28, సెప్టెంబర్ 2026, సోమవారం

పరమాత్మమా! కాల జ్ఞానమా! సమయ స్థితి విధమా! శరీర ధర్మమా!

పరమాత్మమా! కాల జ్ఞానమా! సమయ స్థితి విధమా! శరీర ధర్మమా!   
మరణించుటలో కూడా మధ్యలో నిర్బంధమై ప్రయాణాన్ని ప్రారంభిస్తూ శ్రమను ఖర్చులను ఇబ్బందులను ఎన్నో విధాలుగా పెంచుతున్నావు 

ఎందరికో శరీర భారాన్ని కలిగిస్తూ అనారోగ్యంతో దేహాన్ని హింసిస్తూ శ్వాసను సందిగ్ధం చేస్తూ కదలని చలనాన్ని ఎన్నో విధాలా భ్రమింపజేస్తూ మరణాన్ని కఠినంగా మార్చుతూ మేధస్సును పరధ్యాసతో సాగిస్తున్నావు 

మరణ ప్రయాసతో భరించే శరీర దేహం కంటే చుట్టూ ఉన్న బంధాల వారికి భరించే శక్తి లేక ప్రశాంతత లేక మేధస్సులను సతమతం చేస్తున్నావు 

ప్రశాంతత లేని మరణాన్ని ప్రమాదంగా మార్చుతూ రోజుల వారిగా సంవత్సరాలుగా ఇబ్బందులతో శ్వాస పరధ్యాసతో అవస్థలతో అయోమయంగా సాగిస్తున్నావు 

అహర్నిశంగా శ్రమించిన శరీరానికి మరణాన్ని కూడా ప్రశాంతంగా కలిగించలేక పోతున్నావు సంపాదనను కూడా అప్పులతో సాగేలా చేస్తున్నావు 

విధి విధానం ఎలా ఉంటుందో కాల సమయానికి కూడా తెలియని విధంగా విచిత్రంగా విచారకరమైన పరిస్థితులతో సాగిస్తుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి