ఒక పూట ఆహారం కోసం ఒక సంవత్సరం శ్రమించాలి
ఒక పూట ఆహారాన్ని తయారు చేసుకోవాలంటే ఆహార పదార్థాలను రైతులు పండించాలి
పండించిన ఆహార పదార్థాలను సక్రమంగా సమాజంలో అమ్ముకోవాలి
అంగళ్ళ నుండి మనం ఆహార పదార్థాలను ఇంటికి తెచ్చుకోవాలి
ఆహార పదార్థాలతో ఆహారాన్ని వండుకుకోవాలి
ఆహారాన్ని వండిన తర్వాత భుజించుటకు సిద్ధంగా ఉంటుంది
పంటను పండించుటకు కావలసిన విత్తనాలను మొక్కలను సంపాదించుటకు ఆరు నెలలు పడుతుంది
మళ్ళీ ఆరు నెలలుగా విత్తనాలను మొక్కలను ఆహార పదార్థాలుగా శ్రమించి కృషించి కష్టాన్ని భరించి పండించాలి
అలా తొలి దశలో ఎన్నో సంవత్సరాలు శ్రమించి ఎన్నో విధాలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను పరిశోధించి ఆరోగ్యమైన వాటినే ఎంచుకొని పంటలుగా ఉత్పత్తి చేసుకుంటూ రైతులు మనకు కావలసిన వాటిని అందిస్తున్నారు
ఉదయం లేవగానే ఒక అర గంటలో మనకు కావలసిన ఆహారాన్ని తయారుచేసుకుంటూ పత్రంపై లేదా పళ్లెంలో వండుకొని ఆస్వాదిస్తున్నాము (భుజిస్తున్నాము)
సహజమైన ప్రకృతి ఆహారం ఆస్వాదించుటకు కూడా సంవత్సరం పడుతుంది
సహజంగా తీసుకొనే ఫలాలు ఇతర ఆకులు ఎండు విత్తనాలు మొదలైన వాటిని ప్రకృతి అభివృద్ధి చేయాలన్నా సంవత్సరం పడుతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment