8, సెప్టెంబర్ 2026, మంగళవారం

దేహమంతా హిమాలయాలలో నిండుకున్నది శరీరమంతా సాగరములతో నిండియున్నది

దేహమంతా హిమాలయాలలో నిండుకున్నది శరీరమంతా సాగరములతో నిండియున్నది 
నదులు ప్రవహిస్తూనే సెలయేరులు సరస్సులు సమతుల్యంతో విశాలంగా నిండుకున్నాయి 

భూ ప్రదేశమే అనేకమైన నిర్మాణములతో వ్యర్థములతో దుర్వాసనాలతో నిండిపోతున్నది 
స్వచ్ఛమైన ప్రకృతి పర్యావరణం పత్రహరితం లేక కాలుష్యమై జీవన విధానాన్ని అపార ఖర్చులతో సాగిస్తున్నది 

మానవునికి ఆహారం కన్నా విలాసవంతమైన సౌకర్యాల వసతుల గృహ స్వార్థ వస్తువుల పైననే అత్యాస జీవన విధానం సాగుతున్నది 

మానవుడు ఎంతటి విజ్ఞాన జీవియో అంత కన్నా ఎక్కువగా అజ్ఞాన జీవిగా తనలో తానై ఉంటాడు 

ప్రకృతిని ఎలా ఎంత జాగ్రత్తగా ప్రతి నాణ్యమైన అణువును ఎలా ఉపయోగించుకోవాలో తెలియుట లేదు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి