ఆహ్లాదకరము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆహ్లాదకరము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, డిసెంబర్ 2016, గురువారం

ఏనాటిదో ఈ సేవ ఎప్పటి వరకో ఈ సంభరం

ఏనాటిదో ఈ సేవ ఎప్పటి వరకో ఈ సంభరం
ఏనాటిదో ఈ ప్రార్థన ఎవరి కొరకో ఈ ఉత్సవం

ఎటువంటి మహా సేవకైనా ఏనాటి భక్తికైనా కరుణించే భాగ్యము లేదా
ఎటువంటి సంభరమైనా ఏనాటి ఉత్సవమైనా దయ కలుగుట లేదా  || ఏనాటిదో ||

ఎన్నో కీర్తనలను ఆలపించినా ఎన్నో దైవ ప్రార్థనలు చేసినా ఏమున్నది మహత్యము
ఎన్నో శ్లోకాలను కీర్తించినా ఎన్నో వేద పద్యాలను ప్రార్థించినా ఏమున్నది గొప్పతనము

మహా గ్రంథాలను పఠనం చేసినా వేద ఉపనిషత్తుల పురాణాలను ఆరాధించినా ఎక్కడ సౌఖ్యము
మహా ప్రవచనాలను ఉపదేశించినా మహా వేద గుణ జ్ఞాన తత్వాలను పాటించినా ఎక్కడ సౌకర్యము

జీవితమంతా సేవకుడిగా ఉన్నా మనస్సంతా దైవత్వమున్నా ఏదీ అద్భుతము
జీవనమంతా భక్తుడిగా ఉన్నా హృదయమంతా అద్వైత్వమున్నా ఏదీ ఆశ్చర్యము  || ఏనాటిదో ||

యజ్ఞ యాగాలు చేసినా పూజలు పునస్కారాలు చేసినా మనస్సులో అంతిమ చింతనయే
దేహ స్తుతి దైవ స్తోత్రము  అర్చన అభిషేకాలు చేసినా మేధస్సులో మహా దైవ చింతనయే

ఫల పుష్పాలంకరణాలు ఎన్ని చేసినా భక్తి శ్రద్ధలు ఎన్ని వహించినా ఎప్పటికో ఆహ్లాదకరము
పవిత్రత పరిశుద్ధత పరిపూర్ణత నిష్ఠత సత్య ధర్మాలతో పూజించినా ఏనాటికో మోక్ష కటాక్షము

ధ్యానించుటలోనైనా కలుగునేమో మహా సంతోషము మహా ఆనందము మహా గొప్ప ఉత్సాహము
పరధ్యాసలోనైనా దివ్య జ్యోతి కృపా కటాక్షము కడకంటి చూపుగా కలుగునా ఈ జన్మకు సార్థకము  || ఏనాటిదో ||