జీవమా! నీకు లేదా వైద్యం
నీ రూపానికి అవసరం లేదా
నీ అవతారానికి అవసరమే ఉండదా
నీ ప్రమాదానికి రక్షణ కూడా ఉండదా
నీవు జీవించుటలో నీలో ఏ విజ్ఞానం ఉన్నదో
నీవు ప్రయాణించుటలో నీలో ఏ ఆరోగ్యం ఉండునో
అనారోగ్యం కలిగిన దేహంతో నీవు ఎలా ఏ స్వభావాలతో ఆలోచించెదవా
ప్రమాదం కలిగిన శరీరంతో నీవు ఎలా ఏ తత్త్వములతో జీవించేదవూ
నీ జీవిత కాలంలో కలిగే అనారోగ్యానికి ప్రమాదానికి శరీరం భరించే భావ తత్త్వాలు పరమాత్మకే తెలియాలి
నీ జీవన కాలంలో వెతికే ఆహారానికి వసతులకు ఎన్ని ప్రయత్నాలో ఎన్ని కష్టాలో పరమాత్మయే తెలుసుకోవాలి
ఏ బంధాలతో ఎలా సాగుతూ జీవిస్తున్నావో
ఏ స్వభావాలతో ఎలా జీవిస్తూ అస్తమిస్తావో
మానవా! నీ లోకంలో మరెన్నో జీవరాసులు విజ్ఞానం తెలియక ప్రమాదం తెలియక జీవిస్తున్నాయి జాగ్రత్త సుమా
మానవా! నీ లోకంలో మరెన్నో జీవరాసులు ఆటంకం తెలియక అనుభవం తెలియక జీవిస్తున్నాయి రక్షణ సుమా
విశ్వ ప్రకృతి సూర్యోదయమా జీవులకు నిత్యం ఆరోగ్యం కలిగేంచే ఆహారాన్ని పర్యావరణాన్ని అందించుమా
విశ్వ ప్రకృతి సూర్యాస్తమయమా జీవులకు విశ్రాంతి విజ్ఞానం కలిగించే జీవన కార్యాల అనుభవాలను అందించుమా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి