ఖర్చు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఖర్చు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2017, సోమవారం

విడిచిపో నీ రూపాన్ని మరచిపో నీ విజ్ఞానాన్ని మరణంతో

విడిచిపో నీ రూపాన్ని మరచిపో నీ విజ్ఞానాన్ని మరణంతో
నడిచిపో నీ గమ్యాన్ని తలచిపో నీ గౌరవాన్ని సజీవంతో    || విడిచిపో ||

జీవించే కాలం తెలుసుకునే సమయం మన జీవితానికే
నడిపించే కార్యం సాగించే సహనం మన జీవన వృద్ధికే

ఎంత కాలం జీవిస్తున్నా మన ఆకార రూపం తరుగునని
ఎంత జ్ఞానం పొందుతున్నా మన అనుభవం చాలదని   || విడిచిపో ||

ఉన్నప్పుడే కాస్త తీరిక చేసుకో ఉన్నంతలో ఊపిరి పీల్చుకో
ఉన్నట్లుగా జీవం సాగించుకో ఉంటూనే ఊహను చూసుకో

ఉదయించేది ఏదైనా అస్తమించేనని జన్మించిన నీకు మరణం తప్పదని
నీకోసం ఉన్నది ఏదైనా సొంతం కాదని సంపాదన ఖర్చులకే పరిమితమని   || విడిచిపో || 

6, అక్టోబర్ 2016, గురువారం

అనారోగ్యం కలగక ముందే ఆరోగ్యంతో జాగ్రత్త వహించు

అనారోగ్యం కలగక ముందే ఆరోగ్యంతో జాగ్రత్త వహించు
కాలం వృధా కాకముందే సమయాన్ని సద్వినియోగించు
ధనం అత్యధిక ఖర్చులతో సాగక ముందే సంపాదించు
విశ్వమందు నీవు ఎచట ఎలా ఉన్నా నేను నీ మేధస్సులోనే మిత్రమా! 

29, జూన్ 2016, బుధవారం

ఆశను అదుపు చేస్తే ఆయుస్సు పెరుగుతుంది

ఆశను అదుపు చేస్తే ఆయుస్సు పెరుగుతుంది
కోరికను మితి మీర్చుకుంటే ఖర్చు పెరుగుతుంది
వయస్సును ఒదిగిస్తే సౌందర్యం పెరుగుతుంది
మనస్సును మందలిస్తే విజ్ఞానం పెరుగుతుంది