మర్మాంతర్యామి! పరమాత్మగా నీవు బ్రంహాండమంతా నిలయమై ఉండుటలో పరమార్థం ఏమిటి
అంతర్యామిగా విశ్వ రూపములతో ఉద్భవిస్తున్న నీ స్వభావ తత్త్వములు మర్మాంతర్యామిగా మహా రహస్యమై మేధస్సులో మంత్ర ప్రశ్నగా మిగిలిపోయినది
పరమాత్మ పరమార్థంచే అంతర్యామిగా అంతర్భావాలతో అంతరంగంలో ఉన్న నీవు ధ్యాన పరిశోధన ధార మంత్ర తత్వ జ్ఞానంచే మర్మాంతర్యామిగా శ్వాసలో జీవిస్తూ పంచభూతాలతో నిలయమై సర్వాంతర్యామిగా బ్రంహాండమంతా ఆకార రూపాలతో పరిభ్రమిస్తూనే ఉన్నావు
శాస్త్రీయం తెలియనంత వరకు పరిశోధనచే శ్రమిస్తూనే జీవన విధానాన్ని విజ్ఞానంతో సాగించుటకు శ్వాస ప్రయాస సాగించాలి సమస్తం అన్వేషిస్తూ సూక్ష్మంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి
శాస్త్రీయములు అనంతం ప్రతి అణువు యొక్క శాస్త్రీయ విధానం విభేదం ప్రతి పరమాణువు జీవన సిద్ధాంతం విశేషం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి