Tuesday, July 7, 2026

సూర్యుడు ఎలా జీవిస్తే విశ్వం అలాగే జీవిస్తుంది సాగిపోతుంది

సూర్యుడు ఎలా జీవిస్తే విశ్వం అలాగే జీవిస్తుంది సాగిపోతుంది 
సూర్యుని ప్రభావంతోనే విశ్వ కార్యాలు సాగిపోతాయి గడిచిపోతాయి  

సూర్యుని ప్రభావంతోనే ప్రకృతి పంచభూతాలతో ఉద్భవిస్తూ అభివృద్ధి చెందుతూ సాగిపోతుంది 

సూర్యుని ఉదయం అస్తమయం ద్వారానే జీవుల మెళకువలు నిద్రలు శ్రమ సమయ వేళలు సాగిపోతాయి 
ప్రతి రోజు ఉదయించే సూర్యుని ప్రభావంతోనే జీవుల కార్యక్రమాలు ఆరంభమవుతూ సూర్యాస్తమయంతో ఆగిపోతాయి 

అంతరిక్షంలో కలిగే మార్పులు కూడా ఎన్నో ఉన్నాయి సూర్య ప్రభావంతో సాగుతున్నాయి 

నేడు మానవులు అన్ని వేళలా శ్రమిస్తున్నారు అన్ని వేళలా ఎన్నో రకాలుగా జీవన శ్రమ విధానాన్ని మార్చుకుంటున్నారు సమస్యలు అవసరాలు సౌకర్యాలు వసతులు ఆహారం కోసం జీవిస్తున్నా ఐశ్వర్యం ప్రధానమై శ్రమించే వేళలు మారిపోతున్నాయి 
ఆహారాన్ని సేవించుటకు ఎలా మూడు పూటలు ఉన్నాయో శ్రమించడానికి కూడా ప్రతి రోజు మూడు పూటలు ఉన్నాయి (నేడు ప్రతి గంటకు ఒక పూటగ శ్రమించే వేళలు ఎన్నో సంస్థలలో ఎన్నో దేశాలలో ఉన్నాయి)

నిద్రించే వేళలను కూడా శ్రమించే వేళలుగా మార్చుకున్నారు 
ఉద్యోగాల సమయాలు ఏ విధంగా లభ్యతగా ఉంటాయో అదే విధంగా శ్రమించే వేళలు ప్రారంభమవుతాయి 
మానవుని అవసరాలు కూడా శ్రమించే వేళలను మార్చేశాయి వివిధ రకాలఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి 

రెండు రకాలుగా రెండు పూటలు శ్రమించేవారు కూడా నేడు ఎన్నో సమస్యలతో ఐశ్వర్యం కోసం జీవిస్తున్నారు 

విశ్వ కాలానికి సూర్య సమయానికి విరుద్ధంగా శ్రమిస్తూ అనారోగ్యంతో జీవిస్తూ సాగిపోతున్నాము 
సమస్యలే కారణం సమాజమే నిదర్శనం శ్రమించడమే అవసరం విజ్ఞానమే ప్రధానం ఆరోగ్యమే మూలాధారం 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment