నాభిలో పద్మంతో జీవమై ఉద్భవించిన బహు ముఖ పర రూప దర్శనం బ్రంహాండానికి భ్రమగా ఉన్నా బ్రంహగా ప్రముఖమై నిలిచివున్నాడు
బహు ముఖములు కలిగిన బ్రంహ బహు మేధస్సులతో బ్రంహాండాన్ని సర్వ కార్యాలతో పరిశోధిస్తూ అనేక విధాలైన శాస్త్రీయములను కార్యక్రమ కారణ సిద్ధాంతాలుగా తెలుసుకున్నాడు
మానవుడు ఒక నిమిషానికి ఒక విషయాన్ని ఆలోచిస్తే బ్రంహ తన బహు ముఖ మేధస్సులతో ఒక నిమిషానికి అనేక విషయాలను ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుకున్నాడు
ఏక కాలంలో బ్రంహాండాన్ని వివిధ రకాలుగా భూత (గత) వర్తమాన (ప్రస్తుతం) భవిష్య (రాబోయే కాలం) కార్యాలను గమనిస్తూ పరమార్థమైన అవగాహనాలతో ఆలోచించేలా మేధస్సు విధానాన్ని ప్రజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్నాడు
బ్రంహ జ్ఞానం పర ధ్యాస ప్రభావితం (ఏ మేధస్సులో ఎటువంటి ఆలోచనలను గమనిస్తూ ఉంటాడో బ్రంహాండానికి కూడా భ్రమగానే ఉంటుంది)
బ్రంహ జ్ఞానంతో భ్రమలో పడవద్దు పరధ్యాసతో ప్రభావం చెందవద్దు యాదార్థ ఆలోచనలతో కార్యాలను చేసుకుంటూ సాధారణ మానవ జీవన విధానాన్ని సాగిస్తూ జీవితాన్ని ఆచరణతో విజ్ఞానంతో ఆస్వాదించు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి