కాలం ఎంతో ఉన్నా మనకు ఎంత సమయం ఉందో ప్రణాళిక వేసుకొని జీవించాలి
కాలం గడిచిపోతూనే ఉంటున్నా మన కార్యాన్ని సమయంతో సాగిస్తూ శ్రమించాలి
కాలం నిశ్శబ్దమై ఉన్నా మనమే మెలకువ చెంది మన కార్యాలతో మనమే సాగిపోవాలి
కాలం గందరగోళంగా ఉన్నా మనమే తప్పించుకుని మన కార్యాలను మనమే గుర్తించాలి
కాలం అయోమయమై ఏ పరిస్థితిలో ఉన్నా మన కార్యాలను మనమే సరిచేసుకోవాలి
కాలం మార్పులతో సాగిపోతున్నా మన కార్యాలను మనమే ఆరోగ్యంగా మార్చుకోవాలి
కాలం ప్రమాదమై వస్తున్నా మన వేగాన్ని అవగాహనతో అదుపు చేసుకుంటూ సురక్షితంగా వెళ్ళిపోవాలి
కాలం ఋతువులతో మారుతున్నా మన శరీర పరిస్థితిని దృఢంగా ఉంచుకొని జాగ్రత్తలతో ఉండిపోవాలి
కాల ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా కలగవచ్చనే ఎరుక మేధస్సులో ఉంటే జీవన విధానాన్ని అనుకూలంగా చేసుకోవాలి
కాల ప్రకృతి యాదృచ్ఛికంతో అమానుషంగా సాగిపోతూనే ఉన్నా మనం విజ్ఞానంతో కార్యాచరణ విధానాన్ని తెలుసుకోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion