హరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2016, బుధవారం

హరే హరే కృష్ణా! హరే హరే రామా! హరే హరే

హరే హరే కృష్ణా! హరే హరే రామా! హరే హరే
హరి హరివో శివా హరి హరివో దేవా హరే హరే  || హరే హరే ||

ఏదైనా మహత్యం జరుగునని నీకు తెలిసేనా శివా
మానవుడే మాహాత్ముడై జీవించునని నీకు తెలిసేనా శివా
మాధవుడే పరమాత్ముడై ఉన్నాడని నీకు తెలిసిందా శివా

శ్వాసయే జీవమై మనయందే జీవించునని నీకు తెలిసేనా శివా
జీవుడే దేవుడై మనలోనే జీవిస్తున్నాడని నీకైనా తెలిసిందా శివా
దేహమే దైవమై మనతోనే నిత్యం ఉండునని నీవైనా తెలిపావా శివా  || హరే హరే ||

జీవమే మహా జీవిగా జీవమై మహోదయమయ్యేనా శివా
ఆత్మయే మహాత్మగా మహోజ్వలమై ఉదయించేనా శివా
భావమే మహా భావంతో తత్వమై విశ్వంలో జ్వలించేనా శివా

దేహంలో మహా దైవమే జీవించుటలో పరమార్థం తెలిసేనా శివా
నాదంలో మహా వేదమే  జ్వలించుటలో పరిపూర్ణం తెలిపేవా శివా      
రూపంలో మహా అవతారమే ధరించుటలో ప్రజ్ఞానం తెలిసిందా శివా  || హరే హరే ||

25, ఆగస్టు 2016, గురువారం

హరి హర పరమేశ్వర హరి హర పర బ్రంహా

హరి హర పరమేశ్వర హరి హర పర బ్రంహా
హరి హర దేవ బ్రంహ విష్ణు మహదేశ్వరహా    || హరి హర ||

హరి హర విజ్ఞేశ్వరహా హరి హర జ్ఞానేశ్వరహా
హరి హర జీవేశ్వరహా హరి హర లోకేశ్వరహా

సర్వం సర్వాంతర్యామి విశ్వం విశ్వాంతర్యామి
అనంతం అంతర్యామి భావం అంతర్భావయామి

సంపూర్ణ విష్ణు పరిపూర్ణ బ్రంహా ప్రజ్ఞాన పూర్ణ మహేశ్వరహా
పరిశుద్ధ పరిశోధన పవిత్రాయహే బ్రంహా విష్ణు మహేశ్వరహా || హరి హర ||

హరి హర పర లోక కైలాస పరమేశ్వరహా
హరి హర ఇహ లోక వైకుంఠ విష్ణు దేవా
హరి హర మహా లోక జ్ఞాన బ్రంహేశ్వరః

దైవం దైవాంతర్యామి సత్యం సత్యాంతర్యామి
ధర్మం ధర్మాంతర్యామి నిత్యం నిత్యాంతర్యామి

మహా విష్ణుం మహా బ్రంహం మహా ఈశ్వరం
మహా గుణం మహా భావం మహా తేజం హరి హరః || హరి హర ||