సమాజంలో దేనిని గ్రహించకపోయినా పరిశుద్ధ విధానాన్ని వివిధ కార్యాలతో గమనిస్తే చాలు
సమాజం ఎంతటి పరిశుద్ధంగా ఉంటుందో విజ్ఞానం కూడా అంతటి పరిశుద్ధంగానే కనిపిస్తుంది
ఎన్నో కార్యాలు ఎన్నో రకాలుగా సాగిపోతూ ఉన్నా వాటిలో ఎంతటి పరిశుద్ధత ఉందో తెలుసుకోవాలి
సమాజాన్ని పరిశుద్ధంగా మార్చుకుంటే చాలు మానవ జన్మకు కావలసినది ఇంకేదీ ఎప్పటికి అవసరం ఉండదు
పరిశుద్ధత నుండి ఎన్నో విలువలను తెలుసుకోవచ్చు విజ్ఞానాన్ని గ్రహించవచ్చు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు
పరిశుద్ధత ఉన్నవారికే విచక్షణ గుణాలు ఉత్తేజమైన విజ్ఞాన ఆలోచనలు పవిత్రమైన దైవానుగ్రహం ఆశ్రయించును
పరిశుద్ధత నుండే విజ్ఞానం ఉదయిస్తుంది పరిపూర్ణమైన అనుభవం కలుగుతుంది ప్రఖ్యాతమైన వేదాంతం తెలుస్తుంది స్వచ్ఛమైన ప్రకృతి అభివృద్ధి చెందుతుంది పర్యావరణమైన వాతావరణం శుద్ధమై చిగురిస్తుంది
ప్రతి జీవికి పరిశుద్ధత గురించి తెలియాలి తెలుసుకోవాలి తెలుసుకొని జీవించాలి ఆచరించాలి తరతరాలుగా సాగించాలి
ప్రతి ఆహారం ప్రతి వస్త్రం ప్రతి వస్తువు ప్రతి నిర్మాణం ప్రతి అణువు ప్రతి పరమాణువు పరిశుద్ధంగా ఉదయించి పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధంగా అస్తమించాలి పరిశుద్ధంగానే నేర్చుకోవాలి పరిశుద్ధంగానే వాడుకోవాలి పరిశుద్ధంగానే ఉంచుకోవాలి పరిశుద్ధంగానే ఆలోచించాలి పరిశుద్ధంగానే ప్రయాణించాలి పరిశుద్ధంగానే శ్రమించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment