పరమాత్మా! విశ్వ కార్యములలో నాకై శుభ కార్యములు లేవా
జన్మించిన నాటి నుండి నేటి వరకు వేచి వేచి అలసిపోతున్నా
ఆరోగ్యం లేక సామర్థ్యం లేక శరీర దేహాలు సతమతమవుతూ సహించలేక పోతున్నాయి
కళ్యాణము కూడా అశుభమై సాగిపోయిందని బంధమే వేధిస్తున్నది
శుభములే లేని జీవన విధానంలో కార్యములు ఎంతటి కఠినమైనవో
ప్రతి కార్యమును అశుభముగా సాగిస్తూ మేధస్సును వంచన చేస్తున్న బంధానికి వెర్రి విజ్ఞానమైనను లేదా
ప్రతి కార్యమును ఆందోళనగా మార్చుతూ మనస్సును విరిచి హింసిస్తున్న బంధానికి గింజ జ్ఞానమైనను లేదా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి