భూలోకంలోనే ఉన్నావు నీవు విశ్వంలోనే ఉంటావు నీవు
సృష్టి ప్రదేశంలోనే ఉన్నావు నీవు జగతిలోనే ఉంటావు నీవు
అచలమై నిశ్చలమై అనంతమై అంతర్యామివై ఎక్కడైనా ఉంటావు నీవు
ఎక్కడున్నా అక్కడే అఖిలమై అమరమై అపారమై నాతోనే ఉంటావు నీవు
నీవు ఉన్నట్లు తెలియకున్నా నేను ఉన్నట్లు తోచకున్నా దైవ స్మరణంలోనే జీవమై శ్వాసగా కలసి ఉంటాము మనము || భూలోకంలోనే ||
అణువులో ఉన్నా పరమాణువులో ఉన్నా ఆత్మలో ఉన్న పరమాత్మలో ఉన్నా పర రూపమై జీవంతో ఉంటావు నీవు
పంచభూతాలతో ఉన్నా అష్ట దిక్కులలో ఉన్నా ఎవరితో ఎక్కడ ఎలా ఉంటావో కార్యములకే తెలిసి ఉంటావు నీవు
ఆలోచనలతోనే ఉన్నా పరిశోధనలలోనే ఉన్నా ప్రతి సమయం సాగుతూ ఉన్నట్లు కాలంతోనే కలిసి ఉంటావు నీవు
ప్రయాణాలతోనే ఉన్నా పర్యావరణాలలోనే ఉన్నా ప్రతి ఋతువు మారుతూ ఉన్నట్లు ప్రకృతితోనే కలిగి ఉంటావు నీవు || భూలోకంలోనే ||
పరిశుద్ధంతోనే ఉన్నా ప్రకాశములలో ఉన్నా తేజోదయమై ప్రజ్వలిస్తూనే కాంతి స్వరూపమై సాగుతూ ఉంటావు నీవు
అభ్యుదయంతోనే ఉన్నా సూర్యోదయములలో ఉన్నా అఖండ జ్యోతి స్వరూపమై విశ్వంతో వెలుగుతూనే ఉంటావు నీవు
అనంతమై ఉన్నా సమస్తమై ఉన్నా అంతర్యామిగా బ్రంహాండమంతా అంతర్భావంతో అదృశ్యంతోనే ఉంటావు నీవు
అఖిలమై ఉన్నా అఖండమై ఉన్నా అంతరజ్యోతిగా విశ్వశాలమంతా అంతరాత్మత్వంతో ఆధ్యాత్మకంతోనే ఉంటావు నీవు || భూలోకంలోనే ||
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి