ఆనాడు సకల జీవరాసులన్నీ ప్రకృతిలోనే జీవించేవి
జీవులన్నీ ప్రకృతిలోని జన్మించి జీవించి మరణించేవి
కొంత కాలానికి కొన్ని యుగాల తర్వాత మానవుడు తన విజ్ఞానం ద్వారా ప్రకృతి నుండి గృహంలో జీవించుటకు సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాడు
అలాగే మానవుని శరీర నిర్బంధక శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ వస్తున్నాయి
మానవుని జీవన విధానం మారుతూ ఎన్నో వృత్తులను నేర్చుకొని జీవిస్తూ సాగుతున్నాడు
నేడు మానవుని వృత్తులు వివిధ యంత్రములతో పని చేయడం సాగుతున్నది
నేడు మానవుడు కాలక్రమేణ వివిధ రకాల యంత్ర భాషలను నేర్చుకుంటూ పనిచేస్తున్నాడు
ఆనాడు ఏ సమస్య కలిగిన ప్రకృతియే ఆధారమయ్యేది
నేడు మానవునికి ఏ సమస్య కలిగినా కృత్రిమ విధానంతో సాగుతున్నది జీవించుటకు ఐశ్వర్యమే మూలమవుతున్నది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment