Wednesday, July 8, 2026

విశ్వమా! నీకు తెలుసు విశ్వ కార్యములు ఏవో

విశ్వమా! నీకు తెలుసు విశ్వ కార్యములు ఏవో అవి ప్రకృతితో కూడా సాగిపోతున్నాయి  

బ్రంహాండమంతా సాగే విశ్వ కార్యములు ఎన్ని విధములో ఎలాంటివో బ్రంహకైనా తెలియని మర్మ రహస్యములు 

జగమంతా సాగే సర్వ కార్యములు విశ్వ కాలమై కార్యక్రమములుగా ప్రకృతి ప్రమేయంతో సహజంగా సాగిపోతున్నాయి 

ప్రకృతి కార్యములు కాల ఋతువుల ప్రభావాలతో విభిన్నమై వివిధ రకాలుగా ఎన్నో మార్పులతో సాగిపోతున్నాయి 

సూర్యుని ప్రభావమే బ్రంహాండమంతా శక్తి సామర్థ్యాల స్వరూపమై విశ్వం ప్రకృతిగా ఉద్భవిస్తూనే సాగిపోతున్నది 

సూక్ష్మ అణువుల స్వభావ తత్వముల నుండి బ్రంహాండ రూపములతో సహా ఎన్నో పరమాత్ముని పరమార్థములు అనంతమై జగమంతా (ప్రదేశమంతా) దాగివున్నాయి కాలంతోనే వాటి స్వభావ తత్త్వములు ప్రకృతిలోనే చిగురిస్తూ ఉద్భవిస్తున్నాయి 

విశ్వ కార్యములు తెలియుటకు మనిషిగా మేధావిగా మహర్షిగా మహాత్మగా బ్రంహర్షిగా యోగిగా గురువుగా విధాతగా విజ్ఞానిగా వైజ్ఞానికంతో పరిశోధిస్తూ జీవించాలి 

జరిగిపోయిన కాలమంతా ఎక్కడ ఎలాగ ఎన్ని కార్యములతో నిక్షిప్తమై ఉన్నది (విశ్వ మేధస్సులో ఉన్నదా కాల మేధస్సులో ఉన్నదా బ్రంహాండ మేధస్సులో ఉన్నదా పరమాత్మ మేధస్సులో ఉన్నదా శూన్య మేధస్సులో చేరుతున్నదా)

-- వివరణ ఇంకా ఉన్నది!


No comments:

Post a Comment