జీవించడం తెలియలేక ఎన్నో జీవులు మరణిస్తున్నాయి
జీవించుటలో విజ్ఞానం రక్షణ ఆహారం అనుభం పర్యావరణం లేక జీవన విధానం తెలియక జీవులెన్నో మరణిస్తున్నాయి
జీవించుటలో తగిన సదుపాయాలు సౌకర్యాలు లేక అందుకోలేక తెలియని అవస్థలతో జీవులు మరణిస్తూనే ఉన్నాయి
గ్రహించలేని విజ్ఞానం బోధన లేని జీవనం అనుభవం లేని ప్రయాణం వసతులు లేని ప్రాంతం ఋతువుల ప్రభావాల ఇబ్బందులు ఇలా ఎన్నో సమస్యలు కలుగుటలో జీవించడం జీవులకు కష్ట తరంగా మారుతున్నది
ఒక జీవికి ఇంకో జీవి ఆహారంగా మారుతున్నప్పుడు జన్మించుటలో జీవితం కూడా ఆహారమై పోతున్నది
ఒక జీవికి ఆహారం కోసం జన్మించి ఎదుగుతూ ఎన్నో స్వభావ తత్వాలతో ఎన్నింటినో గ్రహిస్తూ జీవన విధానాన్ని సాగించుటలో మరో జీవికి ఆహారమగుట ఎంత వరకు న్యాయ ప్రమాణం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి