Tuesday, July 14, 2026

చదవడాన్ని ఆపగలమా నేర్చుకోవడాన్ని నిలిపేయగలమా విజ్ఞానాన్ని వద్దనగలమా

చదవడాన్ని ఆపగలమా నేర్చుకోవడాన్ని నిలిపేయగలమా విజ్ఞానాన్ని వద్దనగలమా  
జీవిత కాలమంతా చదువుతూనే నేర్చుకుంటూనే క్రొత్త విజ్ఞానంతో సాగిపోతున్నాము 

కనిపించేదే చదవడం మేధస్సుకు తెలియడమే నేర్చుకోవడం కొత్త కార్యాలను చేసుకోవడమే క్రొత్త విజ్ఞానం 
జీవిస్తున్నంత వరకు మేధస్సులో చదవడం నేర్చుకోవడం తరగని తరంగాల విశ్వ విజ్ఞాన కార్యాల పరిభ్రమణం 

తరతరాలుగా సాగిపోతూ జీవించుటలో ఎన్నో మార్పులను గమనించడమే చదవడం నేర్చుకోవడం విజ్ఞానంతో ఎదగటం కుటుంబాన్ని ఆరోగ్యంతో అభివృద్ధిని సాధించడం విజయాన్ని అందుకోవడం 

తెలియనిది తెలుసుకో తెలిసినది నేర్చుకో నేర్చినది చేసుకో చేసినది చెప్పుకో చెప్పినదే విజ్ఞానమై నీతో సాగిపోతుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment