సరళ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సరళ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మార్చి 2017, బుధవారం

జన్మిస్తూ ఉదయిస్తూనే జీవితంలో మరణిస్తూ అస్తమిస్తున్నావా జీవేశ్వరా

జన్మిస్తూ ఉదయిస్తూనే జీవితంలో మరణిస్తూ అస్తమిస్తున్నావా జీవేశ్వరా
శ్వాసతో ధ్యానిస్తూనే దేహాన్ని ఆకార రూపంగా మారుస్తున్నావా దేహేశ్వరా   || జన్మిస్తూ ||

మేధస్సునే ఆలోచింపజేస్తూ భావాలతో విజ్ఞానాన్ని పరిశీలిస్తున్నావా
కాలంతో కలిగే సమస్యలను పరిష్కారిస్తూ జీవితాన్ని పర్యవేక్షిస్తున్నావా

అనంత జీవుల జీవన సాగర లోకంలో ఎన్నో విశ్వ భావ స్వభావ తత్వాలనే అన్వేషిస్తున్నావా
అనంత కాల సమయంతో సృష్టిలో ఎన్నో జీవ వేద విజ్ఞాన భావ బంధాలనే పరిశోధిస్తున్నావా   || జన్మిస్తూ ||

మహనీయమైన శాస్త్రీయ ప్రకృతి విధానాలను భవిష్య వాణికై లిఖిస్తున్నావా
మహోదయమైన విశ్వ తేజత్వాన్ని సూర్య కాంతితో జగతిని వెలిగిస్తున్నావా

సర్వ సాధారణమైన అపురూప విషయాలను మేధస్సుకే మర్మమై తెలుపుతున్నావా
సరళమైన వేదాంత సిద్ధాంతాలను ఆలోచనలకే అసాధారణ దీక్షగా చూపుతున్నావా   || జన్మిస్తూ ||