పరమాత్మా! మన బంధం మనకే తెలుసూ
పరమాత్మా! మన కార్యం మనకే తెలుసూ
పరమాత్మా! మన జీవం మనకే తెలుసూ
పరమాత్మా! మన రూపం మనకే తెలుసూ
ఆత్మగా నేను తెలిసినా పర ఆత్మగా నీవు ఉన్నట్లు మనకే తెలుసునా
అణువుగా నేను తెలిసినా పరమాణువుగా నీవు ఉన్నట్లు మనకే తెలుసునా
నీవుగా ఉద్బవించుటలో నేనుగా అవతరిస్తూ ఉన్నానని మనకే తెలుసూ
నీవుగా ఉదయించుటలో నేనుగా అధిరోహిస్తూ ఉంటానని మనకే తెలుసూ
ఏ రూపంతో జీవిస్తున్నా ప్రతిరూపంలో నేనుగా ఉన్నానని మనకే తెలుసూ
ఏ జీవంతో సాగుతున్నా ప్రతికార్యంలో నేనుగా ఉంటానని మనకే తెలుసూ || పరమాత్మా! ||
జీవన విధానంలో ప్రకృతిగా జీవిస్తున్నా పంచభూతాలలో మనమే ఉన్నామని మనకే తెలుసూ
జీవిత చదరంగంలో ఆకృతిగా సాగుతున్నా మహా కార్యాలలో మనమే ఉన్నామని మనకే తెలుసూ
అంతర్భావాలతో ఉదయించే తత్త్వంలో పరిశుద్ధతగా ఉద్భవిస్తున్న పర్యావరణం మనకే తెలుసూ
అంతరతత్త్వాలతో విశ్వసించే భావాలలో పరిమళంతో వికసిస్తున్న పత్రహరితనం మనకే తెలుసూ || పరమాత్మా! ||
కనిపించని నీ రూపం ఆకృతుల స్వభావాలతో విశ్వసించే తత్త్వం అపురూపమైనదని మనకే తెలుసూ
వినిపించని నీ స్వరం ఆకారాల తత్త్వాలతో విస్మయించే స్వభావం అపారప్రదమైనదని మనకే తెలుసూ
అత్యంతమైన విశ్వ రూపాలతో వెలిసిన మహా స్వరూపాలలో ఉన్న మహనీయం మనకే తెలుసూ
అనంతమైన విశ్వ ఆకారాలలో జీవిస్తున్న మహా కార్యాలలో ఉన్న మమత్వనీయం మనకే తెలుసూ || పరమాత్మా! ||
పంచ భూతాలతో పరిశోధిస్తూ ఉంటావని విశ్వ భూతాలతో అన్వేషిస్తూ ఉన్నావని మనకే తెలుసూ
దైవ భూతాలతో పరిశుద్ధమవుతూ ఉంటావని ధర్మ భూతాలతో పరిమళిస్తూ ఉన్నావని మనకే తెలుసూ
మహా భూతాలతో పరిభ్రమణం చెందుతున్నావని మంత్ర భూతాలతో పరిచయం చేస్తున్నావని మనకే తెలుసూ
మర్మ భూతాలతో పరమాత్మం చెందుతున్నావని మాయ భూతాలతో ప్రజ్ఞానం చెందుతున్నావని మనకే తెలుసూ
|| పరమాత్మా! ||
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి