మానవా! (జీవమా!) నీవు జీవించుటకు పంచభూతములు నిత్యం శ్రమిస్తూనే జీవిస్తున్నాయి
నీవు జీవించుటకు పంచభూతములు ప్రకృతిగా ఉద్భవిస్తూ ఎన్నో ఆకార రూపాలతో అవతరిస్తూనే జీవిస్తున్నాయి
నీవు జీవించుటకు పంచభూతములు ప్రకృతిగా విశ్వముగా జగతిగా ఆకాశముగా అంతరిక్షముగా బ్రంహాండముగా అనంత రూపములతో పర్వత శిఖరములతో సాగరములతో అరణ్యములతో ఖనిజాల లోహములతో సారవంతమైన భూములతో నదులతో వాగులతో లోయలతో విశాలమైన ప్రదేశాలతో గుహలతో గిరులతో గనులతో అవతరించి ఉన్నది
నీకు కావలసిన దానిని నీకు అవసరమైన విధంగా మేధస్సుకు పరిశోధనగా ఉపయోగించుకొనుటకు ఎన్నో ఎన్నో విధాలుగా అవతరించి ఉన్నాయి
నీ విజ్ఞానంతో తరతరాలుగా కాల ఋతువులతో మారుతున్నా నీకు అవసరమయ్యే విధంగా పంచభూతాల ప్రకృతి వివిధ ఆకార రూపాల పదార్థాలుగా ఖనిజాలతో అత్యంత పరిమాణాలతో అద్భుతమైన వర్ణాలతో జీవించుటకు విశ్వమంతా పర్యావరణమై ప్రాణ వాయువులతో ఆకర్షణీయమై ఆశ్చర్యములతో సుందరంగా అవతరించి ఉన్నది
ఎవరైనా ఏ విధమైన ప్రకృతి వనరులను పదార్థాలను ఆకృతి రూపాలను ఖనిజ సంపదనను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు
అజ్ఞానంతో ఎదిగే మానవుడు విజ్ఞానంతో జీవించుటకు ప్రకృతిని వివిధ రకాలుగా వివిధ రకాల పదార్థాలను పరిశోధన చేస్తూ ఉపయోగించుకుంటాడు ఉపయోగించుకొనుటలో ఎంతో వృధా అవుతుంది ఎంతో వ్యర్థమవుతుంది ఎంతో కాలుష్యమవుతుంది
మానవుడు కొన్ని తరాలుగా జీవితాన్ని సాగించుటలో ప్రకృతిని ఉపయోగించుకొనుటలో మహా అద్భుతమైన విశ్వ విజ్ఞానంతో వైజ్ఞానిక అనుభవంతో వృధాను వ్యర్థాన్ని కాలుష్యాన్ని తగ్గించుకుంటూ పరిశుద్ధతను పరిమళాన్ని పర్యావరణాన్ని పత్రహరితాన్ని ఆవిష్కరించుకోవాలి
ప్రకృతిని ఉపయోగించుకుంటూ పదార్థాల జాతిని ఖనిజాల సంపద ఏ సృష్టి స్వరూపమైన అంతరించకుండా ప్రత్యుత్పత్తి పునరుత్పాదన పునఃసృష్టి జరుగుతూ బ్రంహాండం అంతరించే దాకా సాగాలి
ప్రతి అణువు బ్రంహాండంలో ఒక భాగమే ఒక లక్ష్యమే ఒక జీవితమే ఒక జీవన విధానమే ఒక స్వభావ తత్త్వమే ఒక పరిశోధనమే ఒక సాధనమే ఒక ప్రాముఖ్యతమే ఒక జీవమే ఒక దైవమే ఒక శక్తి స్వరూప సామర్థ్యమే ఒక స్థానమే
నేడు ప్రకృతి ఎన్నో ఆకార రూపాల నిర్మాణములతో అంతస్తులతో భవనాలతో పరిశ్రమలతో కర్మాగారములతో సంస్థలుగా వ్యాపార విధానాలతో అనేక రకాలుగా విలాసవంతంగా వివిధ సౌకర్యాలతో నిర్మితమవుతూ సాగుతున్నది
ప్రతి కార్యాన్ని పరిశుద్ధంతో పరిపూర్ణమైన విజ్ఞానంతో సాగించేందుకు మేధస్సును కార్యాచరణ కార్యక్రమ ప్రణాళిక సిద్ధాంతంగా శాస్త్రీయ శ్రమతో ప్రావీణ్యంతో నైపుణ్యంతో ఆరోగ్యంగా సాగించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి