ఎంత కాలం విజ్ఞానాన్ని నేర్చుకుంటావు ఎంత వరకు అర్థం చేసుకుంటావు ఎంత భాగం విశ్వాన్ని పరిశోధిస్తావు
విశ్వాన్ని పరిశోధించకపోతే నీ జీవన విధానం జీవిత కాల ప్రయాణంలో ఒక భాగమైన ప్రయోజనం లేకుండా పోతుంది
విశ్వ పరిశోధన లేని జ్ఞానం కేవలం జీవన విధాన కార్యక్రమాల సమయాన్ని సాధారణంగా సాగించడమే
విశ్వ పరిశోధనలో విశ్వ విజ్ఞానం విశ్వ పరిశుద్ధత విశ్వ పరిశీలన విశ్వ శాస్త్రీయం విశ్వ సిద్ధాంతం విశ్వ వైద్య ఔషధం విశ్వ ఆహారం విశ్వ ఋతువుల ప్రభావం విశ్వ రూపాల ఆకార స్వభావ తత్వాలు వివిధ ప్రకృతి వేదనలు సకల జీవరాసుల జీవన విధానాలు అనంత బ్రంహాండంలో దాగిన అంతరిక్ష అపార రహస్యములు మొదలైనవి ఎన్నో విరివిగా నిక్షిప్తమై ఉన్నాయి
మానవుడు పరిశోధించకపోతే ఏ జీవి పరిశోధించడానికి సాధ్యం కాదు మానవ మేధస్సును మించిన విజ్ఞాన పరిశోధన ఏ జీవికి లేదు
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment