ఉత్తముడు పురుషోత్తముడే నీకు సహకార బంధమై వచ్చినా క్రోధాగ్నితో అజ్ఞానం చెందుతూనే హింసిస్తున్నావు
వాడుకలేని భాష వ్యర్థమైన భాష దుర్గంధమైన భాషతో మహాత్ముడునే మతిస్థిమితం లేకుండా చేస్తూ దూషిస్తున్నావు
జీవించుటలో శ్రమించుట తెలియక అజ్ఞానంతో కాలక్షేపం చేస్తూ అనారోగ్యాన్ని కలిగించుకుంటూ ఎదుగుతున్నావు
జీవన విధానం తెలియక ఐశ్వర్య ఆడంబరాల అలంకారాల అత్యాసాలతో అనిగి మునిగి ఉండలేక దుర్బలమవుతున్నావు
గుణములు తెలియవు లక్షణములు తెలియవు స్వభావములు తెలియవు తత్త్వములు తెలియవు
శ్రమించడం తెలియదు వినయం తెలియదు గౌరవించడం తెలియదు విజ్ఞానం తెలియదు మాట్లాడటం తెలియదు
అవసరాలు తెలియవు ఆచారాలు తెలియవు సాంప్రదాయాలు తెలియవు సంసార సంస్కారములు తెలియవు
సహాయం తెలియదు సమస్య తెలియదు పరిస్థితి తెలియదు పరిణామం తెలియదు ప్రభావం తెలియదు
అవసరం లేని వాటిపై దృష్టి పెడుతూ కాలక్షేపంతో జీవన విధానాన్ని అయోమయంతో సాగిస్తూ మూర్ఖత్వంతో దాంపత్యం తెలియకుండా జీవిస్తున్నావు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి