31, జులై 2026, శుక్రవారం

ఇంట్లో ఉంటే ఆహారాన్ని తయారు చేసుకోవాలి శ్రమించాలి

ఇంట్లో ఉంటే ఆహారాన్ని తయారు చేసుకోవాలి శ్రమించాలి పరిశుద్ధం చేసుకోవాలి బంధాల భాద్యతలను తెలుసుకోవాలి 
సమాజంలో ఉంటే విజ్ఞానం చెందాలి శ్రమించాలి ఉద్యోగం చేయాలి జీవనోపాధిని సాగించాలి కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలి అభివృద్ధి చెందాలి రక్షించుకోవాలి 

సమాజంలో విజ్ఞానంతో పాటు ఉద్యోగంతో పాటు కుటుంబ సమస్యల పరిష్కారాలు ఉంటాయి అలాగే ఆస్తులను అభివృద్ధి చేసుకునే మార్గాలు ఉంటాయి 

ఉద్యోగం కుటుంబ అభివృద్ధి లక్షణం జీవిత శ్రమ ఫలితం జీవన విధాన మార్గం 

ఉద్యోగం ఉంటే మీ ఆస్తులు మీ చుట్టు ప్రక్కల కనిపిస్తూ ఉంటాయి లేదా గ్రామానికి దూరంగా తెలియనంతగా ఉంటాయి 
ఉద్యోగం ఉంటే దగ్గరగా ఉన్న ఆస్తులు తక్కువ ధరలకే ఎక్కువ కొలతలతో మీకు లభిస్తాయి ఉద్యోగం ఐశ్వర్యం లేకపోతే వృద్ధాప్యంలో ఎక్కడో గ్రామానికి దూరంగా కొంత ప్రదేశం తక్కువ కొలతలతో అధిక ధరలతో లభిస్తాయి 

ఉద్యోగంతో పాటు ఐశ్వర్యం యవ్వనంలో ఉంటే ఆస్తులను కొనుగోలు చేస్తూ సంపాదిస్తూ రాజులా యజమానిలా జీవించవచ్చు 
జీవించుటలో ఉద్యోగ అభివృద్ధి లేదా ఐశ్వర్య అభివృద్ధి ఉంటే అన్నీ సమకూరుతాయి జీవితంలో శ్రమ ఫలితంగా లభిస్తుంది ఆరోగ్యంగా సాగుతుంది 

ఐశ్వర్యం ఉన్నా లేకున్నా సమాజంలో ఉద్యోగంతో జీవిస్తేనే జీవితం యొక్క పరమార్థం తెలుస్తుంది శ్రమ శాంతిస్తుంది మేధస్సు విజ్ఞానవంతమవుతుంది కుటుంబం అభివృద్ధి చెందుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి