Thursday, July 9, 2026

జగతిలో జీవించేది ఇద్దరే వారు సృష్టించేది ఇద్దరినే

జగతిలో జీవించేది ఇద్దరే వారు సృష్టించేది ఇద్దరినే  
ఇద్దరిలో ఒకరు స్త్రీ ఐతే మరొకరు పురుషుడు అవుతారు 

ఇద్దరు కలిసి జీవిస్తూ సృష్టించేది ఇద్దరిని మాత్రమే (స్త్రీలు పురుషులు )

సృష్టిలో రెండు రకాలే (స్త్రీ తత్త్వం పురుష స్వభావం) అద్భుతమైనవి రెండుగా ఒకటికి ఒకటి కలిసిపోతాయి 
ఒక వస్తువును సృష్టించాలన్నా రెండు విధములే అవసరమవుతాయి అవి ఒకటి యంత్రం మరొకటి పదార్ధం 

యంత్రం నుండి పదార్ధం ఒక వస్తువుగా ఉత్పత్తి అవుతుంది 
ఒక యంత్రం ఒక విధమైన వస్తువునే సృష్టించగలదు 
యంత్రంలో వివిధ రకాల విధానాలు ఉంటే రెండు కంటే ఎక్కువ రకాలుగా వస్తువులను సృష్టించవచ్చు (ఉత్పత్తి చేయవచ్చు) 

స్త్రీ పురుషులు సజీవ రూపములు యంత్రములు నిర్జీవ రూపములు 

స్త్రీలో స్వభావ తత్వాలు ప్రకృతి పరంగా తనలో నిలయమై ఉంటాయి 
యంత్రంలో కార్య విధానాలే కార్యక్రమంగా నిలయమై ఉంటాయి (ప్రకృతి ప్రభావాలకు స్పందించవు - ఆటంకం లేదా నిర్బంధం కలిగితే పని చేసే విధానంలో మార్పులు కలిగి ఉత్పత్తి చేయడం నిలిచిపోతాయి - యంత్రం పనిచేసే విధానం లేదా ఉత్పత్తి విధానం చెడిపోతుంది)
యంత్రంలో ఉపయోగించే పదార్థాలు ఏవైనా ఎన్నైనా ప్రకృతిలో లభించేవే 

యంత్రంలో స్వతహాగ జీవ ఇంధనములు కలిగివుండవు అలాగే యంత్రం స్వతహాగ పనిచేయదు 
స్త్రీలో స్వతహాగ జీవ ఇంధనములు కలిగివుంటాయి ఆహార పదార్థాలతో ఉత్పత్తి అవుతూ ఉంటాయి  

స్త్రీ రూపం సృష్టించడం పురుషుని రూపం కలయిక చేసుకోవడం బంధంతో జీవించడం 

యంత్రాలతో సృష్టించేవాటికి జీవం ఉండదు మానవులు సృష్టించే వారికి జీవం ఉంటుంది 

ఏ యంత్రం ఆహార పదార్థాలతో సామర్థ్యాన్ని పుంజుకొని పనిచేయదు [యంత్రం ఇంధన పదార్థాలతో ద్రవములతో విద్యుత్తుతో (విద్యుద్యంత్రంతో) పనిచేస్తుంది]
మానవులు ఆహార పదార్థాలతో సామర్థ్యాన్ని పుంజుకొని శ్రమిస్తున్నారు 

యంత్రములు పనిచేసే విధాన నియమాలు వేరు 
మానవులు పనిచేసే జీవించే విధాన నియమాలు వేరు 

మట్టిలో తేమ ఉంటేనే విత్తనం మొలకెత్తుతుంది 

మట్టిని విత్తనాన్ని కలయిక చేసేదే తేమ (నీరు) అదే సృష్టించే (ఉద్భవించే) సామర్థ్యాన్ని కలిగివుంటుంది 
విత్తనం వృక్షమై జీవిస్తున్నంతవరకు మట్టి (నేల, భూమి) తేమ ఎప్పటికి ఉండాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment