వృద్ధాప్యంతో సాగే అనారోగ్యమే తెలుపుతున్నదా సమయం సమీపిస్తున్నదని
సమయం ఎంతని తెలియని కాల వ్యవధిలో నీ అనారోగ్యం ఆరోగ్యమయ్యేలా జీవన విధానాన్ని మార్చుకోగలవా
నీ శరీర సామర్థ్యం సహనాన్ని పంచుకునేలా ఆహార అలవాట్లను ఎంచుకొని వ్యాయామ పద్ధతులను పాటించగలవా
నిమిషాలే సమయమని తెలిసినా శ్వాసను ధ్యాసగా చేసుకొని దేహాన్ని ఉత్తేజంగా మార్చుకొని శరీరాన్ని నడిపించవా
హృదయ చలనంతో ప్రయాణమే సాగిస్తూ ప్రకృతినే ఆస్వాదిస్తూ పరిశుద్ధమైన ప్రాణవాయువుతో ఆరోగ్యం సరిచేసుకోవా సహజమైన ప్రకృతి ఆహారాన్ని సమపాలలో దేహానికి అందించలేవా సమృద్ధిగా జీవించలేవా
మేధస్సును మహా బ్రంహాండం చేసుకొని విశ్వ ప్రకృతి ప్రయాణంతో దేహ స్వభావ తత్వాలను ఆకాశంతో తిలకిస్తూ అపారమైన విజ్ఞానంతో సుదీర్ఘంగా జీవించలేవా
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment