Wednesday, July 8, 2026

పురుషోత్తమా! శ్రీమతియే నీకు బహుమతిగా వస్తూ సరిక్రొత్త బంధమై కలిసిపోతుంది

పురుషోత్తమా! శ్రీమతియే నీకు బహుమతిగా వస్తూ సరిక్రొత్త బంధమై కలిసిపోతుంది  
శ్రీమతి! పురుషోత్తముని స్థానమే నీకు నూతన జీవన విధానమై జీవితమే సాగిపోతుంది 

భార్యగా చేరుకొనుటలో భర్తగా స్వీకరించుటలో బంధమే అనుబంధమై జీవన విధానమే జీవితమై కుటుంబంగా సాగిపోతుంది 

భార్య భర్తల బంధం మనస్సులను ఏకం చేస్తూ వయస్సులను సామర్థ్యం చేస్తూ జీవన విధానాన్ని శ్రమగా సాగిస్తూ విజ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేస్తూ సుఖదుఃఖాలను ఒడిదుడుకుల ప్రయాణంగా కొనసాగిస్తూ జీవితాన్ని అనుబంధంగా మార్చేస్తుంది  

మేధస్సులో ఆలోచనలు వేరైనా మనస్సుల స్వభావాలు వేరైనా కార్య విధానములు వేరైనా కలిసిపోయే సమయ బంధములే అద్భుతమైన తత్వములుగా అనుబంధమై కలిసిపోతూ ఆలోచనలను అర్థంగా పరమార్థంగా వివిధ సమయాలలో మనస్సును ఒకటిగా మార్చుకుంటారు 

బహుమతి - చాలా విధాలుగా కలిగిన మతి (జ్ఞానం) - అనేక విధాలుగా ఆలోచిస్తూ అనేక స్వభావాలను కలిగిన తత్త్వం 

శ్రీమతి బహుమతితో గృహాన్ని బంధాన్ని వివిధ రకాల స్వభావాలతో సరిచేస్తూ పరిశుద్ధం చేస్తూ విజ్ఞానంతో వివిధ పరిస్థితులతో ఎన్నో విధాలుగా మార్చేస్తూ ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment