నీ ప్రక్కన ఉన్న వారికి భయాందోళనగల ప్రమాదం కలుగుతున్నను నీలో చలనం లేదంటే మతిలో అధోగతి ఉన్నదా
నీవు స్పందించుటలో ప్రమాదాన్ని ఆపవచ్చు నిలుపుదల చేయవచ్చు అదుపు చేయవచ్చు వారిని రక్షించవచ్చు
నీ కార్యంలో గమనం ఉన్నట్లు చుట్టు ప్రక్కల కలిగే కార్యాలపై కూడా అవగాహన దేహ స్పందన కలిగివుండాలి
నీవు నీ కోసమే కాదు జీవిస్తున్నావు నీవు నీ కుటుంబం కోసం నీ సమాజం కోసం నీ ఎదుగుదల కోసం జీవిస్తున్నావు
నీవు ఎదుగుటలో ఎన్నో నేర్చుకోవాలి ఎన్నో తెలుసుకోవాలి ఎందరికో సహాయం చేయాలి ఎందరినో పోషించాలి ఎందరినో చూసుకోవాలి ఎందరినో రక్షించాలి ఎందరికో విజ్ఞాన ధైర్యాన్ని కలిగించాలి అందరిని ప్రోత్సహించాలి
సమాజంలో నీకు ఎవరు ఎలా ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉపయోగపడతారో నీకు తెలియదు తెలియకున్నను నీవు సమాజాన్ని గౌరవంగా సంస్కారవంతంగా చూసుకోవాలి రక్షించుకోవాలి పరిశుద్ధంగా స్వచ్చంగా ఉంచుకోవాలి
నీ చుట్టూ ఎటువంటి అపాయం కలుగుతున్నను కాస్త స్పందించగలిగితే నీలో ఉన్న మార్పు నీకు నీ వారికి విజయమవుతుంది నీలో విజ్ఞానం కలుగుతుంది నీ సామర్థ్యం పెరుగుతుంది నిన్ను అభివృద్ధి పరుస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment