జగతికే జన్మను ఇచ్చిన స్వభావం జనని తత్త్వానికైనా తెలియునా
జన్మతో జననికి కలిగిన స్వభావం జగతి తత్త్వానికైనా తెలుసునా
జన్మతో కలిగే భావ స్వభావాల తత్త్వాలు మాతృత్త్వానికే అమర గుణ వేదములు
జన్మలో పొందే జనని స్వభావాల తత్త్వాలు అమృతమైన అదర మాతృ భరణములు
ప్రకృతిలో ఉద్భవించే మాతృత్త్వం జగతికి జన్మను కలిగించిన జనని ప్రతి రూప స్వరూపం
ఆకృతిలో వికసించే మమకారత్త్వం రూపానికే కలిగే స్వభావత్వ సదృశ రూప చిత్ర స్వరూపం
జననం ఇచ్చుటలో కలిగిన బంధానికి మరణమే తెలియదా మమకార మాతృత్త్వానికి
స్మరణం ఇచ్చుటలో తెలిసిన బంధానికి అపరాధమే తోచదా సహకార శరీరత్త్వానికి
జగమంతా జననమై సమస్తం జీవమై సమయోగ కార్యములై జీవధార బంధాలే ఉద్భవించునా
విశ్వమంతా జనకమై సమయం జీవనమై జీవితాల కార్యములై జీవయోగ విధానాలే విశ్వసించునా
బంధమే బహు అకార రూపాల అలంకార అనుబంధమై అనేక ఆకృతులతో ఆవిర్భవించిన స్వరూపాల విన్యాసం
బంధమే జీవ సహకార రూపాల అనూహ్య ప్రబంధమై అనంత దేహములతో అవతరించిన స్వరూపాల సరసమం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion