11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జీవితంలో మంచి భర్త లేక మంచి భార్య కన్నా మంచి ఉద్యోగాన్ని సాధించండి

జీవితంలో మంచి భర్త లేక మంచి భార్య కన్నా మంచి ఉద్యోగాన్ని సాధించండి 
మంచి ఉద్యోగం ఉంటేనే జీవితం సరైన విజ్ఞాన ఆలోచనల కార్యక్రమాలతో జీవన విధానం సాగిపోతుంది 

ఉద్యోగం లేకపోతే జీవితమంతా ప్రతి రోజు అజ్ఞాన ఆలోచనలతో అనారోగ్యంతో సాగిపోతుంది 
దినచర్య కార్యాలను ఖాళీ సమయంలో కాలక్షేపం చేసుకుంటూ యంత్రాల ద్వారా ముగించుకోవచ్చు 
కొన్ని కార్యాలను సెలవు రోజులలో ప్రశాంతంగా ప్రణాళిక పరంగా అనుభవంతో పరిశుద్ధంగా చేసుకోవచ్చు 

మంచి ఉద్యోగంతో కుటుంబంలో అందరికి మంచి ఆహారం మంచి విజ్ఞానం మంచి సౌకర్యం మంచి ఆరోగ్యం మంచి సామర్థ్యం మంచి బంధుత్వం మంచి పరిశోధనం మంచి పరిశుద్ధత మంచి జీవన విధానం మంచి జీవితం లభిస్తుంది 
మంచి ఐశ్వర్యం మంచి అభివృద్ధి మంచి ఎదుగుదల మంచి ప్రశాంతత మంచి సంతోషం మంచి అనుభవం కలుగుతుంది 

మంచి ఉద్యోగం (సంపాదన) ఉంటే ఖర్చులు ఎలా ఉన్నా ఎవరు ఎలా ఎంత ఖర్చు చేస్తున్నా భరించే ఆలోచన శక్తి కలుగుతుంది మేధస్సు ప్రశాంతంగా ఉంటుంది 

ఖర్చులు ఎక్కువగా సాగుతూ సంపాదన తక్కువగా ఉంటే ఇంటిలో ఇబ్బందులు సమస్యలు అనారోగ్యం అజ్ఞానం ఇలా ఎన్నో పెరిగిపోతూ పరిష్కారాలు లేక జీవితం విచారంగా మారుతూ మనిషికి మనిషికి మధ్య సంతోషం ప్రశాంతత తగ్గుతూ సాగిపోతుంది 

ఉద్యోగం సంపాదన కోసమే కాదు నేటి జీవన విధాన విజ్ఞాన ఆలోచనల ఆధునిక విజ్ఞానాన్ని భవిష్య జీవన విధానం కోసం ఉపయోగించుకోవడం 
ఆధునిక విజ్ఞానం మన కోసం కాకున్నా మన పిల్లల కోసం మన కుటుంబ అభివృద్ధి కోసం అవసరం 
నేటి సామాన్యమైన జీవన విధానం కూడా నెలకు సగటున లక్షల ఖర్చులతో సులభంగా సాగిపోతున్నది 

ఉద్యోగం చేయకపోతే సోమరితనం కన్నా అజ్ఞానం అనారోగ్యం అనాభివృద్ధి అజాగ్రత్త అవస్థ స్థితి పెరిగిపోతుంది 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి