ఆకాశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆకాశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జనవరి 2017, శుక్రవారం

ఎవరైనా ఆకాశ వర్ణాలను ఏనాడైనా గమనించారా

ఎవరైనా ఆకాశ వర్ణాలను ఏనాడైనా గమనించారా
ఎవరైనా మేఘాల వర్ణ భావాలను ఏనాడైనా చూశారా
ఏ దేశ ప్రదేశాన ఏ తీర సాగర ప్రాంతాన ఏమున్నదో
ఏదైనా కనిపించిందా ఏదైనా తెలిసిందా ఏదైనా తోచిందా   || ఎవరైనా ||

ఆకాశంలో రూపాల వర్ణాలను ఏనాడైనా గమనిస్తేనే ఏదో ఒక భావన తెలిసేనుగా
ఆకాశంలో రూపాల భావాలను ఎప్పుడైనా ఆలోచిస్తేనే ఏదో ఒక తత్వం తోచేనుగా

ఏ సమయ వేళలో నైనా ఎవరైనా ఏదైనా గమనిస్తున్నారా ఈ దేశ ప్రదేశాన
ఏ క్షణ కాలములలో నైనా ఎవరైనా ఏదైనా చూస్తున్నారా ఈ తీర ప్రాంతాన   || ఎవరైనా ||

ఆకాశ పొరల అంచులలో దాగిన సువర్ణ తేజస్సులన్నీ సంధ్యా వేళలో ఆవర్ణమై పోయెనే
ఆకాశ వర్ణమంతా చీకటితో ఆవర్ణమై స్వభావాలతో తారా నక్షత్ర కాంతులు వెలిగిపోయెనే

ఆకాశపు పై పొరల పరంపరలలో అంతరిక్షపు సౌర కుటుంబంలో ఆది నక్షత్రమై ఉన్నానే
ఆకాశ మేఘాల వర్ణ తేజస్సుల ఆకార రూపాలలో భావాల తత్వ రూపమై కనిపిస్తూ ఉన్నానే  || ఎవరైనా || 

30, డిసెంబర్ 2016, శుక్రవారం

తూర్పున ఉదయించినా అన్ని దిక్కులలో సూర్య కిరణాల మహా సువర్ణ తేజమే

తూర్పున ఉదయించినా అన్ని దిక్కులలో సూర్య కిరణాల మహా సువర్ణ తేజమే
పడమర అస్తమించినా అన్ని దిక్కులలో ఆకాశమంతా అదృశ్య చీకటి తత్వమే
ఏనాటికైనా సూర్యోదయ సూర్యాస్తమయ భావాలు జగతికి నిత్య నియంతృత్వమే  || తూర్పున ||

ప్రతి ప్రదేశంలో వెలుగును ప్రసరించే సూర్య భావన ఏకాభిప్రాయత్వమే
ప్రతి స్థానంలో కిరణాలను తాకించే సూర్య గుణ తత్వము అద్విత్వయమే

వెలుగు చీకటిని సమ భాగాలుగా దర్శించే ఆకాశ రూప వర్ణం అనిర్వచనీయమే
వెలుగు చీకటిని శ్రమ విశ్రాంతి భావాలుగా ఆదర్శించే ఆకాశం గుణాంకుశత్వమే  || తూర్పున ||

ఏ దిక్కున ఏమున్నదో ఏ స్థానమున ఏమున్నదో ఏ కిరణ తేజము చూపునో
ఏ దేశమున ఏమున్నదో ఏ ప్రదేశమున ఏమి దాగున్నదో ఏ భావం తెలుపునో

వెలుగులో అన్వేషణ విజ్ఞాన పరిశోధన ప్రతి చోట ప్రయోజనాత్మక సహజత్వమే
చీకటిలో ఆలోచన ప్రజ్ఞాన పర్యవేక్షణ ప్రతి సహజత్వం ఉపయోగాత్మక సదృశ్యమే  || తూర్పున || 

26, అక్టోబర్ 2016, బుధవారం

ఎగిరిపో నేస్తమా చేరుకో మిత్రమా నీ దేశంలో కుశలమా

ఎగిరిపో నేస్తమా చేరుకో మిత్రమా నీ దేశంలో కుశలమా
నీ దేశమే ప్రశాంతమా నీవు జీవించే స్థానమే పరవశమా
జన్మించిన ఒడిలోనే ఉండిపో హాయిగా సాగిపో హితమా  || ఎగిరిపో ||

కలతలే లేనట్లు కలవరమే పడనట్లు కష్టాలే పూర్తిగా తొలగేనా
నష్టాలే రానట్లు  తడబడుట లేనట్లు కార్యాలే విజయమై సాగేనా

ఆనందమే నీకు వారధిగా అవధులే లేనట్లు ఆకాశంలో ఎగిరిపో
సంతోషమే నీకు వాహనగా అలసట లేనట్లు ఎక్కడికైనా వెళ్ళిపో  || ఎగిరిపో ||

ఎక్కడ ఉన్నా నీవు నిశ్చలంగా స్థిరపడిపో క్షేమముగా
ఎలా ఉన్నా నీవు రక్షణ దృక్పధంతో ఉండిపో జాగ్రత్తగా

ఎదురయ్యే సమస్యలు ఏవైనా నీకు నీవే పరిష్కారమా
ఎదురయ్యే ప్రకంపనలు ఏవైనా నీకు నీవే పరిశోధనమా  || ఎగిరిపో || 

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

ఆహా! గాలిలో గమ్మత్తైన మైకమో

ఆహా! గాలిలో గమ్మత్తైన మైకమో
ఓహో! మేఘంలో ఆశ్చర్య వర్ణమో
మేఘాల గాలి సవ్వడిలో ఎదో నవ భావమో కలిగే మనలో మహా సంతోషము || ఆహా! ||

వీచే చల్లని గాలి తీరు మేధస్సునే మెప్పిస్తూ హుషారునే కలిగిస్తున్నది
ఆకాశంలో మేఘాల తీరు ఎన్నో వర్ణాల ఆకార రూపాలతో మెరుస్తున్నది

మెల్ల మెల్లగా వీచే మత్తైన గాలి మనస్సుకే హాయిని గలిగిస్తూ సాగుతున్నది
సూర్య కిరణాల తేజస్సుతో ఆకాశ వర్ణమే మారి అద్భుతాన్ని చూపిస్తున్నది  || ఆహా! ||

చల్లని గాలి గంధర్వ లోకాల నుండి సుగంధమై వీస్తున్నదేమో
మేఘాలే మహా పర్వతాల నుండి సువర్ణమై మెరుస్తున్నాయేమో

మేఘాల గాలికి మనలోని జీవమే మహా కొత్త ఉచ్ఛ్వాస నిచ్చ్వాసాలతో సాగేనే
మేఘాల వర్ణాలకు మేధస్సులో మహా ఉత్తేజమే ఉప్పొంగి దేహమే చలించేనే  || ఆహా! ||

15, సెప్టెంబర్ 2016, గురువారం

అదిగదిగో ఆకాశం అదే మన దేశం

అదిగదిగో ఆకాశం అదే మన దేశం
కనిపించే మేఘాలే మన లోకం అదే మన ప్రపంచం || అదిగదిగో ||

ఉదయించే సూర్యునితో మేల్కోవడం
మెరిసే కిరణంతో విజ్ఞానం పొందడం
కదిలే మేఘాలతో ప్రయాణం విశ్వమంతా చుట్టడం
భూగోళమే భౌతికం భూలోకమే భువనం
భూమి భ్రమణమే భూతాంశ నియమం   || అదిగదిగో ||

ఆకాశంతో తిలకించడం మేఘాల భావాలతో వర్ణాలను దర్శించడం
అపురూపమైన ఆకార రూపాలను చూస్తూ మేఘాలతోనే సాగిపోవడం

కాలంతో ప్రయాణం అద్భుతమైన దృశ్య కావ్యం
స్థానికుల జీవన విధానం ఓ మహోత్తర విషయం
విజ్ఞానంతో సాగడం అనుభవానికి మహా దర్పణం
విశ్వాంతర విజ్ఞానం జీవితానికి నవోదయ కిరణం
నూతన సాహసం మరో అనుభావాన్ని చూసుకోవడం  || అదిగదిగో || 

13, సెప్టెంబర్ 2016, మంగళవారం

ప్రేమతో పలికిన మనస్సుతో పిలిచిన వచ్చేస్తానే నేను నీకోసం

ప్రేమతో పలికిన మనస్సుతో పిలిచిన వచ్చేస్తానే నేను నీకోసం
భావంతో తలిచిన మౌనంతో తపించిన చేరేస్తానే నేను నీకోసం  || ప్రేమతో ||

హృదయంలోని గమనమే నీ ప్రేమ తలుపుల పదనిసలు
దేహంలోని మధుర గమకమే నీ తేనే పెదవుల సరిగమలు

ప్రకృతిలో విరిసిన పుష్పాలన్నీ సుమగంధమై నిన్నే చేరేనే
ఆకాశంలో కనిపించే వర్ణాలన్నీ సువర్ణమై నిన్నే ఆవరించేనే  || ప్రేమతో ||

సూర్యోదయం నీకోసమే ఉదయించేలా ప్రతి రోజు అనిపించేనే
శుభోదయం నీకోసమే స్మరించేలా ప్రతి నిమిషం అనుకున్నానే

ఎక్కడ వెళ్ళినా నీ హృదయ భావన నన్నే చేరేనులే
ఎక్కడ చూసినా నీ దేహ బంధం నన్నే తలచేనులే  || ప్రేమతో || 

25, జులై 2016, సోమవారం

సువర్ణములో వర్ణమా సుగంధములో గంధమా

సువర్ణములో వర్ణమా సుగంధములో గంధమా
సువర్ణాలతో కనిపించే వర్ణాల తేజమా
సుగంధాలతో తాకే గంధాల పరిమళమా

ఆకాశ భావమే మేఘాల వర్ణ తేజము
పుష్పాల గమనమే గంధాల పరిమళము  || సువర్ణములో ||

సూర్యోదయం వేళలో సూర్యునితో ఆకాశమే అపురూప వర్ణము
సూర్యాస్తమయం సంధ్యలో సూర్యునితో సముద్రమే సువర్ణము  

అరుణోదయ తేజమే మేధస్సులో మెళకువ భావాల ఉత్తేజ కార్యములు
ఉషోదయ వర్ణమే ఆలోచనలలో విశ్రాంతి స్వభావాల ఆరోగ్య తేజములు

ఆకాశంలో నవ భావన మేఘాల వర్ణ ఛాయా చిత్రమే
పుష్పంలో నవ కుసుమం సుగంధాలతో విరిసిన పరిమళం  || సువర్ణములో ||

గంధాలతో మోహనమే సుమధుర భావాల సువాసనల పులకరింతలు
సుగంధాల మధురమే పుష్పాల పూల గమనపు సౌగంధపు సొగసులు

సువాసనలు వెదజల్లే పూలలో నవ పరిమళాల ఊహా భావాలు
సుగంధాలు వ్యాపించే ప్రదేశమే పారిజాత పుష్పాల కమలాలు

సౌందర్యం గుభాళించే పరిమళం సుకుమారపు వలపుల సువాసనలు
అందాల శృంగారముకై సువాసనల మకరంద తైలపు సుగంధములు   || సువర్ణములో || 

19, జులై 2016, మంగళవారం

సూర్యుడే భగవంతుడై జగమంతా ఉదయించేను

సూర్యుడే భగవంతుడై జగమంతా ఉదయించేను
ఆకాశమే పరమాత్మగా విశ్వమంతా అవతరించేను
ప్రకృతియే మహాత్మగా భువిలోనే పరవశించేను    || సూర్యుడే ||

ఉదయించుటలోనే భగవంతుడు ప్రజ్వలమై అవతరించేను
ఆకాశం ఒదిగిన లక్షణములోనే పరమాత్మ నిలిచిపోయేను
ప్రకృతి ఎదిగే విధానంలోనే మహాత్మ తత్వం వికసించేను

ఉదయిస్తూనే కిరణాల తేజస్సుతో ప్రపంచాన్ని మేలుకొలిపేను
ఆకాశమంతా వెలుగుతూ మేఘ వర్ణంతో ఉత్తేజాన్ని కలిగించేను
ప్రకృతిలో జీవిస్తూనే ఆరోగ్యమైన వాతావరణాన్ని ప్రసాదించేను

సూర్యుని మహోదయమే సృష్టికి జీవులకు మహా తత్వ విచక్షణ విజ్ఞానము
ఆకాశ వర్ణ భావమే జీవుల మేధస్సులకు మహా ధ్యేయ లక్షణ కార్య కర్తవ్యము  
ప్రకృతి సహజత్వమే జీవుల భావ తత్వాలకు జీవన కార్య విజ్ఞాన గమనము    || సూర్యుడే ||

ఉదయం ఏనాటికి మారని దిన చర్యగా భగవంతుని కార్యం సాగేను
ఆకాశం చెదరని పొరగా మేఘాలతో పర తత్వమై నిలయమయ్యేను
ప్రకృతి ఒదిగిపోతూనే తన్మయంతో ఎదుగుతూ విశ్వ తత్వమయ్యేను

ఉదయంతో సాగే జీవుల కార్యాలు విశ్వ విజ్ఞానానికే మహోజ్వల ప్రతిభ
ఆకాశం తెలిపే మేఘ వర్ణాల భావ రూపాలకు ఊహా చిత్రమే నవ జ్ఞాపిక
సృష్టిలో ఉన్న సహజ వనరుల రూపాలే అవసరాలకు నిలయమైన దీపిక

ఉదయించుట జగతికి గ్రహ స్థితికి మహోదయ భ్రమణ గమన చలనము
ఆకాశం మేఘాలకు నిలయమైన మహా గుణమైన తేలికతో కూడిన పొరయే
ప్రకృతి జీవించే జీవులకై ఎదిగే హరితమైన ప్రాణాహార వనరుల కుటీరత్వము || సూర్యుడే ||

18, జులై 2016, సోమవారం

ఆత్మగా వచ్చాను మహాత్మగా ఎదిగాను ఈ లోకానికి

ఆత్మగా వచ్చాను మహాత్మగా ఎదిగాను ఈ లోకానికి
మౌనమై ఉన్నాను తత్వమై ఒదిగాను ఈ విశ్వానికి   || ఆత్మగా  ||

భావంతో ఉదయించా స్వభావంతో సాగించా నా కాలాన్ని
తత్వంతో ప్రకాశించా మాతృత్వంతో ధ్యానించా నా సమయాన్ని

జగమంతా జీవమై శ్వాసతో ఒదిగిపోయా నాలోనే
విశ్వమంతా ఊపిరినై దేహంలో నిలిచిపోయా నాలోనే

ధ్యాసతో యోగమై సంయోగ ధ్యానమై ధరణిలో నిలయమయ్యాను
వేదంతో భావమై తత్వంతో మాతృత్వమై దివిలో పదిలమయ్యాను   || ఆత్మగా  ||

ఆకాశంతో రూపమై విజ్ఞానంతో మేఘ వర్ణమై తేజస్సుగా ప్రకాశించాను
ప్రకృతితో జీవమై భావంతో శ్వాస దేహమై ఉత్తేజముగా జ్వలించాను

దైవత్వంతో జీవిస్తూ అద్వైత్వమై అవతార మూర్తిగా సాగుతున్నాను
దైవంతో శాంతిస్తూ అపార మహా తత్వమై అవధూతగా వెళుతున్నాను  

మేధస్సులో అన్వేషణతో ఆలోచనలో వివేకంతో ప్రయాణిస్తున్నా
కార్యములో పర్యవేక్షణతో విధానంలో సిద్ధాంతంతో గమనిస్తున్నా || ఆత్మగా  || 

6, అక్టోబర్ 2015, మంగళవారం

అద్భుతాల ఆకాశమా! సూర్య మేఘ ఆకార రూప వర్ణాల తేజోదయమా

అద్భుతాల ఆకాశమా! సూర్య మేఘ ఆకార రూప వర్ణాల తేజోదయమా
చీకటి వెన్నెల చంద్రుని నక్షత్రాల కాల గమన మహా భావ శుభోదయమా
విశ్వమంతటా అద్భుతాలను చూపించే ఆకాశం ఎందరికో విశ్వోదయమా
సూర్యోదయ సూర్యాస్తమయ మేఘ వర్ణ రూప భావాలు అతిశయోదయమా
చంద్రుని కాంతి వెన్నెల మేఘ రూప ప్రయాణాలు అపురూప అస్వదయమా
సూర్య తేజస్సుల కాంతి కిరణాలు మేధస్సుకు ప్రజ్వల ఉత్తేజోదయమా
క్షణ కాల అంతరిక్షపు భూభ్రమణ గమన నూతన భావాలు ఉషోదయమా  

31, ఆగస్టు 2015, సోమవారం

ఆకాశమంతా ఇంద్రధనస్సు వర్ణాల మాయా జాలమే ఓ మేఘమా!

ఆకాశమంతా ఇంద్రధనస్సు వర్ణాల మాయా జాలమే ఓ మేఘమా!
నీవు లేని ఆకాశం నీలి వర్ణమైనను సూర్య కిరణము మహా తేజము 
మేఘముల యందు సూర్య బింభముల వర్ణాలు మహా చిత్రము 
కిరణాలతో కూడిన నీ మేఘములు బహు రూప అతిషయోక్తము 
ఓ వైపు సూర్య తేజము మరో వైపు ఇంద్రధనస్సు ఇంకో వైపు మేఘపు జల్లులు 
అద్భుతాలకు అతిశయోక్తి ఐనా ఆకాశానికి మానవ నేత్ర దృష్టి అనిర్వచనియము 
వర్ణాలు ఆకాశానికి తోరణమై విశ్వానికి స్వాగతం పలుకుతున్నాయి 
సువర్ణాలు ఆకాశానికి బంధాలై మేఘాలతో సన్నాయిని మ్రోగిస్తున్నాయి 
జల జల కురిసే వర్షానికి గల గల మ్రోగే మేఘాలకు విశ్వం సైతం ఒకటైనది 
వర్ణాలన్నీ చీకటిగా మారినా మెరిసే మెరుపులు తల తలమని మెరుస్తున్నాయి 
వర్ణ భావాలు ఎలా ఉంటాయో శబ్ధ తత్వాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి 
విశ్వమున ఏదైనా ఎన్నో రకాలుగా వివిధ భావ తత్వాలతో ఇమిడి ఉంటాయి 
వర్ణ భావాలలో కూడా ఉత్తేజమైన మేధస్సు విజ్ఞానం విరివిగా నిక్షిప్తమై ఉంటుంది 
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!