అవసరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవసరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జులై 2026, ఆదివారం

ఉద్యోగంతోనే జీవించాలి ఉద్యోగంతోనే శ్రమించాలి ఉద్యోగంతోనే అభివృద్ధి చెందాలి

ఉద్యోగంతోనే జీవించాలి ఉద్యోగంతోనే శ్రమించాలి ఉద్యోగంతోనే అభివృద్ధి చెందాలి 

ఉద్యోగంతోనే కొత్త బంధాన్ని కొత్త జీవితాన్ని కొత్త అనుబంధాన్ని కొత్త తరాన్ని సాగించాలి 

ఉద్యోగం మానవ అవసరం సమస్యల పరిష్కారం సమాజ విజ్ఞాన వ్యాపార ధరలకు జీవన విధానం 

ఉద్యోగం లేనివారు జీవితం లేనివారు శ్రమను అనారోగ్యంతో సాగించే సమస్యలతో పోరాడేవారు 



-- వివరణ ఇంకా ఉన్నది! 

12, ఆగస్టు 2016, శుక్రవారం

స్నేహానికి బంధం అవసరం లేదురా

స్నేహానికి బంధం అవసరం లేదురా
బంధానికి మంత్రం పరిచయం సోదరా
కలిసిపోతే స్నేహమే బంధమయ్యేనురా
జీవితంలో సహాయమే స్నేహం సహోదరా
వినిపిస్తున్నా నా భావాన్ని స్వీకరించు సోదరా! 

14, జులై 2016, గురువారం

సూర్యోదయమే జగతికి జీవం

సూర్యోదయమే జగతికి జీవం
సూర్యకిరణమే ప్రకృతికి తేజం

సూర్యుని వెలుగే విశ్వానికి నవోదయం
సూర్యుని తేజమే లోకానికి మహోదయం  || సూర్యోదయమే ||

ఉదయంతో మేధస్సులో మెలకువ సాగే యత్నం  
సూర్యునితో మన ఆలోచనలు కార్యాలతో నిమగ్నం

ఉదయించే భావాలలో ఉన్న ఉత్తేజం మహా వేదం
ప్రజ్వలించే స్వభావాలలో మన తత్వం వేదాంతం  || సూర్యోదయమే ||

ప్రతి కిరణం జగతికి ఎన్నో విధాల అవసరం
ప్రతి తేజం విశ్వానికి ఎన్నో వైపులా విశిష్టం

సూర్యుడే ప్రతి జీవికి విజ్ఞాన సూచక సోపానం
సూర్యుడే ప్రతి జ్ఞానికి అనుభవ సూత్ర చరితం  || సూర్యోదయమే ||