23, సెప్టెంబర్ 2026, బుధవారం

భూగర్భంలో ఉన్న మట్టి స్వచ్ఛమైనది సారవంతమైనది అమృతమైనది

భూగర్భంలో ఉన్న మట్టి స్వచ్ఛమైనది సారవంతమైనది అమృతమైనది 
భూగర్భంలో ఉన్న మట్టి ధృడమైనది పరిమళమైనది సుగంధత్త్వమైనది 

భూగర్భంలో ఉన్న మట్టి ఆహారమైనది అద్భుతమైనది మాణిక్యమైనది 
భూగర్భంలో ఉన్న మట్టి అపూర్వమైనది అపారమైనది విస్తృతమైనది 
 
భూగర్భంలో ఉన్న మట్టి అనేక రకాలుగా నిరంతరం ఉపయోగపడుతున్నది 

భూగర్భంలో ఉన్న మట్టి ప్రకృతి ఉద్భవించుటకు ఎదుగుటకు జీవంతో సాగేందుకు మహత్త్వమై నిలయమైనది 

భూమి పొరలలో ఉన్న మట్టి జీవించుటకు ఆకార రూప స్వరూపాలు నిలుచుటకు ఆధారమైనది  
భూమి పై భారాన్ని మోపుతూ అనేక విధాల కార్యక్రమాలను ప్రయాణాలను నిర్మాణాలను ప్రయోగాలను జీవితాలను తరతరాలుగా యుగయుగాలుగా సాగిస్తున్నాము 

భూగర్భంలో ఉన్న సువర్ణమైన మట్టిని త్రవ్వుతూ అనేక విధాల అజ్ఞానంతో కలుషితం చేసున్నాము ప్రకృతిని కృత్రిమంగా మార్చుతున్నాము జీవ శక్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాము 

ఎత్తైన నిర్మాణముల ద్వార సూర్యశక్తిని పంచభూతాల శక్తిని శరీర నిరోధక సామర్థ్యాన్ని కోల్పోతున్నాము 

జీవుల జీవన విధానాన్ని కృత్రిమ విధంగా మార్చుకుంటూ శ్రమకు ప్రయోజనం లేకుండా విజ్ఞానం ఉన్నా అజ్ఞానంతో జీవిస్తున్నాము 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి