Monday, July 13, 2026

భాషనే మహా అర్థంగా గ్రహించి పర విజ్ఞానంగా మార్చుకుని పరమార్థం చేసుకుంటున్నావా

భాషనే మహా అర్థంగా గ్రహించి పర విజ్ఞానంగా మార్చుకుని పరమార్థం చేసుకుంటున్నావా 

అక్షరాలనే ఎన్నో అర్థాల పదాలుగా చేసుకొని పదాలనే ఎన్నో పరమార్థాల వాక్యాలుగా వ్రాసుకొని 
వాక్యాలనే ఎన్నో కావ్యాలుగా మార్చుకొని కావ్యాలనే ఎన్నో పాఠాలుగా తెలుపుకొని విజ్ఞానంతో సాగుతున్నావా  

భాషతో బహు విధమైన విజ్ఞాన బ్రంహాండాన్ని గ్రహించి ఎన్నో అనుభవాలను తెలుసుకుంటున్నావా 

భాషను మంత్ర జ్ఞానంగా అవగాహన చేసుకొని యంత్ర జ్ఞానంగా మార్చుకొని ఎన్నో యంత్రాలను సృష్టిస్తున్నావా 
యంత్రాలతోనే ఎన్నో పర భాషలను మర భాషలను లిఖిస్తూ అవగాహనతో ఎన్నో కీలకమైన యంత్రాలను సృష్టిస్తున్నావా శ్రమను విజ్ఞానాన్ని వివిధ రకాలుగా మార్చుతున్నావా అద్భుతంగా ఆశ్చర్యంగా చూపుతున్నావా 


-- వివరణ ఇంకా ఉన్నది! 

No comments:

Post a Comment