కుశలం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కుశలం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మే 2017, గురువారం

బహుజన రూపం బహుజన భావం

బహుజన రూపం బహుజన భావం
బహుజన సైన్యం బహుజన తత్వం
బహుజన గమనం బహుజన వచనం
భళారే భళా బహువీర సంగ్రామ దళం  || బహుజన ||

బహుజన జీవం బహుజన ప్రాణం
బహుజన దేహం బహుజన కార్యం
బహుజన లోకం బహుజన విశ్వం
భళారే భళా బహుధీర రణ రంగం  || బహుజన ||

బహుజన బంధం బహుజన సంఘం
బహుజన నేత్రం బహుజన దర్పణం
బహుజన చిత్రం బహుజన ప్రదేశం
భళారే భళా బహుకర భోగమే భాగ్యం  || బహుజన ||

బహుజన స్నేహం బహుజన స్థైర్యం
బహుజన రాజ్యం బహుజన శిఖరం
బహుజన శాంతం బహుజన కుశలం
భళారే భళా బహుపరా మనదే విజయం  || బహుజన ||