18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

పరమాత్మా! నేను నేనుగా లేనని నీకైనా తెలుసునా

పరమాత్మా! నేను నేనుగా లేనని నీకైనా తెలుసునా 
నేను నేనుగా తెలియని విధానం నీకైనా తెలుసునా 

నాలో నేనైనా ఉండలేనట్లుగా నా స్థితి మారిపోయెనే 
నాతో నేనైనా ఉండలేనట్లుగా నా స్థాయి మారిపోయెనే 

ఉన్నానని ఆలోచన గ్రహించుట లేదు లేనని గమనం తెలుపుట లేదు 
ఉన్నానని విచక్షణ స్వభావం లేదు లేనని జ్ఞాపకం కలుగుట లేదు  

ఆలోచనగా శూన్యమై ఉన్నానా విజ్ఞానిగా అదృశ్యమై వెళ్ళానా 
శరీరంతో అరంజితమై ఉన్నానా దేహంతో అభాగ్యమై పోయానా 

మరచినది ఏదో జ్ఞాపకమైనది ఏదో ఉన్నది ఏదో లేనిది ఏదో 
వచ్చినది ఏదో పోయినది ఏదో రానిది ఏదో రాలేనిది ఏదో 

భ్రమలో పరిభ్రమిస్తున్నానా భ్రమణంలో భ్రమ చెందుతున్నానా 
భ్రమతో భారమై ఉన్నానా భ్రమణంతో భ్రమకమై సాగుతున్నానా  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి