సొగసు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సొగసు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఆగస్టు 2017, సోమవారం

శిల్పమా నవ రూపమా తేజమే నీ మౌనమా

శిల్పమా నవ రూపమా తేజమే నీ మౌనమా
శిల్పమా నవ భావమా వర్ణమే నీ స్వప్నమా

కలలకే రూపమా కన్నులకే మహా అందమా
కవితలకే భావమా కవులకే మహా ఆనందమా   || శిల్పమా ||

వయస్సుకే వయ్యారామా మనస్సుకే శృంగారమా
ఉషస్సుకే ఉత్కంఠమా మేధస్సుకే మాధుర్యమా

సొగసుకే సోయగమా నాదానికే నయగారమా
ఉన్నతికే ఔదార్యమా సరసానికే సౌందర్యమా  || శిల్పమా ||

మాటలకే మందారమా మౌనానికే మనోహరమా
సువర్ణాలకే సౌఖ్యమా సుగంధాలకే సుందరమా

బంధాలకే సౌభాగ్యమా రాగాలకే రమణీయమా
భావాలకే అతిశయమా అందాలకే ఆనందమా  || శిల్పమా ||