నిజం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిజం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, అక్టోబర్ 2016, బుధవారం

ఓ కృష్ణా నీవే పరమాత్మవా

ఓ కృష్ణా నీవే పరమాత్మవా
ఓ బ్రంహా నీవే పరంధామవా
ఓ మహేశ్వరా నీవే పరంజ్యోతివా
పర లోకాలకు మీరే పరస్పర బంధువులా  || ఓ కృష్ణా ||

ప్రతి జీవికి ఒక తత్వాన్ని కలిగించే పరమాత్మవు నీవేలే
ప్రతి జీవికి ఒక భావాన్ని కలిగించే పరంధామవు నీవేలే
ప్రతి జీవికి ఒక గుణాన్ని కలిగించే పరంజ్యోతివి నీవేలే

పర తత్వాలతో మా జీవితం సాగుతున్నది ప్రయాసగా
పర భావాలతో మా జీవనం జరుగుతున్నది భారముగా
పర స్వభావాలతో మా కాలం ప్రయాణిస్తున్నది వేదనగా  || ఓ కృష్ణా ||

నిజంగా నీవే ఉంటే సత్యం తెలిసేను మనకు
నీడగా నీవే ఉంటే స్నేహమే తెలిపేను మనకు
ప్రాణంగా నీవే ఉంటే ప్రేమే తెలియును మనకు

ఏ శ్వాసలో ఉన్నావో ఏ ధ్యాసతో ఉన్నావో తెలిసేదెలా
ఏ జీవిలో ఉన్నావో ఏ దేహంతో ఉన్నావో కనిపించేదెలా
ఏ రూపంలో ఉన్నావో ఏ దైవంతో ఉన్నావో గ్రహించేదెలా  || ఓ కృష్ణా || 

31, ఆగస్టు 2016, బుధవారం

కలే కన్నానని మెలకువ తెలిపేనే

కలే కన్నానని మెలకువ తెలిపేనే
నిజమే కాదని ఉదయంతో తోచేనే
ఎన్నెన్నో కలలు కంటూనే నిద్రిస్తున్నానులే
కలలన్నీ కలలుగానే మిగిలి పోతున్నాయిలే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్నదని మరో ఊహ కలగా సాగుతున్నదిలే
కలే జీవితమని ఊహలతోనే కాలం మరుపుతో సాగేనులే

కల నిజం కాదని తెలిసినా ఊహతో ప్రయత్నమే మొదలాయనే
కల సాధ్యం కాదని తెలిసినా ఓర్పుతో సాధన ఆరంభమయ్యేనే

కలను అందుకోవాలని మనస్సులో కోరిక పుట్టేనే
కలను జయించాలని మేధస్సులో ఆలోచన తట్టేనే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్న వేళ మదిలో సంతోషమే కలిగేనే
కలే నిజమౌతున్న వేళ యదలో ఆనందమే ఉప్పొంగేనే

అన్నీ కలలు తీరవు అన్నీ కలలు మనకు గుర్తుగా ఉండవు
అన్నీ కలలు మంచివి కావు అన్నీ కలలు ఒకటిగా ఉండవు

ఆలోచిస్తేనే భావంతో కల ఎటువంటిదో తెలిసేను  
ఊహతో నెమరువేస్తేనే కల ఏమని అర్థమయ్యేను  || కలే కన్నానని ||