28, సెప్టెంబర్ 2026, సోమవారం

శ్రమించడం గొప్ప కాదు సంపాదన చేయడం మహా అద్భుతం

శ్రమించడం గొప్ప కాదు సంపాదన చేయడం మహా అద్భుతం 
శ్రమించుటలో ఫలితం లేకున్నా శ్రమించుటలో తెలియని లోపం 

శ్రమించే విధానం తెలియకపోయినా శ్రమకు కలిగే ఫలితం స్వల్పం లేదా శూన్యం లేదా నష్టం లేదా అజ్ఞానం ఆశాంతం అనారోగ్యం అజాగ్రత్త అసౌకర్యం అవస్థతత్త్వం  

శ్రమలో సంపాదన లేకపోతే శ్రమించే విధానాన్ని శ్రమించే కార్యాన్ని శ్రమించే జ్ఞానాన్ని మార్చుకోవాలి శ్రమించే సమయాన్ని కూడా మార్చుకోవాలి 
విజ్ఞానవంతమైన క్రొత్త వాటిని తెలుసుకొని నేర్పరితనంతో అనుభవాన్ని గ్రహిస్తూ కార్యాచరణతో శ్రమించాలి 

శ్రవించుటలో విజ్ఞానంతో అనుభవంతో  ఉండాలి అజ్ఞానం చెందకూడదు 
శ్రమించుటలో జాగ్రత్తలు తెలుసుకోవాలి అజాగ్రత్తతో ఉండకూడదు 
శ్రమించుటలో ఆరోగ్యంతో ఉండాలి అనారోగ్యం చెందకూడదు 
శ్రమించుటలో రక్షణతో సాగాలి ప్రమాదాన్ని ముందుగానే  గ్రహించాలి 
శ్రమించుటలో పరిశుద్ధత ఉండాలి అశుద్ధతతో చేయకూడదు 
శ్రమించుటలో సామర్థ్యం ఉండాలి అసమర్థత ఉండకూడదు సహనాన్ని కోల్పోరాదు 
శ్రమించుటలో నేర్పరితనం ఉండాలి పెంచుకోవాలి మరుపు ఉండరాదు 
శ్రవించుటలో కార్యాచరణ కార్యక్రమ విధాన ప్రణాళిక తెలిసివుండాలి కార్యక్రమాన్ని మరచిపోరాదు తప్పరాదు 
శ్రవించుటలో ప్రయోజనం తెలిసివుండాలి నిష్ప్రయోజనం కలగకుండా చూసుకోవాలి  
శ్రమించుటలో శ్రద్ధ ఓర్పు సమయ సాధన ఉండాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు 
శ్రమించుటలో క్రొత్తగా ఆలోచించే అవగాహన గమనం ఉండాలి ఉపాయాన్ని గ్రహించాలి అపాయాన్ని సృష్టించరాదు 
శ్రవించుటలో భవిష్య కాల జ్ఞానం కూడా తెలిసివుండాలి నేటి జ్ఞానం ఎంత వరకు ఉపయోగమో తెలుసుకోవాలి 
శ్రవించుటలో శిక్షణ తీసుకోవచ్చు శిక్షించే విధంగా చేయకూడదు 
శ్రమించుటలో సలహా సహాయం అర్థవంతంగా స్వీకరించవచ్చు అహంతో వదులుకోరాదు 
శ్రవించుటలో అభివృద్ధి ఉండాలి అనాభివృద్ది చెందరాదు 
శ్రవించుటలో అనుభవం నైపుణ్యం ప్రావీణ్యం పొందాలి ఉన్నది ఉన్నట్లుగా ఎంతో కాలం అలాగే సాగించరాదు 
శ్రమించుటలో సమయోచితంగా ఉండాలి సరైన సమయానికి ముగించాలి ఆలస్యం చేయకూడదు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి