ఉద్యోగం సగం బలం ఇద్దరైతే సంపూర్ణం బలం
ఒకరి ఉద్యోగం కుటుంబానికి సగం బలం అదే ఇద్దరి ఉద్యోగమైతే కుటుంబానికి సంపూర్ణ బలాన్ని ఇస్తుంది
ఒకరి బలం కొంత కాలం తర్వాత అనారోగ్యంగా మారిపోవచ్చు ఐశ్వర్యం అభివృద్ధి లేకుండా సాగిపోవచ్చు
కలసికట్టుగా సాగిపోతే కుటుంబంలో శ్రమ సహనంతో సామర్థ్యంతో ఆరోగ్యంతో ప్రశాంతతతో సాగిపోతూ విజ్ఞానంతో అభివృద్ధితో ఐశ్వర్యంతో ఆనందంతో ఎదుగుతూ పోతుంది
కలసికట్టుగా అందరు కలిసిమెలసి ఉంటేనే తరతరాలుగా అభ్యుదయంతో మహాగొప్ప విజయాలతో జీవిస్తారు
ఏదైనా సరే ఒక మనిషికి సగం బలాన్ని మాత్రమే ఇస్తుంది అదే కలసికట్టుగా ఉంటే సంపూర్ణ బలంగా మారుతుంది
శ్రమ ఐనా సామర్థ్యమైనా విజ్ఞానమైనా ఆరోగ్యమైనా ఆనందమైనా ఐశ్వర్యమైనా ఇద్దరు కలసికట్టుగా ఉంటేనే అన్నీ సంపూర్ణంగా పరమార్థంగా ప్రాప్తిస్తాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి