాలను సాగిస్తారు 
కార్మికులకు చదువులు ఉన్నా గొప్పగా మరో ఉన్నతమైన ఉద్యోగాలకు ప్రయత్నించే అవకాశాలు ఉండకపోవచ్చు ఎలా వెళ్ళాలో తెలియక పోవచ్చు పరిస్థితులు అడ్డంకులుగా ఎదురవ్వచ్చు జీవన విధానంలో కఠినత్వానికే బానిసగా మారిపోయి అలాగే సాగుతూ జీవించవచ్చు 

కర్మాగారంలో చాలా కార్యాలు మలినంతో సాగిపోవచ్చు దుర్వాసనాలతో ఏర్పడవచ్చు మంటలతో నడిపించవచ్చు  
ఇలా ఎన్ని కార్యములు ఎన్ని రకాల ఇబ్బందులతో సాగుతున్నా జాగ్రత్తలు వహించండి

-- వివరణ ఇంకా ఉంది!

మానవుని విజ్ఞానమే మంత్రములై యంత్రములను సృష్టిస్తున్నాయి

మానవుని విజ్ఞానమే మంత్రములై యంత్రములను సృష్టిస్తున్నాయి మాయాజాలాన్ని చూపుతున్నాయి 

యంత్ర పర భాషతో యంత్రములే మరో యంత్రాలకు కావలసిన వాటిని సృష్టిస్తున్నాయి (ఉత్పత్తి చేస్తున్నాయి) 
మానవుడు జీవించుటకు కలిగే సమస్యలలో కావలసిన వస్తువులను వివిధ యంత్రముల నుండి సృష్టించుకుంటున్నాడు 

యంత్రములలో కొంత మాయ కనిపించేలా అనిపించేలా నేడు యంత్రములు వివిధ విజ్ఞాన మంత్రములచే పనిచేస్తున్నాయి 

యంత్రము మంత్రము కలిస్తే కలిగే భావన మాయా తత్వమే 
పర భాష మంత్ర విజ్ఞానముచే యంత్ర స్పర్శ ప్రభావితమగును వివిధ ఫలితాలను అందించును 

మంత్రం విజ్ఞాన శాస్త్రం యంత్రం విజ్ఞాన రూపకల్పనం 


-- వివరణ ఇంకా ఉంది!

ఆనాడు సకల జీవరాసులన్నీ ప్రకృతిలోనే జీవించేవి

ఆనాడు సకల జీవరాసులన్నీ ప్రకృతిలోనే జీవించేవి 
జీవులన్నీ ప్రకృతిలోని జన్మించి జీవించి మరణించేవి 

కొంత కాలానికి కొన్ని యుగాల తర్వాత మానవుడు తన విజ్ఞానం ద్వారా ప్రకృతి నుండి గృహంలో జీవించుటకు  సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాడు  

అలాగే మానవుని శరీర నిర్బంధక శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ వస్తున్నాయి 

మానవుని జీవన విధానం మారుతూ ఎన్నో వృత్తులను నేర్చుకొని జీవిస్తూ సాగుతున్నాడు 
నేడు మానవుని వృత్తులు వివిధ యంత్రములతో పని చేయడం సాగుతున్నది 
నేడు మానవుడు కాలక్రమేణ  వివిధ రకాల యంత్ర భాషలను నేర్చుకుంటూ పనిచేస్తున్నాడు  

ఆనాడు ఏ సమస్య కలిగిన ప్రకృతియే ఆధారమయ్యేది 
నేడు మానవునికి ఏ సమస్య కలిగినా కృత్రిమ విధానంతో సాగుతున్నది జీవించుటకు ఐశ్వర్యమే మూలమవుతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, May 13, 2026

పరిశుద్ధమైన పవిత్రమైన పర్యావరణమైన ప్రశాంతమైన ప్రదేశంలోనే పరమాత్ముడు పరిశోధిస్తూ జీవిస్తున్నాడు

పరిశుద్ధమైన పవిత్రమైన పర్యావరణమైన ప్రశాంతమైన ప్రదేశంలోనే పరమాత్ముడు పరిశోధిస్తూ జీవిస్తున్నాడు  

విశ్వ ప్రకృతిలో కార్యక్రమాలన్నీ పరిశుద్ధంగా నాణ్యతగా సాగేందుకు తన భావ తత్వాల సామర్థ్యాన్ని అణువులకు పరమాణువులకు అందిస్తున్నాడు 


-- వివరణ ఇంకా ఉంది! 

ఏదైనా చదువుకుంటూ తెలుసుకుంటూ పోతే కదా అనంతమైన విశ్వ విజ్ఞానం తెలిసేది

ఏదైనా చదువుకుంటూ తెలుసుకుంటూ పోతే కదా అనంతమైన విశ్వ విజ్ఞానం తెలిసేది  


-- వివరణ ఇంకా ఉంది!

శాంతంగా ఉంటే కదా ప్రశాంతత కలుగుతుంది

శాంతంగా ఉంటే కదా ప్రశాంతత కలుగుతుంది 
పొదుపుగా ఉంటే కదా ఐశ్వర్యం లభిస్తుంది 
ఏకాగ్రతతో ఉంటే కదా విజ్ఞానం కలుగుతుంది 
జాగ్రత్తగా ఉంటే కదా రక్షణ లభిస్తుంది 

-- వివరణ ఇంకా ఉంది! 

విశాలమైన ప్రదేశంలో నిద్రిస్తే కదా శరీరం ప్రశాంతంగా నిద్రిస్తూ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది

విశాలమైన ప్రదేశంలో నిద్రిస్తే కదా శరీరం ప్రశాంతంగా నిద్రిస్తూ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది  

విశాలమైన ప్రదేశంలో ప్రకృతి చాలా విరివిగా లభిస్తుంది శరీరం విశ్రాంతి చెందుతూ శరీర ప్రక్రియలను సాఫల్యంగా  సాగిస్తుంది శరీరం సామర్థ్యాన్ని పెంచుకుంటూ మేధస్సును ఉత్తేజవంతం చేస్తుంది రేపటి కార్యాలకు అనుకూలంగా సహకరిస్తుంది   

శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ఎక్కవ సమయం శ్రమించుటకు సహనంతో సహకరిస్తుంది 

నేటి కాలంలో కొంత సమయం శ్రమిస్తే చాలు అలసట కలుగుతుంది సహనం కోల్పోతుంది సామర్థ్యం తగ్గిపోతుంది 

నేడు చాలా వరకు యంత్రాలే పనిచేస్తున్నాయి మానవుని శ్రమను తగ్గిస్తున్నాయి 

-- వివరణ ఇంకా ఉంది!

రాత్రి వేళలో ప్రకృతిలో జీవించక పోయినా పగటి వేళలో ప్రకృతిలో జీవిస్తేనే శరీర సామర్థ్యం విజ్ఞానం పెరుగుతుంది

రాత్రి వేళలో ప్రకృతిలో జీవించక పోయినా పగటి వేళలో ప్రకృతిలో జీవిస్తేనే శరీర సామర్థ్యం విజ్ఞానం పెరుగుతుంది 

నేటి సమాజంలో ప్రకృతి పర్యావరణ ప్రభావాలు తగ్గిపోతూ కాలుష్యంతో ఇమిడిపోతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ఆత్మలా జీవించినా ధాతలా జీవించినా శ్రమ పెరుగుతుంది

ఆత్మలా జీవించినా ధాతలా జీవించినా శ్రమ పెరుగుతుంది 
యోగిలా జీవించినా రుషిలా జీవించినా శ్రమ పెరుగుతుంది 

మనిషిలా జీవించినా మహర్షిలా జీవించినా శ్రమ పెరుగుతుంది 
పరమాత్మలా జీవించినా అంతరాత్మలా జీవించినా శ్రమ పెరుగుతుంది 
 
జీవించుటలో శ్రమ ఎవరికైనా కాలంతో పాటు పెరుగుతూనే సాగిపోతుంది 
ఎంతటి విశ్రాంతి చెందినా ఎంత ప్రశాంతంగా జీవించినా తద్వారా శ్రమ పెరుగుతూనే వస్తుంది 

కాలం సాగుతున్నంతవరకు శ్రమ సమయంతో పాటు పెరుగుతూనే వస్తుంది 
జీవించుటలో సాధన ఉన్నంత వరకు శ్రమ పెరుగుతూనే ఉంటుంది సమర్థతను గుర్తిస్తుంది 

శ్రమతోనే ఏ కార్యమైనా సాధ్యం 
ఏ విజయమైన శ్రమతోనే సాధనం 
ఏ శ్రమ ఐనా సామర్థ్యంతోనే సాధ్యం 

సామర్థ్యం శ్రమ సాధన విజయం 
ఏ కార్యానికైనా శ్రమించుటకు సామర్థ్యం అవసరం 
విజయం అనేక కార్యాలతో సాధ్యమవుతుంది 
అనేక కార్యాలను సాగించుటకు సాధన ప్రధానం 

-- వివరణ ఇంకా ఉంది!

ఆహారం లేకుండా జీవించే వారిలో శ్రమించే శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి

ఆహారం లేకుండా జీవించే వారిలో శ్రమించే శక్తి సామర్థ్యాలు తక్కువగా (అల్పంగా) ఉంటాయి  
ఆహారం లేకుండా జీవించే వారిలో ప్రకృతి శక్తి ఆధ్యాత్మిక ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది 

ఆహారం లేకుండా జీవించేవారు జీవించుటలో ఒక జీవన విధాన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఉంటారు 
ఆహారం లేకుండా జీవించేవారికి ప్రశాంతత ఏకాగ్రత పరిశుద్ధత కార్యాచరణ నియమం చాలా అవసరం 

-- వివరణ ఇంకా ఉంది!

ఎంత కాలం జీవించినా మేధస్సు ఆలోచించాలి దేహం శ్రమించాలి

ఎంత కాలం జీవించినా మేధస్సు ఆలోచించాలి దేహం శ్రమిస్తూ కార్యాలను సాగించాలి 
మానవుని ఆలోచనలలో విజ్ఞానం ఎదగాలి మానవుని కార్యాలలో ఐశ్వర్యం కలగాలి 

విజ్ఞానం మానవుని ప్రవర్తనను గుర్తిస్తుంది ఐశ్వర్యం మానవుని కార్యక్రమాన్ని పరిశోధిస్తుంది 
విజ్ఞానం రక్షణగా పరిశుద్ధంగా పరమార్థంగా ఉంటుంది ఐశ్వర్యం సామర్థ్యంగా ఆరోగ్యంగా అభివృద్ధితో ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!

ఏ ఆలోచనతో ఎంత కాలం ఉండగలవు ఏ ఐశ్వర్యంతో ఎంత కాలం జీవించగలవు

ఏ ఆలోచనతో ఎంత కాలం ఉండగలవు ఏ ఐశ్వర్యంతో ఎంత కాలం జీవించగలవు 
అద్భుతమైన ఆలోచనలతో నిరంతరం ఉండలేవు అపారమైన ఐశ్వర్యంతో ఎల్లప్పుడూ చూసుకోలేవు 

ఆలోచనలు వివిధ కార్యాల ద్వారా మారిపోతుంటాయి ఐశ్వర్యాన్ని వివిధ కారణాల ద్వారా చూసుకోవటం కుదరదు 

ఆలోచనలు మారిపోవుటకు ఐశ్వర్యాన్ని చూసుకోలేకపోవుటకు కాలంతో సాగే కార్యాలే కారణమై మార్పులు కలుగుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!
 

న్యాయం లేనిచోట నాయకుడు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే

న్యాయం లేనిచోట నాయకుడు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే  
న్యాయం లేని చోట నాయకుడు లేకుంటేనే ప్రాముఖ్యత తెలుస్తుంది 

న్యాయాన్ని విచారించుటలో నాయకుడు యదార్థాన్ని గ్రహించాలి లేదా సమానత్వాన్ని కలిగించాలి 
నాయకుడు విజ్ఞానవంతుడు అనుభవజ్ఞుడు సమర్థవంతుడుగా ఉండగలగాలి 

నాయకుడు పరిపాలన కోసం కాకుండా పరిస్థితుల ప్రభావాల కోసం శ్రమించాలి సమస్తం చూసుకోవాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

ఎవరి మేధస్సులో ఏముందో ఎవరికి తెలుసు

ఎవరి మేధస్సులో ఏముందో ఎవరికి తెలుసు 
చేసే కార్యాలను అనుసరించి చూస్తే కాస్త తెలుస్తుంది  

కార్యాల ద్వారా కలిగే ఫలితాలు వారి అభివృద్ధి బంధాలు సంబంధాలు కార్యక్రమాల సంబరాలను చూస్తే కొంత తెలుసుకోవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

ఆలస్యం చేస్తే సమయం కూడా సమస్యగా మారుతుంది

ఆలస్యం చేస్తే సమయం కూడా సమస్యగా మారుతుంది 

ఆలస్యం వలన చేయవలసిన కార్యాలు మిగిలిపోతాయి (పెరుగుతాయి) అలా మిగిలిపోయిన కార్యాలను పూర్తి చేయుటకు సమయం చాలదు అప్పుడు సమయం కూడా సమస్యగా మారుతుంది 

చేయవలసిన కార్యాలను చేయలేక మిగిలిపోయిన కార్యాలను చేయుటతోనే సమయం సాగిపోతుంది సమయం తక్కువ పడుతుంది సమస్యగా ఏర్పడుతుంది ప్రయోజనం కలిగే సమయంలో పరిశోధన చేయవలసివస్తోంది 

లాభం కలిగే సమయంలో నష్టం కలుగుతుంది 

-- వివరణ ఇంకా ఉంది!
 

ఓ సూర్య దేవా! నిద్రించుటలో కలిగిన అనారోగ్యపు మెలకువతో నీ సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నా

ఓ సూర్య దేవా! నిద్రించుటలో కలిగిన అనారోగ్యపు మెలకువతో నీ సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నా 

అనారోగ్యపు మెలకువ ద్వారా సరైన నిద్ర లేక నిద్రించ లేక నా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకొనుటకు నీ సూర్యోదయం కోసం వేచివున్నా   

సూర్యోదయంతో నా మేధస్సు ఉత్తేజమై నా అనారోగ్యం నీ ప్రజ్వల కిరణాల స్పర్శతో శరీరం ఆరోగ్యవంతమై దేహం శక్తి సామర్థ్యాలతో కార్యక్రమాలను చేసుకుంటూ సాగుతుంది 

నీలో ఉన్న ప్రజ్వల శక్తి జీవులకు అణువులకు మహా ఉత్తేజవంతమైన ఆరోగ్యాన్ని సామర్థ్యాన్ని అందిస్తూ కార్యక్రమాలు సాగేందుకు నేత్ర దృష్టికి వెలుగును అందిస్తున్నావు 

నీ సూర్యోదయం కోసం ఎందరో ప్రతి రోజు వారి కార్యక్రమాలను సాగించేందుకు వారి బంధాలను అభివృద్ధి చేసుకొనుటకు ఎదురుచూస్తున్నారు 


-- వివరణ ఇంకా ఉంది!

చదువుకున్న వారే చదువుకుంటూ సాగిపోతే ఇతరులకు విజ్ఞానం తెలిసేదెలా

చదువుకున్న వారే చదువుకుంటూ సాగిపోతే ఇతరులకు విజ్ఞానం తెలిసేదెలా 

చదువుకున్న విజ్ఞానాన్ని విషయాలను మన చుట్టూ ఉన్న వారిలో కొందరికి ఉపయోగపడేలా తెలుపుకోవాలి  

మన విజ్ఞానాన్ని ఇతరులకు అందిస్తే వారిలో ఉన్న కొత్త విజ్ఞానం మనకు తెలుపడం జరగవచ్చు భవిష్య కాలానికి మనకు లేదా మన వాళ్ళకు ఉపయోగపడవచ్చు 

విజ్ఞానాన్ని ఒకరికి ఒకరు సంభాషించుకుంటూ సాగిపోతే కొత్త కొత్త ఆలోచనల విజ్ఞానంతో ఎన్నో సమస్యలు తీరిపోతాయి అలాగే అందరు విజ్ఞానులుగా సాగిపోతారు ఎంతో మెరుగైన జీవితాన్ని సాగిస్తారు 


-- వివరణ ఇంకా ఉంది!

కొత్తగా తెలిసిన విజ్ఞానం అస్తమించక ముందే ఎవరికైనా తెలియజేయాలి

కొత్తగా తెలిసిన విజ్ఞానం అస్తమించక ముందే ఎవరికైనా తెలియజేయాలి 

మేధస్సులో ఉన్న ఎవరికి తెలియని గొప్ప విజ్ఞానం మరణానికి ముందే లేదా మరచిపోవక ముందే ఉత్తములకు లేదా విజ్ఞానులకు తెలపాలి 

కొత్తగా తెలిసిన విజ్ఞానం సమాజానికి ఉపయోగపడవచ్చు తరతరాల వారికి ఎంతో ప్రయోజనాన్ని కలిగించవచ్చు జీవన విధానాన్ని గొప్పగా మార్చవచ్చు సురక్షితమైన జీవితాన్ని అందించవచ్చు మరెందరికో అజ్ఞానాన్ని తొలగించవచ్చు ఎందరికో జ్ఞాపక శక్తిని పెంచవచ్చు కొందరికి కార్యక్రమ విధానాన్ని సులువుగా మార్చవచ్చు 

మనకు కలిగే ఉపాయాలను కూడా మరవక ముందే వ్రాసుకోవాలి లేదా జ్ఞాపకంతో ఇతరులకు చెప్పుకోవాలి సంభాషించుకోవాలి వీలైతే ప్రయోగంతో సత్ఫలితాన్ని అందిస్తే ఆచరణగా మార్చుకోవాలి నియమంగా నడుచుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్య కిరణాలు శరీరాన్ని తాకినా దాని ప్రభావం మేధస్సుకు చేరును

సూర్య కిరణాలు శరీరాన్ని తాకినా దాని ప్రభావం మేధస్సుకు చేరును 
సూర్యుని తేజ కిరణాల ప్రభావాలు మేధస్సును ఉత్తేజవంతం చేయును  

సూర్య రష్మి శరీరాన్ని స్పందింపజేస్తూ దేహానికి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తూ మేధస్సును ఉత్తేజవంతం చేస్తూ ఆలోచనలతో కార్యక్రమాలను మహోదయంగా విచక్షణ తత్వాలతో సాగించును 

సూర్యని ప్రకాశవంతమైన వెలుగులో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలుగా ప్రతి రోజు సాగిపోవును 

-- వివరణ ఇంకా ఉంది!


Tuesday, May 12, 2026

మన చుట్టూ ఉన్నవారు ఎన్నో సాధిస్తున్నారు ఎంతగానో ఎదుగుతున్నారు

మన చుట్టూ ఉన్నవారు ఎన్నో సాధిస్తున్నారు ఎంతగానో ఎదుగుతున్నారు 
ఒకప్పుడు విజ్ఞానం లేనివారు కూడా ప్రస్తుతం ఎన్నో విధాలుగా ఎదుగుతున్నారు 

ఒక వైపు ఒక విధమైన విజ్ఞానం మరో వైపు మరో విధమైన ఐశ్వర్యం కలుగుతున్నది సంతోషం సాగుతున్నది 

మనలో ఏ సాధన లేదు ఏ ఎదుగుట లేదు ఏ అలవాటు లేదు ఏ మాట లేదు 

మనలో మౌనం ఓ మహా కార్యానికైనా ఉపయోగపడేలా మన సామర్థ్యాన్ని గెలిపించుకోవాలి 

ఏదో ఒక సాధన లేకపోతే అనారోగ్యంతో సాగిపోయే సమయం కూడా కాలం సాగనివ్వదు 

మానవునిలో శ్వాస ఎంత ప్రధానమో శ్రమ కూడా అంతే ప్రాముఖ్యత వహిస్తుంది 

శ్రమతో శరీరం సాధన సామర్థ్యం సహ విధ కార్యాల పరిస్థితుల ప్రభావితం 


 -- వివరణ ఇంకా ఉంది!

విజ్ఞానాన్ని చూస్తున్నావా పరిశోధిస్తున్నావా వ్రాసుకుంటున్నావా నేర్చుకుంటున్నావా

విజ్ఞానాన్ని చూస్తున్నావా పరిశోధిస్తున్నావా వ్రాసుకుంటున్నావా నేర్చుకుంటున్నావా గమనిస్తున్నావా గ్రహిస్తున్నావా సాధన చేస్తున్నావా అనుభవిస్తున్నావా ప్రయోగిస్తున్నావా పరిశీలిస్తున్నావా చదువుతున్నావా అర్థం చేసుకుంటున్నావా 

విజ్ఞానం ఎప్పుడు ఎలా ఎవరికి కలుగుతుందో ఆలోచనల ఏకాగ్రతతో కూడిన అవగాహనపై గ్రహించే అర్థాల సారాంశంపై ఆధారపడి ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!

జీవించి జీవించి శ్రమించి శ్రమించి సహించి సహించి సాధించి సాధించి వెళ్ళిపోతూ వెళ్ళుతున్నాము

జీవించి జీవించి శ్రమించి శ్రమించి సహించి సహించి సాధించి సాధించి వెళ్ళిపోతూ వెళ్ళుతున్నాము  

ఎంత కాలం జీవించినా శ్రమిస్తూనే ఎన్నింటినో సహిస్తూ ఏదో సాధిస్తూ ఎప్పుడైనా వెళ్ళిపోతున్నాము 

జన్మించుటలో తెలియనిది జీవించుటలో తెలిసినది శ్రమతో సహిస్తూ సాధనతో సాధిస్తూ వెళ్ళిపోవడమే 
సహించలేని శ్రమను అనారోగ్యం చేసుకొని సహనంలేని సామర్థ్యాన్ని అసాధ్యం చేసుకొని వెళ్ళిపోవడమే 

ఆలోచనలకు విజ్ఞానం అందకపోయినా అజ్ఞానం లేదా అసమర్ధతతో సాగిపోవుట జీవిత లక్ష్యం కాదుగా  

శ్రద్ధతో ఉన్నది సహనం సహనంతో ఉన్నది సామర్థ్యం సామర్థ్యంతో ఉన్నది సాధన సాధనతో ఉన్నది విజయం 
విజయంతో ఉన్నది సంతోషం సంతోషంతో ఉన్నది బంధం బంధంతో ఉన్నది సంబంధం సంబంధంతో ఉన్నది జీవితం 

-- వివరణ ఇంకా ఉంది!

ఒకరు తెలిపిన విజ్ఞానాన్ని మరొక విధంగా మార్చుకొని కొత్త విజ్ఞానాన్ని సృష్టించవచ్చు

ఒకరు తెలిపిన విజ్ఞానాన్ని మరొక విధంగా మార్చుకొని కొత్త విజ్ఞానాన్ని సృష్టించవచ్చు  
మనకు అర్ధమయ్యే విజ్ఞానాన్ని అవగాహన చేసుకుంటే ఎన్నో ఆలోచనలతో కొత్త వాటిని కనిపెట్టవచ్చు 

విజ్ఞానాన్ని పరిశోధిస్తూ కొత్త ఆలోచనలతో అనుభవాలతో ఎన్నో ఉపాయములు కలిగినప్పుడు సరికొత్త విజ్ఞానాన్ని సంగ్రహించవచ్చు 

కొత్త విజ్ఞానముకై ఎన్నో ప్రయోగములు చేస్తూ ఎన్నో కొత్త వాటిని గ్రహిస్తూ సరికొత్త విజ్ఞానాన్ని కనిపెట్టవచ్చు 
ఒక విజ్ఞానము నుండి మరొక విజ్ఞానము మరొక విజ్ఞానము నుండి ఇంకొక విజ్ఞానము ఎలా ఎన్నో విజ్ఞాన విషయాలను కనిపెడుతూ ఎన్నింటినో సాధించవచ్చు 

నేటి మానవ నిర్మాణమంతయు ఆకార రూపములన్నియు ఒక విజ్ఞానము నుండి మరొక విజ్ఞానంగా నేర్చుకుంటూ సాధించినదే 

విజ్ఞానము ఒకరికే పరిమితం కాదు ఎవరు ఆలోచించినా ఎవరు శ్రమించినా వారికి సరికొత్త విజ్ఞానం కలుగుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

తెలుసుకున్నది వ్రాసుకోగలం వ్రాసుకున్నది చదువుకోగలం

తెలుసుకున్నది వ్రాసుకోగలం వ్రాసుకున్నది చదువుకోగలం 
చదువుకున్నది నేర్చుకోగలం నేర్చుకున్నది చెప్పుకోగలం 
చెప్పుకున్నది చేసుకోగలం చేసుకున్నది చూసుకోగలం 
చూసుకున్నది తలచుకోగలం తలచుకున్నది తెలుసుకోగలం  

ఏ భాష తెలిసినా మాట్లాడటం చదవటం వ్రాయటం అర్థం చేసుకోవటం వివరించటం సంభాషించటం తెలియాలి 
ఏది తెలియకున్నా భాషా విజ్ఞానంలో కొంత వరకు సంపూర్ణత లభించదు సమయోచితంగా సాగేందుకు వీలుపడదు 

-- వివరణ ఇంకా ఉంది!

పరమాత్మా! విశ్వమంతయు నీవే సహజత్వంతో పరమాత్మగా ఉన్నా కృత్రిమ రూపాలలో నీవు ఉన్నావా

పరమాత్మా! విశ్వమంతయు నీవే సహజత్వంతో పరమాత్మగా ఉన్నప్పుడు మానవుడు సృష్టించే కృత్రిమ రూపాలలో నీవు ఉండగలవా 

కృత్రిమ రూపాలు మానవునికి కావలసిన విధంగా నిర్మించుకున్న ఆకార వస్తువులు ఆయుధాలు పరికరాలు సౌకర్య నిర్మాణములు ఇలా వివిధ రకాలుగా రూపకల్పనలు చేసుకుంటున్నాడు 

నీవు (పరమాత్మ) లేనిదే ఏ అణువుకు భావన కలగదు ఏ పరమాణువుకు తత్వన నిలవదు 


-- వివరణ ఇంకా ఉంది!
 

కార్యాన్ని వేగవంతం చేస్తే క్రమం తప్పిపోవచ్చు

కార్యాన్ని వేగవంతం చేస్తే క్రమం తప్పిపోవచ్చు 
కార్యాన్ని కార్యక్రమంగా సాగిస్తేనే సరైన ఫలితం లభిస్తుంది 

కార్యక్రమం తప్పితే చేయవలసిన కార్యాలలో కొన్ని కార్యాలు జరగకుండా లేదా చేయకుండా సాగిపోవచ్చు 
చేయలేని కార్యాల వల్ల ఎన్నో లోపాలు సమస్యలు ఇబ్బందులు నష్టాలు వివిధ రకాలుగా ఏర్పడుతాయి 

చేయవలసిన కార్య సమయం ఎక్కువగా ఉంటే ఇమిడియున్న చిన్న కార్యాలను మానవ మేధస్సు మరచిపోవచ్చు అజాగ్రత్త పడవచ్చు అజ్ఞానం చెందవచ్చు పొరపాట్లు చేయవచ్చు 

మానవ మేధస్సులలో లోపాలు కలుగుతున్నందు వల్ల మానవుడే కార్యాలను కార్యక్రమంగా సక్రమంగా సాగించేందుకు యంత్రాలను సృష్టిస్తూ (కార్యక్రమాన్ని యంత్రంలో నిక్షిప్తం చేస్తూ) కార్యాలను చేయించుకుంటున్నాడు 

-- వివరణ ఇంకా ఉంది!

Monday, May 11, 2026

ఒక పూట ఆహారం కోసం ఒక సంవత్సరం శ్రమించాలి

ఒక పూట ఆహారం కోసం ఒక సంవత్సరం శ్రమించాలి  

ఒక పూట ఆహారాన్ని తయారు చేసుకోవాలంటే ఆహార పదార్థాలను రైతులు పండించాలి 
పండించిన ఆహార పదార్థాలను సక్రమంగా సమాజంలో అమ్ముకోవాలి 
అంగళ్ళ నుండి మనం ఆహార పదార్థాలను ఇంటికి తెచ్చుకోవాలి 
ఆహార పదార్థాలతో ఆహారాన్ని వండుకుకోవాలి 
ఆహారాన్ని వండిన తర్వాత భుజించుటకు సిద్ధంగా ఉంటుంది 

పంటను పండించుటకు కావలసిన విత్తనాలను మొక్కలను సంపాదించుటకు ఆరు నెలలు పడుతుంది 
మళ్ళీ ఆరు నెలలుగా విత్తనాలను మొక్కలను ఆహార పదార్థాలుగా శ్రమించి కృషించి కష్టాన్ని భరించి పండించాలి 

అలా తొలి దశలో ఎన్నో సంవత్సరాలు శ్రమించి ఎన్నో విధాలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను పరిశోధించి ఆరోగ్యమైన వాటినే ఎంచుకొని పంటలుగా ఉత్పత్తి చేసుకుంటూ రైతులు మనకు కావలసిన వాటిని అందిస్తున్నారు

ఉదయం లేవగానే ఒక అర గంటలో మనకు కావలసిన ఆహారాన్ని తయారుచేసుకుంటూ పత్రంపై లేదా పళ్లెంలో  వండుకొని ఆస్వాదిస్తున్నాము (భుజిస్తున్నాము)

సహజమైన ప్రకృతి ఆహారం ఆస్వాదించుటకు కూడా సంవత్సరం పడుతుంది 
సహజంగా తీసుకొనే ఫలాలు ఇతర ఆకులు ఎండు విత్తనాలు మొదలైన వాటిని ప్రకృతి అభివృద్ధి చేయాలన్నా సంవత్సరం పడుతుంది 

-- వివరణ ఇంకా ఉంది!

అనారోగ్యంతో మరణించగలనేమోనని సూర్యోదయంతో సూర్యున్ని ప్రార్థిస్తున్నా

అనారోగ్యంతో మరణించగలనేమోనని సూర్యోదయంతో సూర్యున్ని ప్రార్థిస్తున్నా  
ఓ సూర్య దేవా! సకల జీవరాసులు జీవించుటకు నీవే ప్రధానమైన కారణ మూర్తివి 

అనంతమైన బ్రంహాండంలో వివిధ రకాల ప్రకృతిలో సకల జీవరాసులకు ఆహారం సామర్థ్యం ఆలోచన విచక్షణం కార్యక్రమ విధానం కార్యకారణ గమన విజ్ఞానం రూపకల్పన పరిశోధనం కల్పిస్తున్నావు 

నీ ప్రజ్వలమైన ప్రకాశవంతమైన కాంతి కిరణాల స్పర్శచే దేహం ఆరోగ్యవంతమై మేధస్సు ఉత్తేజమై ఆలోచనలతో విచక్షణ జ్ఞానాన్ని పరిశోధనం చేస్తున్నది నేత్ర దర్శనంతో మేధస్సు ఆకాశమంతా విహరించే భావోదయమై జగమంతా జీవించే తత్వమై మహా జీవితాన్ని సాగిస్తున్నది 

వెలుగుతోనే జన్మించిన నీవు ప్రజ్వలమై సకల జీవరాసులకు నేత్రంతో రూపాకారాన్ని కలిగించి వెలుగులో విజ్ఞానంగా జీవించుటకు బంధాలను సృష్టిస్తున్నావు కాలాన్ని జీవితాలుగా సాగిస్తున్నావు సమయాన్ని నీవే రెండుగా మార్చుకుంటూ పరిభ్రమణం చెందుతున్నావు 

జీవించుటలో శ్రమ వలన కలిగే అనారోగ్యాన్ని నీవే సూర్యోదయంతో నీ ప్రజ్వల కాంతితో ఆరోగ్యంగా మార్చేలా 
దేహానికి వైద్యం అందించాలి శరీరానికి ఔషధాన్ని కల్పించాలి మేధస్సును మహోదయంగా ప్రభవింపజేయాలి 

-- వివరణ ఇంకా ఉంది!




కాలం ఎలాగైనా గడిచిపోతుంది మేధస్సు ఎలాగైనా ఆలోచిస్తుంది

కాలం ఎలాగైనా గడిచిపోతుంది మేధస్సు ఎలాగైనా ఆలోచిస్తుంది 

కాలంతో పాటు మేధస్సు కూడా ప్రయోజనమైతే జీవులకు ఎంతో ఉపయోగకరం  

కాలం ఋతువులుగా మారుతూ ప్రకృతిని వివిధ రకాలుగా పరిశుద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ సాగిపోతుంది 

మేధస్సు విజ్ఞానంతో ప్రకృతిని ఉపయోగించుకుంటూ దేహాన్ని రక్షించుకుంటూ జాగ్రత్త వహిస్తూ ఎన్నింటినో గ్రహిస్తూ బంధాలతో తరతరాలుగా మెరుగైన జీవితాలతో సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

జగతిలో జీవిస్తున్న జనులందరు జీవించుటకు జీవనోపాధి అవసరం

జగతిలో జీవిస్తున్న జనులందరు జీవించుటకు జీవనోపాధి అవసరం జాగృతం 

జీవనోపాధిని కలిగించే సమాజం సంస్థలు ప్రభుత్వాలు కర్మాగారాలు జీవన విధానాన్ని విజ్ఞానంగా న్యాయంగా సాగించాలి 

ప్రతి జీవికి వయస్సుతో పాటు జీవనోపాధి అవసరం లేకపోతే ఆలోచించుటకు మేధస్సు కూడా సహకరించదు 
జీవనోపాధితో ప్రతి రోజు శ్రమిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తూ కుటుంబానికి కావలసిన వాటిని సమకూర్చుకోగలడు 

జీవించుటలో జనమంతయు కలిసే సమాజాన్ని విజ్ఞానంగా రక్షణగా జాగృతంగా పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

గాలి ఎప్పుడు ఎక్కడ నుండి ఎంత వరకు ఎంతటి వేగంతో ఎలా వీస్తుందో ఎవరికి తెలుసు

గాలి ఎప్పుడు ఎక్కడ నుండి ఎంత వరకు ఎంతటి వేగంతో ఎలా వీస్తుందో ఎవరికి తెలుసు  
విశ్వమంతా వీచే గాలి తేలికగా ఉంటే శ్వాసకు కూడా తెలియకుండా వీస్తుంది స్పర్శకు కూడా అందకుండా వెళ్ళిపోతుంది 

గాలి వేగం కూడా భీభత్సమైతే భయంకరంగా ఉంటుంది బహు విధాలుగా వివిధ ధ్వనులతో చిందరవందరగా  వీస్తుంది 

శ్వాసకు కూడా గాలి (ప్రకృతి నుండి వీచే ప్రాణ వాయువు) అందకపోతే దేహం తల్లడిల్లై పోతుంది 

చుట్టూ ఉన్న ప్రదేశం పరిశుద్ధంగా ఉంటే గాలి లేకున్నా దేహమే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో శ్వాసలో గాలిని గ్రహిస్తుంది శరీరం కొంత సమయం ఓర్చుకుంటుంది 

నీటిలో కూడా గాలి ఉందని శ్వాసకు తెలుసు త్రాగినప్పుడు దేహం గ్రహించును [పరిశుద్ధమైన నీరు త్రాగాలి]

మన చుట్టూ ఉండే నీటిని (బావులు చెరువులు సరస్సులు కాలువలు జలాశయాలు నదులు సముద్రాలు) పరిశుద్ధంగా ఉంచుకోవాలి నీటితో వీచే గాలి కూడా ఎంతో ప్రాణవాయువుగా శరీరాన్ని చేరినప్పుడు దేహాన్ని శాంతింపజేస్తుంది 

జలపాతాలు ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉంటాయి వర్షపు నీరు కూడా పరిశుద్ధంగా ఉంటాయి 
వర్షపు నీటిని నిల్వచేసుకొనుటలో పరిశుద్ధంగా ఉంచుకోవాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి 

పంచభూతాలలో వివిధ రకాల గాలులు ఉన్నాయి వివిధ రకాలుగా వీస్తున్నాయి 

నేడు యంత్రముల నుండి వీచే గాలులను చాలావరకు ఆశ్వాదిస్తున్నాము ముఖ్యంగా గృహములలో సంస్థలలో 
ప్రయాణించుటలో కలిగే వేగపు గాలులు కూడా ఒక విధమైనవిగా వీస్తూ కలుగుతాయి  

యంత్రముల నుండి కాలుష్యమైన గాలులు కూడా వీస్తూ అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ఎంత చదువుకున్నా విజ్ఞానం ఐశ్వర్యాన్ని కలిగించకపోతే ప్రయోజనం ఏమున్నది

ఎంత చదువుకున్నా విజ్ఞానం ఐశ్వర్యాన్ని కలిగించకపోతే ప్రయోజనం ఏమున్నది  
ఎంత నేర్చుకున్నా సమయానికి జ్ఞాపకం కలుగకపోతే అర్థాన్ని గ్రహించుటలో ఏమున్నది 

చదువుటలో ఉన్న ఏకాగ్రత నేర్చుకొనుటలో ఉన్న అర్థం జ్ఞాపకశక్తిగా మేధస్సులో నిలవాలి 

పదిహేను సంవత్సరాలు చదువుకుంటూ నేర్చుకుంటూ జ్ఞాపకశక్తిని పెంచుకుంటూ సాగుటలో ఉన్న పరమార్థం విజ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా సంపాదించుకోవడమే 

విజ్ఞానం లేకున్నా అర్థమయ్యేలా ఎవరైనా కొంత సమయం బోధిస్తారు 
ఐశ్వర్యం లేకపోతే ఎవరైనా జీవ బంధం ఉన్నంతవరకు ఇవ్వగలరా చూసుకోగలరా 



-- వివరణ ఇంకా ఉంది!

శ్రమించకపోతే మరణం కలుగుతుందని నిరంతరం శ్రమిస్తున్నా

శ్రమించకపోతే మరణిస్తానేమోనని మేధస్సులో ఆలోచన కలుగుతున్నది  

శ్రమించకపోతే ఆరోగ్యం కూడా అనారోగ్యమై స్వయంకృత కార్యాలను కూడా చేసుకోలేక పోతానేమో 

శ్రమించలేనప్పుడు ఐశ్వర్యం కలిగేదెలా ఆహారం లభించేదెలా కుటుంబం సాగేదెలా బంధం నిలిచేదెలా  

అనారోగ్యంతో ఉన్నా ఆరోగ్యం పొందాలని కాస్త తేలికైన వ్యాయాయం చేస్తూ వివిధ కార్యాలతో సాగుతున్నా 

సూర్యోదయంతో ఉత్తేజమై మరణం లేకుండా అనేక కార్యాలతో సాగుతూ కుటుంబం అభివృద్ధికై జీవిస్తున్నా 

శ్రమించటంతోనే సర్వాన్ని గ్రహిస్తూ అవసరమైన వాటిని సమకూర్చుకుంటున్నా 


-- వివరణ ఇంకా ఉంది!


Sunday, May 10, 2026

ఓ సూర్య దేవా! నా శరీర భాగాలను నీ స్వశక్తితో సూర్యోదయాననే ఆరోగ్యంగా మార్చవా

ఓ సూర్య దేవా! నా శరీర భాగాలను నీ స్వశక్తితో సూర్యోదయాననే ఆరోగ్యంగా మార్చవా  
నా శరీర భాగాలు సహనం లేక దేహ సామర్థ్యం లేక అనారోగ్యంతో దిన చర్య కార్యాలను నిర్వర్తించలేక పోతున్నాయి 

సూర్యోదయంతో నా కార్యాలను నేను పరిశుద్ధమైన ఆరోగ్యంతో మహా సామర్థ్యంతో ప్రారంభించాలి 
సూర్యోదయంతో నా స్వశక్తితో నా కార్యాలను నేను సమర్థంగా పరిపూర్ణంగా విజ్ఞానంతో నిర్వర్తించాలి 

ప్రతి జీవి ఆరోగ్యం సూర్యోదయాననే పరిపూర్ణమై స్వశక్తితో దిన చర్య కార్యాలతో సాగుతూ జీవించాలి 


--  వివరణ ఇంకా ఉంది!

Friday, May 8, 2026

విశ్వ విజ్ఞానమంతా మేధస్సులో పరిభ్రమణం చేసే విధానం పర బ్రంహకే తెలియని పరిశోధనం

విశ్వ విజ్ఞానమంతా మేధస్సులో పరిభ్రమణం చేసే విధానం పర బ్రంహకే తెలియని పరిశోధనం  


-- వివరణ ఇంకా ఉంది!

శ్వాసనే ఆహారంగా చేసుకుని జీవించే యోగం బ్రంహకే తెలియని జీవ సంయోగం

శ్వాసనే ఆహారంగా చేసుకుని జీవించే యోగం బ్రంహకే తెలియని జీవ సంయోగం  

ఆహారం లేని సమయం శ్వాస ప్రయాస పరిశోధించి గమనం మనస్సుకే తెలియని దేహ విధానం 

శ్వాసనే సామార్థ్యంగా తలచి సాధన చేసే కార్యం యోగానికి తెలియని భావాల జీవ ప్రభావం 


-- వివరణ ఇంకా ఉంది!

యంత్రములు పనిచేస్తున్నంత వరకు మానవుడు నిద్రించడు

యంత్రములు పనిచేస్తున్నంత వరకు మానవుడు నిద్రించడు  

యంత్ర పని తీరు విధానం మొదలైనప్పటి నుండి మానవుని నిద్రించే విధానం మారిపోయింది ఆరోగ్య సామర్థ్యం తగ్గిపోయింది 

యంత్రదర్శిని ద్వారా మానవుని జీవన విధానం చాలా వరకు మారిపోయింది 

మానవుడు చేసే చాలా కార్యములు యంత్రముల నుండే సాగిపోతున్నాయి 

యంత్రములు సృష్టించినప్పటి నుండి మానవుని ఉద్యోగాలు కూడా రాత్రివేళలో సాగుతున్నాయి 

మానవుని కళా పోషణ యంత్ర పోషణగా (ఉత్పత్తి) మారిపోయినది 

యంత్రముల ద్వారా యజమానికి లాభదాయకం కార్మికునికి ఆరోగ్య సమస్య కలగడం జరుగుతున్నది 

మానవుని విజ్ఞానం మంత్రమై యంత్రమై సాగుతున్నది జీవన విధానం మారిపోతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

శ్వాస ప్రయాసను ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో శరీరం అంచుల దాకా వ్యాపింపజేయాలి

శ్వాస ప్రయాసను ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో శరీరం అంచుల దాకా వ్యాపింపజేయాలి  

శ్వాస శరీరమంతా వ్యాప్తి చెందినప్పుడు శరీర భాగాలన్నీ ఉత్తేజమై ఆరోగ్యంగా పనిచేస్తాయి 

శరీరంలో ఎన్నో కణాలు శ్వాస ప్రయాస ద్వారా ఉత్తేజమై శరీరాన్ని సామర్థ్యంగా ఉంచుతాయి 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాస రక్త ప్రసరణ ద్వారా శరీరమంతా వ్యాప్తి చెందగలదు 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, May 7, 2026

ఈనాటిది ఏదీ నీకు తెలియదా ఏనాటిది ఏదీ నీవు తెలుసుకోలేదా

ఈనాటిది ఏదీ నీకు తెలియదా ఏనాటిది ఏదీ నీవు తెలుసుకోలేదా 
ఏదీ తెలియకపోయినా జీవించుటకు కావలసిన జీవన విధానాన్ని తెలుసుకొని జీవితాన్ని సాగించాలి  

కావలసిన విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని నేర్చుకొని ప్రయోజనంతో ముందుకు సాగిపోతే జీవితం విజ్ఞానంతో అభివృద్ధి చెందుతుంది  


-- వివరణ ఇంకా ఉంది!

మానవుడిగా ఎన్ని శిక్షలు తప్పించుకున్నా మరణ శిక్ష తప్పదుగా

మానవుడిగా ఎన్ని శిక్షలు తప్పించుకున్నా మరణ శిక్ష తప్పదుగా  
జీవించుటలో ఎందరో ఎన్నో తప్పులు చేసినా శిక్షలు ఉండకపోవచ్చు తప్పించుకోవచ్చు అందుకే ప్రతి జీవికి మరణం ముగింపు 

తప్పుకు వేసే శిక్ష శిక్షణగా అనుభవించవచ్చు అప్పుడే తప్పును తెలుసుకొని మళ్ళీ జరగకుండా చూసుకోవచ్చు 
తప్పు వలన ఎన్నో సమస్యలు ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు అలాగే మరెన్నో తప్పులు జరుగుతూ ఎన్నో సమస్యలు సంభవించవచ్చు 

తప్పుకు శిక్షలు వేసేవి ఉంటాయి లేదా వేయకుండా సాగేవి ఉంటాయి లేదా తెలియకుండా పోయేవి ఉంటాయి లేదా శిక్ష వేసినా తప్పించునే వారు ఉంటారు అలాగే తప్పించే వారు ఉంటారు అలాగే మరచిపోయేవారు ఉంటారు 

ఏ తప్పు చేసినా విజ్ఞానాన్ని హితాన్ని గ్రహించాలి సత్ప్రవర్తనతో సాగాలి తప్పును సరిదిద్దుకోవాలి 

ఎప్పుడో చేసిన తప్పును ఎప్పుడో ఎవరో తెలుసుకుంటే శిక్ష వేయడానికి మానిషి ఉండకపోవచ్చు (మరణించి ఉండవచ్చు)

తప్పులు జరగడం సహజం దానిని సరిచేసుకోవడం మానవ ధర్మం 
తప్పుల వల్ల కలిగే నష్టాలను వివరించి అనుభవాలను పంచి (బోధించి) సరైన మార్గంలో నడిచేలా చేయడం గొప్పతనం 

ఒక తప్పు వల్ల ఇంకొకరికి శిక్ష పడవచ్చు (చేసిన వారికి శిక్ష పడకుండా ఇంకొకరికి లేదా కుటుంబానికి లేదా ఇతరులకు శిక్ష పడవచ్చు)
చేయని తప్పుకు శిక్ష అనుభవించడం వలన గౌరవం అభివృద్ధి కలగకపోవచ్చు జీవితం వృధా కావచ్చు జీవించుటకు మంచి అవకాశములు లేకపోవచ్చు కలగకపోవచ్చు 

ప్రతి మానవుడు ప్రతి కార్యాన్ని విజ్ఞానంతో చేయడానికి శ్రద్ధ వహించాలి శిక్షణ తీసుకోవాలి 
కార్యాలను కార్యక్రమంగా ఒక దాని తర్వాత ఒక కార్యం క్రమక్రమంగా జరిగేలా చేసుకోవాలి 

కార్యం ఎలా చేయాలో కార్యక్రమ నియమాలను క్రమక్రమంగా కార్యాచరణతో పాటించాలి అప్పుడే కార్యంలో ఎటువంటి అజ్ఞానం అజాగ్రత్త అశుద్ధత అపార్థం ఉండవు 

ఏ కార్యం తర్వాత ఏ కార్యం చేయాలో తెలుసుకోవాలి అప్పుడు కార్యక్రమం తెలుస్తుంది సత్ఫలితం లభిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!


Wednesday, May 6, 2026

Free Bus for Women entire the Country (INDIA) for any state of the Aadhaar Card

Free Bus for Women entire the Country (INDIA) for any state of the Aadhaar Card at any place in India

If Aadhaar card not having while travelling no need to take priced ticket for Women because of situations are different for them.

Make the Aadhaar card as Identity card to wear Women for easy to carry while traveling in to different places. Wearing identity card is not going to lost because no need to keep in bags and pick from the bag.

Giving free bus (no charges) to Women makes reducing the traffic instead of going by own vehicles (cars or bikes) and it makes reducing living cost (who are utilizing right way).


If you identified any problem, need to provide the solution entire the country is the mannerism (proud to ruling). - This implementation of idea credit goes to whom - who is going to implement.

Idea is not valuable, implementation is valuable to make success.


Example: In past years Roaming charges applicable while calling from one state to another or while travelling into another state roaming charges (call rate is high) as applicable. But now a days no charges because of Country wide same cost for any SIM card with monthly pack (days wise packs also available) and unlimited calls.



-- Still need more explanation/discussion to understand better!

కాలంతో పాటు ధరలు పెరుగుతున్నా అదుపు చేసే విజ్ఞానం మానవ మేధస్సుకు తెలియదా

కాలంతో పాటు ధరలు పెరుగుతున్నా అదుపు (తగ్గింపు) చేసే విజ్ఞానం మానవ మేధస్సుకు తెలియదా  

ధరలు పెరుగుతున్నా కొనేవారు ఉన్నారు వృధా చేసేవారు ఉన్నారు కొనలేని వారు ఉన్నారు కొనకపోతే వృధా చేసేవారు ఉన్నారు ధరలను పెంచేవారు ఉన్నారు 

పేదవారి శ్రమ కొనలేని ధరలతో జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలో ఎలా సాగించాలో తెలియని పరిస్థితి 


-- వివరణ ఇంకా ఉంది!

మానవా! నీవు శాఖాహారాన్ని పరిశోధిస్తున్నావా జీవాహారాన్ని పరిశోధిస్తున్నావా

మానవా! నీవు శాఖాహారాన్ని పరిశోధిస్తున్నావా జీవాహారాన్ని పరిశోధిస్తున్నావా  

ఆరోగ్యమైన శక్తి సామర్థ్యములు శాఖాహారంలో ఉన్నాయా జీవాహారంలో ఉన్నాయా 


ఎక్కువ సమయం శ్రమించాలన్నా అధిక బరువు మోసుకోవాలన్నా దూర ప్రయాణం చేయాలన్నా శాఖాహారం సరిపోవుటలేదు శరీరం సహనంతో సాగుట లేదు దేహం సహించుట లేదు ఆరోగ్యం నిలవటం లేదు 

ఎక్కువగా శ్రమించేందుకు శాఖాహారం సరిపోవుట లేదు సహకరించుట లేదు సహనంతో ఉండటం లేదు సామర్థ్యాన్ని నిలపటం లేదు 

వయస్సు పెరిగే కొద్ది శాఖాహారం శరీరానికి సరిపోక సామర్థ్యం లేక శ్రమించుటచే అనారోగ్యం చెందుతున్నది  


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, May 5, 2026

దేహంలో కేవలం శ్వాస ఉంటే సరిపోదు ఆశయం కూడా ఉండాలి

దేహంలో కేవలం శ్వాస ఉంటే సరిపోదు ఆశయం కూడా ఉండాలి 

ఆశయం ఉంటేనే శరీరం శ్రమిస్తుంది శ్వాస సహకరిస్తుంది దేహం సామర్థ్యాన్ని పెంచుతుంది జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది  

ప్రతి కార్యాన్ని ఆశయంతో సాగించి సాధనతో సాధించాలి జీవితాన్ని విజ్ఞానంతో అభివృద్ధి చేసుకోవాలి 

ఆశయం జీవిత కర్తవ్యం జీవన సాఫల్యం 


-- వివరణ ఇంకా ఉంది!

ఆరోగ్యానికైనా ఐశ్వర్యం ఉంటేనే జీవితం సాగుతుంది

ఆరోగ్యానికైనా ఐశ్వర్యం ఉంటేనే జీవితం సాగుతుంది 

ఆరోగ్యం కూడా ఐశ్వర్యంతోనే లభిస్తుంది ఐశ్వర్యమే ఆహారాన్ని అందిస్తుంది ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది 

ఐశ్వర్యం కోసమే శ్రమిస్తున్నాం ఆహారం కోసమే జీవిస్తున్నాం విజ్ఞానం కోసమే సాగుతున్నాం అభివృద్ధి కోసమే సాధిస్తున్నాం (సాధన చేస్తున్నాం) బంధాలతోనే కలసి ఉన్నాం 


-- వివరణ ఇంకా ఉంది!

విజ్ఞానాన్ని మేధస్సులోనే దాచుకునేలా శరీర నిర్మాణాన్ని ప్రతి జీవికి కల్పించావు మాతా!

విజ్ఞానాన్ని మేధస్సులోనే దాచుకునేలా శరీర నిర్మాణాన్ని ప్రతి జీవికి కల్పించావు మాతా!

విజ్ఞానాన్ని జ్ఞాపకాలుగా మేధస్సులో అర్థంగా చేర్చి మళ్ళీ గుర్తు చేసుకొనుటకు ఆలోచనలనే తాళంచెవిగా కల్పిస్తున్నావు 

కార్యక్రమాలను విజ్ఞానంగా సాగించుటకు ఆలోచనలనే అవగాహన చేసుకొని అర్థాన్ని గ్రహించి మళ్ళీ వాటిని మేధస్సులోనే జ్ఞాపకంగా దాచుకోవాలి గుర్తు పెట్టుకోవాలి 

అర్థం కాని వాటిని అర్థమయ్యేందుకు నేర్చుకోవాలి మళ్ళీ గుర్తుచేసుకోవాలి వ్రాసుకొని చదువుకోవాలి జ్ఞాపకంగా ఉంచుకోవాలి 
జీవన విధాన కార్యక్రమాలను సాగించేందుకు జ్ఞాపకంగా నేర్చుకునేందుకు అభ్యాస కార్య సాధన కార్యార్థంతో చేయాలి 

జీవుల భాషలతోనే మేధస్సులో విజ్ఞానం చేరుతుంది 

కార్యక్రమ విధానమే కార్యాచరణగా కార్యార్థంగా కార్యాలను పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా సత్ఫలితాలతో సాగిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

అనారోగ్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా శరీరం స్తంభించి మనస్సుకు అదో పరిస్థితిని కలిగిస్తుంది

అనారోగ్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా శరీరం స్తంభించి మనస్సుకు అదో పరిస్థితిని కలిగిస్తుంది  
శరీరానికి నొప్పి కలిగినప్పుడల్లా ఆలోచనలు అనారోగ్యాన్ని గుర్తుచేసుకొని మనస్సు పరిస్థితి మౌనమై నిలిచిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

విశ్వానికి విలువైన వాక్యాన్ని అందించకపోయినా సత్యాన్ని అందిస్తే చాలు

విశ్వానికి విలువైన వాక్యాన్ని అందించకపోయినా సత్యాన్ని అందిస్తే చాలు 

సత్యమే అనంతమైన విశ్వ విజ్ఞాన వాక్యాలను వేదాలుగా బ్రంహాండానికి కాల సమయమే అందిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

శరీరంలో ఒక్క సారి అనారోగ్యంతో నొప్పి కలిగితే మరెన్నో సార్లు కలగవచ్చు

శరీరంలో ఒక్క సారి అనారోగ్యంతో నొప్పి కలిగితే మరెన్నో సార్లు కలగవచ్చు 
నొప్పి కలిగిన ప్రతి సారి అనారోగ్యం గుర్తుకు వస్తూ మరణాన్ని గుర్తు చేయవచ్చు 

విజ్ఞానంతో విశ్రాంతితో ప్రశాంతమైన ఆరోగ్యాన్ని పొందుతూ మరణాన్ని మరచిపోవాలి  
విజ్ఞానంతో సామర్థ్యంతో పరిశుద్ధమైన కార్యాలను చేసుకుంటూ చిరంజీవిలా జీవించాలి 

శరీరంలో నొప్పి కలిగిన ప్రతి సారి అనారోగ్యమని గుర్తించకు 
నొప్పి కలిగిన ప్రతి సారి ఆరోగ్య సామర్థ్యాన్ని పెంచుకోవాలని విజ్ఞాన వేదన సూచిస్తుంది 

-- వివరణ ఇంకా ఉంది!

తెలుసుకోవడం నేర్చుకోవాలి వినాశనం వదులుకోవాలి

తెలుసుకోవడం నేర్చుకోవాలి వినాశనం వదులుకోవాలి  
సృష్టించడం తెలుకోవాలి మరణించడం వదులుకోవాలి 

మరణం వినాశనం కలిగేందుకు కాలమే కనిపెడుతుంది 
తెలుసుకోవడం సృష్టించడం విజ్ఞానమే నేర్పబడుతుంది 

సృష్టించడం ఆరోగ్యం విజ్ఞానం 
మరణించడం అనారోగ్యం అజ్ఞానం


-- వివరణ ఇంకా ఉంది!

మరణించే రూపంతో జీవిస్తున్నావని అనారోగ్యం తెలుపుతున్నదా

మరణించే రూపంతో జీవిస్తున్నావని అనారోగ్యం తెలుపుతున్నదా  

బంధాలతో విడిపోతున్నావని ఆరోగ్యాన్ని అనుబంధగా అందిస్తున్నావా 

మరణంతో ఏమవుతుందో బంధాల జీవితాలు ఎలా సాగుతాయో తెలిసేదెలా 
మరణంతో శూన్యమై బంధాలతో మౌనమై అనుబంధాలకు అదృశ్యమై సాగేదెలా 

జీవించుటలో ఎన్నో సాధించినా బంధాలకు అవసరమయ్యే వాటిని అందించలేక అదృశ్యమై పోయేదెలా 
జీవిచుటలో శ్రమతో పోరాడినా తీరని సమస్యలను పరిష్కారించలేక అనారోగ్యంతో శూన్యమై పోయేదెలా 

ఆరోగ్యాన్ని అందిస్తూ విజ్ఞానంతో సాగిపోతూ బంధాలకు సంబంధమై అనుబంధాలకు అభివృద్ధిని సాధించవా 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, May 4, 2026

గ్రహచార గ్రహణం గ్రహించలేనిది గమనించలేనిది

గ్రహచార గ్రహణం గ్రహించలేనిది గమనించలేనిది  

ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికీ ప్రమాదం ఆపద ఆటంకం కలుగుతుందో మేధస్సు గ్రహించలేనిదే గ్రహచార సమయం 

ప్రతి కార్యంలో జాగ్రత్త వహించాలి తగిన నియమాలు పాఠించాలి విజ్ఞానంతో చేసుకోవాలి పరిశుద్ధత ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రయాణంలో ప్రమాదం తెలియనిది ఆటంకం అవగాహనకు అందనిది

ప్రయాణంలో ప్రమాదం తెలియనిది ఆటంకం అవగాహనకు అందనిది   

ప్రయాణంలో ముందు ఉన్నవారికి కలిగే ప్రమాదాన్ని గుర్తించాలి జరిగే ఆటంకాన్ని గమనించాలి 

ముందు ఉన్న వారికైనా వెనుక ఉన్న వారికైనా ఇరుప్రక్కల ఉన్న వారికైనా మనకైనా ప్రమాదం కలిగే స్థితిని గ్రహించాలి ఆటంకం జరిగే పరిస్థితిని గుర్తించాలి 

ప్రయాణం సులభమైనది కాదు జాగ్రత్తగా చుట్టుప్రక్కల ఉన్న వాటినన్నింటిని వేగంగా గ్రహించి సురక్షితంగా సుఖాంతంగా గమ్యాన్ని చేరుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

జీవించుటలో మరణం ఎప్పుడు అని ఏనాడు తలచుకోవద్దు

జీవించుటలో మరణం ఎప్పుడు అని ఏనాడు తలచుకోవద్దు విజయం కోసం ప్రయత్నం మొదలైనదని సాధన కార్యాన్ని ప్రారంభించు  

సాధన చేస్తున్నావని సాధనతో విజ్ఞానాన్ని గ్రహిస్తూ అవగాహనతో విజయాన్ని పొందుటకు (పొందుతున్నావని) సమీపించు 


-- వివరణ ఇంకా ఉంది!

మానవుడు ఏది సాధించినా అది నిన్నటికే

మానవుడు ఏది సాధించినా అది నిన్నటికే నేడు ఏది సాధించాలో సాధన చేయాలి  

నేడు చేసే సాధన రేపటికి ఉపయోగపడేలా గుర్తింపు పొందేలా విజ్ఞానంతో ఆలోచించాలి 

నేడు సాధించినది ఏదీ లేదు రేపటికే సాధన చేసేలా నేటి విజ్ఞానంతో శ్రమిస్తూ సాగిపోవాలి 

భవిష్యత్ లో కలిగే విజ్ఞానం యంత్ర జ్ఞానం తెలుపవచ్చు మానవుడు మహాత్ముడిలా గ్రహించవచ్చు 

యంత్ర జ్ఞానంతో భవిష్య విజ్ఞానాన్ని చూసుకునేలా మానవుడు యంత్రదర్శినిని సృష్టించుకుంటూ సాగుతున్నాడు 

మానవుని విజ్ఞానం మానవునికి చాలదు అనేలా నేటి విజ్ఞానం కొరతగా సాగుతున్నది 
మానవ యంత్ర విజ్ఞానాన్ని గ్రహించుటకు సాధనకు సాధారణ మానవుడికి కఠినమవుతున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

బ్రంహాండం అనంతమైన విశ్వ విజ్ఞానంతో సాగుతున్నది

బ్రంహాండం అనంతమైన విశ్వ విజ్ఞానంతో సాగుతున్నది  

బ్రంహాండమంతా అనంతమైన విశ్వ విజ్ఞానంతో అనేకమైన యంత్రముల జ్ఞానంతో జీవుల ఆలోచనలతో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సాగుతున్నది 

అణువులు జీవులు ఎన్నో రకాలుగా ఎన్నో ఆకార రూపాలుగా ఎన్నో కార్యాలతో ఎన్నో విధాలుగా సాగుతున్నాయి 

భూ ప్రకృతి నుండి అంతరిక్షము వరకు ఎన్నెన్నో కార్యాలతో మేధస్సు గ్రహించలేనంతగా సాగుతున్నాయి 


ఏ మానవుడు ఏ విజ్ఞానంతో ఎప్పుడు ఎలా సాగుతున్నాడో దేనిని గ్రహిస్తున్నాడో తెలుసుకోలేని జీవన యంత్ర విజ్ఞానం నేటి తరం మంత్ర వలయంగా సాగుతున్నది 

మానవుడు యంత్రములతో మాంత్రికుడిలా విజ్ఞానాన్ని సృష్టిస్తున్నాడు 


-- వివరణ ఇంకా ఉంది!

కార్యక్రమంతో ప్రణాళిక వేసుకుంటే కార్యం క్రమంతో సాగుతుంది

కార్యక్రమంతో ప్రణాళిక వేసుకుంటే కార్యం క్రమంతో సాగుతుంది 
కార్యం క్రమంగా సాగిపోతే ఎటువంటి అడ్డంకులు సమస్యలు కలగవు  

కార్యక్రమంతో ప్రణాళిక వేయాలంటే కార్య అనుభవం ఉండాలి కార్య అవగాహనం తెలియాలి 

కార్య అనుభవం కార్య అవగాహనం వయస్సుతో పాటు తెలుస్తాయి అర్థాన్ని గ్రహిస్తాయి 
కార్య క్రమ విధానం మేధస్సులో జ్ఞాపకంగా అనుభవంతో ఉండిపోతుంది 

కార్యక్రమం ద్వారా జీవికి ప్రకృతికి అపాయం అజాగ్రత్త అజ్ఞానం అనారోగ్యం అశుద్ధత లేకుండా కార్యాలు జరిగిపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ఓ మహా దేవా! నీ రక్షణ నిరీక్షణతో సాగుతున్నది

ఓ మహా దేవా! నీ రక్షణ నిరీక్షణతో సాగుతున్నది
ప్రతి కార్యాన్ని పరీక్షిస్తూ నిరంతరం రక్షిస్తున్నావు 

నీ రక్షణతోనే ఎదుగుతూ ఎన్నో నేర్చుకుంటూ విజ్ఞానంతో ముందుకు సాగుతున్నాను 
నీ రక్షణతోనే బంధాలతో జీవితాన్ని ఆరంభించి ఎన్నో అనుబంధాలతో సాగిపోతున్నాను 

రక్షణ ఉన్నంత కాలం దేహం జీవిస్తూనే బంధాలను కలుపుకుంటూ సంబంధాలతో సాగుతుంది 

రక్షణ జీవిత కాలం వరకు ఉంటే జీవితం అద్భుతంగా ఆనందంగా అభివృద్ధితో సాగుతుంది 
రక్షణతో పాటు ప్రతి మనిషికి ఆరోగ్యం విజ్ఞానం కార్యాచరణ కార్యశ్రమ కార్యక్రమం ఉండాలి  

ప్రతి జీవికి రక్షణ అవసరం 


-- వివరణ ఇంకా ఉంది!