సమాజంలో విజ్ఞానాన్ని పొందుతున్నావా అజ్ఞానాన్ని గమనిస్తున్నావా
సమాజంలో ప్రతి రోజు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలా ఎన్నో రకాలుగా సాగిపోతాయి
సమాజంలో నీవు జీవించుటలో విజ్ఞానం చెందుతున్నావా అజ్ఞానాన్ని వదిలేస్తున్నావా అశుద్ధతను గమనిస్తున్నావా అనుభవాన్ని పొందుతున్నావా మోసపోతున్నావా నష్టపోతున్నావా సంపాదన చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా
సమాజంలో ప్రయాణించుటలో నీవు నీ వాహనాల వేగాన్ని అదుపు చేసుకోగలుగుతున్నావా ప్రమాదాల నుండి సురక్షణగా గమ్యాలను చేరుకుంటున్నావా వాహనాల సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నావా ప్రయాణ మార్గాల నియమాలను పాఠిస్తున్నావా జాగ్రత్తలను గమనిస్తున్నావా నీవు చుట్టూ ప్రయాణించే వారికి సరైన మార్గాన్ని అందిస్తూ సరైన దూరాన్ని ఇవ్వగలుగుతున్నావా ఎవరికీ ఆర్భాటం ఆటంకం కలగకుండా ప్రయాణ వేగాన్ని అదుపు చేసుకుంటున్నావా వాహనాలను సరైన స్థితిలో ఉంచుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నావా అపాయం జరగకుండా చూసుకుంటున్నావా అన్ని రకాలుగా అన్నింటిని గమనిస్తూ వెళ్ళుతున్నావా
సమాజంలో విద్యాలయాలు వైద్యాలయాలు ప్రభుత్వాలు ఆలయాలు వ్యాపార పరిశ్రమలు కర్మాగారములు వివిధ సంస్థలు ఎన్నో ఎన్నో రకాలుగా వివిధ శాఖలుగా ఉంటాయి వివిధ వస్తువుల విక్రయాలతో ఆహార పదార్థాలతో ఉత్పత్తులతో యంత్రాలతో పనిముట్లతో పరికరాలతో సేవలతో పర్యవేక్షణాలతో మరమ్మత్తులతో అవసరాలతో విలాసాలతో సౌకర్యాలతో అంతస్తులతో గృహాల అద్దెలతో ప్రదేశాల విక్రయాలతో అభ్యంతరాలతో అప్రమత్తంగా సాగుతూ ఉంటాయి
సమాజంలో నీవు ఎప్పుడు ఎలా జీవిస్తున్నా ప్రతి క్షణం విజ్ఞానంతో ఎరుకతో జ్ఞాపకంతో అనుభవాలతో మోసపోకుండా నష్టపోకుండా రక్షణతో జాగ్రత్తగా సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి