ఉద్యోగమే సౌభాగ్యం మహా భాగ్యం శుభోదయం
ఉద్యోగం చేయడం వలన మనలో ఒక దినచర్య ప్రణాళిక సమన్వయంతో సాగుతుంది
ఉద్యోగంతో పాటు శరీరం మేధస్సు ఉత్తేజంతో కార్యక్రమాలతో శ్రమిస్తూ ఆరోగ్యాన్ని విజ్ఞానాన్ని అందుకుంటాయి
ఆహార సమయాలు ప్రయాణాలు ఆలోచనల ప్రభావాలు ఒక ఉద్దేశంతో ఒక నిర్ణయంతో నియమాలతో సాగిపోతాయి
ఉద్యోగం ద్వారా ఆలోచన శక్తి వృద్ధి చెందుతూ విజ్ఞానంతో పాటు నైపుణ్యం నూతన ఆలోచన విధానం భవిష్య విజ్ఞాన ప్రణాళికలు మొదలవుతూ ఉద్యోగ స్థానం ఎదుగుతూ ఐశ్వర్యం అధికమవుతూ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతూ సాగిపోతుంది
ఎటువంటి కార్యాలకైనా సమస్యలకైనా సంబరాలకైనా తగినంతగా ఆలోచించే మేధా శక్తి కుటుంబ సామర్థ్యం బంధువుల సంబంధం పరిష్కారవంతమైన సంభాషణలు అవసరమైన ఖర్చులకు కావలసిన ఆదాయం సరిపడిపోతూ అన్ని కార్యాలు సమన్వయంగా పధ్ధతి ప్రకారంగా సాగిపోతూనే ఉంటాయి
ఉద్యోగం లేకపోతే అవసరమైన కార్యాలకు ఖర్చులు చేయలేక తగిన ఐశ్వర్యం లేక కార్యక్రమాలు అక్కడక్కడే ఉండిపోతాయి మిగిలిపోతాయి సమస్యలుగా మారిపోతాయి కఠినంగా నిలిచిపోతాయి అనారోగ్యాన్ని కలిగిస్తాయి
ఉద్యోగంతో సరైన ఆహారం సామర్థ్యం ఆరోగ్యం విజ్ఞానం నైపుణ్యం ఉపాయం ప్రయోజనం ఉన్నత స్థానం గౌరవం ఆదాయం ఐశ్వర్యం బంధం అనుబంధం నేటి జీవనం భవిష్య జీవితం అన్నీ సక్రమంగా అనుకూలంగా సాగిపోతాయి
ఉద్యోగం ఉండి కూడా ఎదగలేకపోతే కార్యాచరణలో ఏవో లోపాలు ఉండవచ్చు ఖర్చులు అధికంగా ఉండవచ్చు విజ్ఞానం లేకపోవచ్చు సరైన ప్రణాళిక లేకపోవచ్చు కుటంబం భారంగా ఉండవచ్చు బాధ్యతలు ఎక్కువగా ఉండవచ్చు అనారోగ్యం ఉండవచ్చు ప్రమాదాలు ఉండవచ్చు సమస్యలు ఉండవచ్చు ఇలా ఎన్నో కుటంబంలో అధికంగా వస్తూనే ఉంటాయి వీటిని మేధాశక్తితో పరిష్కరిస్తూ సాగిపోవడమే జీవిత లక్ష్యం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి