అనంత రూపములలో అత్యంత జీవమై ఆనంద స్వరూపంతో దర్శనమిచ్చేవా
అపార రూపములలో ఆద్యంత జీవమై ఆకార సదృశ్యంతో విస్తృతమయ్యేవా
అఖండ భావాల స్వభావాలతో అనంత పద్మములై వికసిస్తూ పరిశుద్ధమై ఉదయించేవా
ఆబంధ భావాల తత్త్వములతో ఆశ్రిత వ్యూహమై వ్యాపిస్తూ సుగంధనమై ఉద్భవించేవా
నాభియందు నివాసం చేసుకున్న బ్రంహ జననం పద్మమై పరమాత్మంతో పవిత్రమై వెలిసేనా
కేంద్రమందు ఆశ్రయం విచ్చుకున్న దేహ భువనం పుష్పమై పరమార్ధంతో ప్రజ్ఞానమై వెలిగేనా
అద్భుత రూపములతో ఆకార వర్ణములతో సుగంధ పరిమళాలతో విశ్వమంతా పర్యావరణం చేసెదవా
ఆశ్చర్య భావములతో ఆధార బంధాలతో సువిదత్ర అనురాగాలతో జగమంతా పరిశుద్ధతం చూపెదవా
సూర్యోదయమై సుగంధాలను వెదజల్లుతూ పారిజాత పద్మముల పరిమళాలను దేహానికి అందించెదవా
సూర్యతేజమై సువర్ణములను ప్రసరిస్తూ కాంతుల పుష్పాలతో సౌరభ్యములను శరీరానికి అనుకరించేవా
బ్రంహాండ స్వరూపమై భ్రమకార బ్రంహోత్తరమై బహురూప బంధనమై బహుకరంతో దర్శనమిచ్చేవా
బహురూప స్వధారమై బహుగుణ భ్రమణమై స్వయంభువ సాగరమై సకలజీవంతో సమర్థమిచ్చేవా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion