14, జులై 2026, మంగళవారం

చూస్తున్నాను ప్రభూ నేను నిన్నే చూస్తున్నాను ప్రభూ

చూస్తున్నాను ప్రభూ నేను నిన్నే చూస్తున్నాను ప్రభూ
వింటున్నాను ప్రభూ నేను నీలో వింటున్నాను ప్రభూ 

ఎంత కాలం చూస్తూనే ఉన్నా నీ రూపం నిశ్చలమై దర్శనమిస్తున్నది దేవా 
ఎంతో సమయం వింటూనే ఉన్నా నీ వేదం స్వరాగమై వినిపిస్తున్నది దేవా 

నేర్చుకున్నాను ప్రభూ నేను నీలా నేర్చుకున్నాను ప్రభూ 
తెలుసుకున్నాను ప్రభూ నేను నీతో తెలుసుకున్నాను ప్రభూ 

ఎంత కాలం నేర్చుకున్నా నీ జ్ఞానం అధికమవుతూనే ఊడలా ఎదుగుతున్నది దేవా 
ఎంతో సమయం తెలుసుకున్నా నీ ధ్యానం అసాధారణమై వేరులా సాగుతున్నది దేవా 

చేస్తున్నాను ప్రభూ నేను నీకై చేస్తున్నాను ప్రభూ 
ఉంటున్నాను ప్రభూ నేను నీవై ఉంటున్నాను ప్రభూ 

ఎంత కాలం చేస్తున్నా నీ కార్యం కార్యాచరణమై కార్యధారణమవుతున్నది దేవా 
ఎంతో సమయం ఉంటున్నా నీ కాలం కార్యక్రమమై కర్తవ్యమవుతున్నది దేవా 

అనుకున్నాను ప్రభూ నేను నీదే అనుకున్నాను ప్రభూ 
అడుగుతున్నాను ప్రభూ నేను నీదై అడుగుతున్నాను ప్రభూ 

ఎంత కాలం అనుకున్నా నీ తేజం ప్రకాశమై విస్మయమవుతున్నది దేవా 
ఎంతో సమయం అడుగుతున్నా నీ శాంతం సాధనమై విజయమవుతున్నది దేవా 

వస్తున్నాను ప్రభూ నేను నీకే వస్తున్నాను ప్రభూ 
చెప్పేస్తున్నాను ప్రభూ నేను నీవే చెప్పేస్తున్నాను ప్రభూ 

ఎంత కాలం వస్తున్నా నీ బంధం అనుబంధమై అనురాగమవుతున్నది దేవా 
ఎంతో సమయం చెప్పేస్తున్నా నీ సత్యం ధర్మమై మార్గదర్శకమవుతున్నది దేవా  

ఆరాధిస్తున్నాను ప్రభూ నేను మీలా ఆరాధిస్తున్నాను ప్రభూ
ఆలోచిస్తున్నాను ప్రభూ నేను మీలో ఆలోచిస్తున్నాను ప్రభూ 

ఎంత కాలం ఆరాధిస్తున్నా మీ ఆరాధన అన్వేషణగా అఖిలమవుతున్నది దేవా 
ఎంతో సమయం ఆలోచిస్తున్నా మీ యోచన ఆదేశమై నిర్ణయమవుతున్నది దేవా 

శ్రమిస్తున్నాను ప్రభూ నేను మీతో శ్రమిస్తున్నాను ప్రభూ 
పరిశోధిస్తున్నాను ప్రభూ నేను మీకై పరిశోధిస్తున్నాను ప్రభూ 

ఎంత కాలం శ్రమిస్తున్నా మీ స్మరణంలో అనంతమైన సామర్థ్యమున్నది దేవా 
ఎంతో సమయం పరిశోధిస్తున్నా మీ ధారణలో అద్భుతమైన విశేషమున్నది దేవా 

ప్రబోధిస్తున్నాను ప్రభూ నేను మీదై ప్రబోధిస్తున్నాను ప్రభూ 
ప్రయాణిస్తున్నాను ప్రభూ నేను మీచే ప్రయాణిస్తున్నాను ప్రభూ 

ఎంత కాలం ప్రభోధిస్తున్నా మీ ఉపదేశంలో ఉపదైవం ఉద్భవిస్తున్నది దేవా 
ఎంతో సమయం ప్రయాణిస్తున్నా మీ ఉద్దేశంలో ఉపకారం ఉదారమవుతున్నది దేవా 

ఇస్తున్నాను ప్రభూ నేను మీకు ఇస్తున్నాను ప్రభూ 
నడిపిస్తున్నాను ప్రభూ నేను మీవై నడిపిస్తున్నాను ప్రభూ 

ఎంత కాలం ఇస్తున్నా మీ దేహంలో ఏ తత్త్వం తపనమవుతున్నది దేవా 
ఎంత సమయం నడిపిస్తున్నా మీ స్థానంలో ఏ స్వభావం సమ్మతమవుతున్నది దేవా 

జీవిస్తున్నాను ప్రభూ నేను మీకే జీవిస్తున్నాను ప్రభూ 
సాగిస్తున్నాను ప్రభూ నేను మీదే సాగిస్తున్నాను ప్రభూ 

ఎంత కాలం జీవిస్తున్నా మీ శ్వాసలో ప్రయాస సాఫల్యమైపోతున్నది దేవా 
ఎంత సమయం సాగిస్తున్నా మీ ధ్యాసలో జీవం సుధీర్ఘమైపోతున్నది దేవా 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి