జీవితంలో ఏది వెళ్ళిపోయినా శ్రమ మాత్రం వెళ్ళిపోదు
శ్రమ శ్వాసతోనే వెళ్ళిపోతుంది ధ్యాసతోనే తప్పిపోతోంది
శ్వాస ధ్యాస ఉన్నంతవరకు శ్రమ సాగుతూనే ఉంటుంది
శ్రమకు శరీరం సహకరించకపోయినా శ్వాస ఉంటే చాలు దేహాన్ని శ్రమింపజేస్తుంది
శరీర అనారోగ్యంతో ఉన్నా అవయవాల అవస్థలతో ఉన్నా శ్వాసతోనే దేహం శ్రమిస్తుంది
శరీరానికి చలనం లేకున్నా దేహంలో శ్వాస ప్రయాస ఉంటే చాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో శ్రమిస్తుంది
శ్వాస ఎంతటి ధృఢత్వమైన బంధంతో శరీర దేహంలో జీవిస్తుందో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాసాలకు సహనం లేకున్నా సాగిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion