ఏనాటి జీవమో ఎంతటి జన్మమో ఏ విధమైన జీవితమో ఎలాంటి జ్ఞానమో అన్నీ కార్యాలుగా సాగిపోవునే
శ్వాసకే తెలియని జీవమా జన్మకే తెలియని జననమా జీవనమే తెలియని జీవితమా కార్యమే తెలియని జ్ఞానమే అన్నీ కార్యాలుగా సాగిపోవుటలో గమనిస్తూనే నేర్చుకోవడం జ్ఞాపకాలతో సరిచేసుకోవడం విజ్ఞానంతో పరిస్కారించుకోవడం
జీవించుటలో కలిగే శ్రమలో శ్వాసకు ఎన్ని ప్రయాసాలో హృదయానికి ఎన్ని వేదనలో మేధస్సుకు ఎన్ని ఆలోచనలో కార్యాలుగా ప్రతీది శరీరమే సర్వస్వమై దేహమై ధైర్యమై శక్తి సామర్థ్యాలతో జీవన విధానాన్ని సక్రమంగా సాగించాలి
కార్యాలు ఎన్నున్నా శ్రమించడంలో ప్రశాంతత పొందడమే మనస్సుకు మేధస్సుకు శరీరానికి శ్వాసకు హృదయానికి అవయవాలకు అన్ని కణాలకు సామర్థ్యం పునఃప్రారంభం చేసుకోవడమే ఆరోగ్యం ఆనందం అనుబంధం అపూర్వం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి