అమృతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమృతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, డిసెంబర్ 2016, మంగళవారం

దేహం లేని దైవం ఎందుకో

దేహం లేని దైవం ఎందుకో
వేషం లేని ఆవేశం ఎందుకో
దేశం లేని ప్రదేశం ఎందుకో
జీవం లేని సజీవం ఎందుకో
వర్ణం లేని సువర్ణం ఎందుకో
శుభం లేని శోభనం ఎందుకో
జనం లేని భజనం ఎందుకో
జ్ఞానం లేని విజ్ఞానం ఎందుకో
రాగం లేని స్వరాగం ఎందుకో
గీతం లేని సంగీతం ఎందుకో
భోగం లేని సంభోగం ఎందుకో
దానం లేని ప్రదానం ఎందుకో
దాహం లేని దహనం ఎందుకో
చిత్రం లేని విచిత్రం ఎందుకో
భావం లేని స్వభావం ఎందుకో
వేదం లేని వేదాంతం ఎందుకో
భాగ్యం లేని సౌభాగ్యం ఎందుకో
వ్రతం లేని అమృతం ఎందుకో
పూర్ణం లేని సంపూర్ణం ఎందుకో
గంధం లేని సుగంధం ఎందుకో
తంత్రం లేని మంత్రం ఎందుకో
శాస్త్రం లేని శాస్త్రీయం ఎందుకో
ఖండం లేని అఖండం ఎందుకో
మోహం లేని మోహనం ఎందుకో
అందం లేని చందనం ఎందుకో
యోగం లేని సంయోగం ఎందుకో
రాజ్యం లేని సామ్రాజ్యం ఎందుకో
నందనం లేని ఆనందం ఎందుకో
యుగం లేని యుగాంతం ఎందుకో
ఆత్మ లేని పరమాత్మ ఎందుకో ఎవరికో 

14, నవంబర్ 2016, సోమవారం

సర్వాంగ సుందరం సర్వానంద యోగం

సర్వాంగ సుందరం సర్వానంద యోగం
సర్వాంత సుఖనం స్వరానంద సంభోగం
స్వయం సునందం స్వరాభిమాన యోగం
సర్వం సుదర్శనం స్వరజీవన సమ్మేళనం  || సర్వాంగ ||

సర్వానంద యోగం మహానంద భీజం
సదానంద భావం మహా యోగ అమృతం
సర్వానంద తరంగం సర్వ భూషణం
సదానంద భవనం సర్వ సంభోగమం           || సర్వాంగ ||

సుమధురానంద సుగంధం సుఖ ప్రయాసం
సంగీతానంద సుఫలం స్వరానంద స్వరాగం
స్వయంభువ సువర్ణం స్వరూప తేజ ప్రకాశం    
సదానంద సిద్ధత్వం సుప్రయోజన పరిశుద్ధం   || సర్వాంగ || 

11, అక్టోబర్ 2016, మంగళవారం

గంగా జల ధార గంగాధర గంగా పవిత్రం పరమేశ్వరం జలం పరిశుద్ధం

గంగా జల ధార గంగాధర గంగా పవిత్రం పరమేశ్వరం జలం పరిశుద్ధం
గంగా నది తీర గంగా తీర్థం గంగా పవిత్రం మహేశ్వరం జలం అమృతం
గంగా స్వర జీవ గంగాలయ గంగా పవిత్రం జీవేశ్వరం జలం స్వరాగమనం
గంగా మాతృ దేవో గంగా మాతా గంగా పవిత్రం గంగేశ్వరం జలం మాతృత్వం