గంగాధర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గంగాధర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఏనాటిదో గోదావరి ... ఎక్కడిదో ఈ జల ప్రవాహ నది

ఏనాటిదో గోదావరి ... ఎక్కడిదో ఈ జల ప్రవాహ నది
ఎక్కడి నుండి ఎక్కడికో ఈ ప్రవాహ ప్రయాణ జలధారి
గోవర్ధన గిరి నడుమ వస్తూ ముందుకే సాగేను గంగాధర జల దారి  || ఏనాటిదో ||

అడగాలని అడుగులు వేసినా
పలకాలని పరుగులు తీసినా
మాట్లాడాలని మరలు పంపినా
వెళ్ళాలని వంకలు తిరిగినా
తాకాలని తలుపులు చేరినా  
నిలవాలని నడకలు ఆపినా

పుష్కరాలకై పుణ్య భావాలతో పరుగులే తీస్తున్నది  || ఏనాటిదో ||

అందాలని అలలు ఎగిరినా  
కదలాలని కెరటాలు సాగించినా
దాటాలని దిక్కులు చూసినా
గడవాలని గాలులు వీచినా  
చేరాలని చెఱువులు దాటినా
వదలాలని ఒడ్డులు తెంపినా

శతాబ్దాలుగా పవిత్ర భావాలతో ప్రవహిస్తూ వస్తున్నది  || ఏనాటిదో || 

11, అక్టోబర్ 2016, మంగళవారం

గంగా జల ధార గంగాధర గంగా పవిత్రం పరమేశ్వరం జలం పరిశుద్ధం

గంగా జల ధార గంగాధర గంగా పవిత్రం పరమేశ్వరం జలం పరిశుద్ధం
గంగా నది తీర గంగా తీర్థం గంగా పవిత్రం మహేశ్వరం జలం అమృతం
గంగా స్వర జీవ గంగాలయ గంగా పవిత్రం జీవేశ్వరం జలం స్వరాగమనం
గంగా మాతృ దేవో గంగా మాతా గంగా పవిత్రం గంగేశ్వరం జలం మాతృత్వం