మహత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మహత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2016, బుధవారం

హరే హరే కృష్ణా! హరే హరే రామా! హరే హరే

హరే హరే కృష్ణా! హరే హరే రామా! హరే హరే
హరి హరివో శివా హరి హరివో దేవా హరే హరే  || హరే హరే ||

ఏదైనా మహత్యం జరుగునని నీకు తెలిసేనా శివా
మానవుడే మాహాత్ముడై జీవించునని నీకు తెలిసేనా శివా
మాధవుడే పరమాత్ముడై ఉన్నాడని నీకు తెలిసిందా శివా

శ్వాసయే జీవమై మనయందే జీవించునని నీకు తెలిసేనా శివా
జీవుడే దేవుడై మనలోనే జీవిస్తున్నాడని నీకైనా తెలిసిందా శివా
దేహమే దైవమై మనతోనే నిత్యం ఉండునని నీవైనా తెలిపావా శివా  || హరే హరే ||

జీవమే మహా జీవిగా జీవమై మహోదయమయ్యేనా శివా
ఆత్మయే మహాత్మగా మహోజ్వలమై ఉదయించేనా శివా
భావమే మహా భావంతో తత్వమై విశ్వంలో జ్వలించేనా శివా

దేహంలో మహా దైవమే జీవించుటలో పరమార్థం తెలిసేనా శివా
నాదంలో మహా వేదమే  జ్వలించుటలో పరిపూర్ణం తెలిపేవా శివా      
రూపంలో మహా అవతారమే ధరించుటలో ప్రజ్ఞానం తెలిసిందా శివా  || హరే హరే ||

16, ఆగస్టు 2016, మంగళవారం

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియని నీ రూపం నాలో చిత్రమై ఉన్నది

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియని నీ రూపం నాలో చిత్రమై ఉన్నది
ఎప్పుడు వస్తావో ఎలా వస్తావో తెలుపని నీ సమయం నాలో అన్వేషణ ఐనది  || ఎక్కడ ||

ఎవరికి కనిపిస్తావో ఎవరికి వినిపిస్తావో నీలో నీవే ఉండిపోతావో తెలియుట లేదు
ఎవరిలో ఉన్నావో ఎందరిలో ఉన్నావో నీవే నిర్ణయించుకుంటావో తోచటం లేదు

మహా విజ్ఞానులు ఎందరున్నా నీవు ఉండే స్థానం మహా నిలయం
మహాత్ములు ఎక్కడ ఉన్నా నీవు తెలిపే వేదార్థం మహా విజ్ఞానం   || ఎక్కడ ||

కనిపించే నీ రూపం సూర్యోదయమై విశ్వానికి వెలుగునిస్తున్నది
వినిపించే నీ ప్రతి ధ్వని జీవోదయమై దేహానికి మహా ప్రాణమైనది

ఎవరిని తలిచినా నీ నామ ధ్యాన స్వరూపంలోనే మహత్యం దాగున్నది
ఎందరినో దర్శించినా నీ రూప దర్శనం కలగాలని నేత్రం తపిస్తున్నది || ఎక్కడ || 

15, ఆగస్టు 2016, సోమవారం

ఒక వైపే ఉన్నావా మహాత్మ

ఒక వైపే ఉన్నావా మహాత్మ
ఒక చోటనే ఉంటావా పరమాత్మ
ఒకరితోనే ఉండి పోతావా మహా ఆత్మ  || ఒక వైపే ||

ఎక్కడ వెతికినా కనిపించని నీడవై ఉన్నావా నీలోనే నీవుగా
ఏమని అన్వేషించినా జాడ తెలియని దూరమై పోయావా నీవు
ఎంత కాలం ప్రయాణించినా దర్శనమే లేని ప్రతి రూపమే నీవు

నీలో నీవే జీవించే స్వభావం ఎదిగే ప్రకృతిలోనే ఉన్నదా
నీలోన నీవే దాగే జీవం ప్రతి జీవి శ్వాసలోనే ఉంటుందా
నీలో నీవై నిలిచే తత్త్వం ప్రతి జీవి రూపంలో ఉండేనా     || ఒక వైపే ||

ఎక్కడ ఉన్నా కనిపించని నీ రూపం ఆత్మగా ఉదయిస్తున్నదా
ఎక్కడ నిలిచినా కనిపించే భావంతో మహాత్మవై జీవిస్తున్నావా
ఎక్కడ ఎవరు ఉన్నా వారి దేహంలోనే పరమాత్మవై దాగివున్నావా

ఒక వైపు చూసే లోకం మరోవైపు చూడలేని పరమార్థం నేనే
ఒకే చోట అన్వేషించే విశ్వం అందరిలాగే తెలియని మహత్యం
ఒకరినే ప్రశ్నించే ప్రపంచం మరొకరితో జీవించలేని నిత్య సత్యం || ఒక వైపే ||